కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాత్రి శివ నారాయణ ఇంటికి వచ్చిన దాసు జ్యోత్స్న తన కూతురు అని చెబుతాడు. దానికి అంతా షాక్ అవుతారు. పారిజాతం అడ్డుపడుతుంది. కానీ, దాసు మాట వినడు. నా మనవరాలు నీ కూతురు ఎలా అవుతుంది అని శివ నారాయణ అంటే.. బిడ్డలు మారిపోయారు సర్. నా కూతురు నీ కూతురు స్థానంలోకి వచ్చింది అన్నయ్య అని దాసు చెబుతాడు.
నేనే సాక్షిని

మరి నా కూతురు అని దశరథ్ అడిగితే.. ఈ ఇంటికి దూరంగా బతుకుతుంది అని దాసు అంటాడు. అసలు ఈ విషయం నీకు ఎలా తెలుసు అని సుమిత్ర అడిగితే.. నేనే ప్రత్యక్ష సాక్షిని. బిడ్డలను మార్చి చంపాలని చూశారు. కానీ, నీ కూతురు ఆయుష్షు గట్టిది అని దాసు అంటాడు. మరి నా కూతురు ఎవరు అని సుమిత్ర అంటే.. నీ ప్రాణదాత దీపే నీ కూతురు. బస్టాండ్‌లో వదిలేసిన దీపను కుబేర్ వెళ్లి పెంచుకున్నాడు అని దాసు చెబుతాడు.
శివ నారాయణ కోపంగా వచ్చి కాలర్ పట్టుకుని బిడ్డలను మార్చింది ఎవరో నీకు తెలుసు అన్నమాట చెప్పు అని దాసును నిలదీస్తాడు. పారిజాతం భయంతో దండం పెట్టుకుంటుంది. మా అమ్మ పారిజాతం అని నిజం చెప్పేస్తాడు దాసు. మీ మీద పగతోనే ఇలా చేసిందని దాసు అంటాడు. శివ నారాయణ కోపం కట్టలు తెంచుకుంటుంది.
క్షమించండి అని శివ నారాయణ కాళ్లమీద పడుతుంది పారు. ఛీ అని కాళ్లతోనే నెట్టేస్తాడు శివ నారాయణ. నువ్వు త్రాచుపామువి. ఇంకా ఈ పామును బతకనివ్వకూడదు అని లోపలికి వెళ్లిన శివ నారాయణ గన్ తీసుకొస్తాడు. నేను ఎక్కడ నిజం చెబుతానో అని నా కూతురే నన్ను చంపాలని చూసింది అని దాసు చెబుతాడు. దానికి పారిజాతం ఫైర్ అవుతుంది.
జ్యోత్స్న గన్‌తో కాల్చిన పారిజాతం
నీ కోసం నా జీవితం దారపోస్తే నువ్వు నా కొడుకునే చంపాలని చూస్తావా. ఏవండి మీరు నన్ను చంపడంలో తప్పు లేదు. కానీ, నేను చేసిన తప్పును ప్రక్షాళన చేసుకోనివ్వండి అని శివ నారాయణ నుంచి గన్ లాక్కుని జ్యోత్స్నను షూట్ చేస్తుంది పారిజాతం. గ్రానీ అంటూ ఒక్కసారిగా రియాల్టీలోకి తేరుకుంటుంది. ఏంటీ గ్రానీ, ఏమైంది అని దాసు అంటాడు.
{{/usCountry}}నీ కోసం నా జీవితం దారపోస్తే నువ్వు నా కొడుకునే చంపాలని చూస్తావా. ఏవండి మీరు నన్ను చంపడంలో తప్పు లేదు. కానీ, నేను చేసిన తప్పును ప్రక్షాళన చేసుకోనివ్వండి అని శివ నారాయణ నుంచి గన్ లాక్కుని జ్యోత్స్నను షూట్ చేస్తుంది పారిజాతం. గ్రానీ అంటూ ఒక్కసారిగా రియాల్టీలోకి తేరుకుంటుంది. ఏంటీ గ్రానీ, ఏమైంది అని దాసు అంటాడు.
{{/usCountry}}ఇది కల కాదు. నాన్న చెబితే జరిగేది ఇదే అని జ్యోత్స్న అంటుంది. దాసు నిజం చెబుతాను అని వెళ్తుంటే తండ్రిపై ఒక స్ప్రే కొడుతుంది. నేను నా జాగ్రత్తలో ఉన్నాను. చెబితే విన్నావా అని స్ప్రే కొడుతూనే ఉంటుంది జ్యోత్స్న. దాంతో దాసు స్పృహ కోల్పోతాడు దాసు. రౌడీలను పిలిచి తీసుకెళ్లమంటుంది. ఇంతలో కార్తీక్ వస్తాడు. అటు నుంచి తీసుకెళ్లండి అని చెబుతుంది జ్యోత్స్న.
ఇంతలో పారిజాతం వస్తుంది. నువ్వేంట్రా వచ్చావ్ అని పారు అడిగితే దాసు మావయ్య కోసం. ఇంట్లో లేడు అని కార్తీక్ అంటాడు. కార్తీక్ చుట్టూ చూస్తాడు. కారు పక్కనే దాసును దాచిపెడతారు రౌడీలు. కార్తీక్ తిరిగి వెళ్తాడు. కార్తీక్, పారును ఇద్దరి మ్యానేజ్ చేసి పంపిస్తుంది జ్యోత్స్న. రౌడీలను దాసును తీసుకెళ్తుంటే మెడలోని తాయిత్తు కిందపడుతుంది.
దాసు కిడ్నాప్
మరోవైపు కార్తీక్ గురించి దీప ఆలోచిస్తే కాంచన వచ్చి అడుగుతుంది. దాసు బాబాయ్ ఫోన్ చేస్తే వెళ్లాడని చెబుతుంది దీప. ఇంతలో కార్తీక్ వస్తాడు. దాసును కలిసావా అని కాంచన అడుగుతుంది. కలవలేదు అని కార్తీక్ అంటాడు. జరిగింది చెబుతాడు కార్తీక్. కాశీ బయటకు వచ్చాడుగా ఏదైనా గొడవ జరిగిందేమో అని దీప అంటుంది. దాసు మావయ్య ఎందుకు కలవలేదు, జ్యోత్స్న ఎందుకంత కంగారుగా ఉందని కార్తీక్ డౌట్ పడతాడు.
మరోవైపు దాసును కట్లతో బంధించి కిడ్నాప్ చేసిన జ్యోత్స్న ఇదంతా నీకు అవసరమా అని మాట్లాడుతుంది. చంపేస్తావా అని దాసు అంటే.. లేదు. నీ కూతురు మహారాణిలా ఎలా వెలుగిపోతుందో నువ్వు చూడాలి. కాశీకి నేనే నిజమైన అక్క అని చెబుతాను. ఇదంతా నీ కళ్లతో నువ్వు చూడాలి అని జ్యోత్స్న అంటుంది. దాంతో దాసు నవ్వుతాడు. నీకు టైమ్ దగ్గపడింది. తప్పుల నుంచి పాపాలు చేసే స్థాయికి వెళ్లావ్. నీ పతనం మొదలైంది అని దాసు అంటాడు.
జ్యోత్స్న స్కెచ్
ఎవరు ఆపుతారు అని జ్యోత్స్న అంటుండంగానే దాసుకు కార్తీక్ కాల్ చేస్తాడు. దానికి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టు. ఆన్‌లోనే ఉంచు. ఊరంతా తిరగండి. సిగ్నల్స్‌తో కనిపెట్టాలని చూసిన ఊరంతా తిరుగుతున్నాడని అనుకోవాలి అని జ్యోత్స్న స్కెచ్ వేస్తుంది. కానీ, ఇంట్లో పడిన దాసు తాయిత్తుతో కార్తీక్ పట్టుకోనున్నట్లు తెలుస్తోంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.