కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో హాస్పిటల్‌కు జ్యోత్స్నను తీసుకెళ్తారు. వెంటనే టెస్ట్‌లు చేయమని కార్తీక్ చెబుతాడు. దీనికి టెస్ట్‌లంటే భయమని పారిజాతం, బ్లడ్ చూస్తే కళ్లు తిరుగుతాయని జ్యోత్స్న అంటారు. అందరం ఉంటే అది భయపడుతుందని పారిజాతం వెళ్లిపోతుంది.
సుమిత్ర కూతురేనా మీరు

బ్లడ్ సాంపిల్స్ ఇవ్వలేనని, నేనే సాంపిల్స్ ఇవ్వాలా అని జ్యోత్స్న అంటుంది. నాకు అంత టైమ్ లేదని, అసలు మీరు సుమిత్ర కూతురేనా అని డాక్టర్ అంటుంది. కాదు డాక్టర్ తను సుమిత్ర అత్త కూతురు కాదని కార్తీక్ అంటాడు. జోక్స్ చేయకు బావ అని జ్యోత్స్న అంటుంది. నీ భయం నిజమవుతుంది మరదలా అని కార్తీక్ అంటాడు. దానికి జ్యో షాక్ అవుతుంది.
కార్తీక్‌ను బయట వెయిట్ చేయమని డాక్టర్ చెబుతుంది. దాంతో కార్తీక్ వెళ్లిపోతాడు. మరోవైపు పారిజాతం కొడుకు దాసుకు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయరు. ఇంకోవైపు కాంచన అన్నమాటలు తలుచుకుని శివ నారాయణ బాధపడుతుంటాడు. దీప వచ్చి అమ్మకు ఏం కాదు పెద్దయ్య అని ఓదారుస్తుంది. నువ్వు నన్ను తాతయ్య అని పిలొచ్చు. ఆ మాయరోగం ఏదో నాకు వచ్చిన బాగుండేది అని ఏడుస్తాడు శివ నారాయణ.
నా కొడుకు కూడా నాలాంటి పరిస్థితే అనుభవిస్తాడని భయంగా ఉంది. కాంచన కాల్ చేసి ఇంటి కోడలికి ఏదో శాపం ఉందని అంది. ఎంత అనుకున్న ధైర్యం చాలట్లేదు. పంతులు గారు గండం గురించి ముందే చెప్పారు అని శివ నారాయణ అంటాడు. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. అమ్మను తన కూతురే కాపాడుతుందని డాక్టర్ చెప్పారు కదా అని దీప అంటుంది.
జ్యోత్స్న వణికిపోతుంది
అవును, ఓసారి పంతులు గారితో మాట్లాడాలి అని కాల్ చేసి పిలుస్తాడు శివ నారాయణ. మరోవైపు జ్యోత్స్న సాంపిల్స్ ఇవ్వట్లేదని, ఎందుకని అడిగితే వణికిపోతుందని డాక్టర్ చెబుతుంది. నేను వెళ్లి ఒప్పిస్తానని కార్తీక్ వెళ్తాడు. సాంపిల్స్ ఇస్తావా తాతకు ఫోన్ చేయాలా. ఏదైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పు సహాయం చేస్తాను అని కార్తీక్ అంటాడు.
{{/usCountry}}అవును, ఓసారి పంతులు గారితో మాట్లాడాలి అని కాల్ చేసి పిలుస్తాడు శివ నారాయణ. మరోవైపు జ్యోత్స్న సాంపిల్స్ ఇవ్వట్లేదని, ఎందుకని అడిగితే వణికిపోతుందని డాక్టర్ చెబుతుంది. నేను వెళ్లి ఒప్పిస్తానని కార్తీక్ వెళ్తాడు. సాంపిల్స్ ఇస్తావా తాతకు ఫోన్ చేయాలా. ఏదైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పు సహాయం చేస్తాను అని కార్తీక్ అంటాడు.
{{/usCountry}}నాకు హాస్పిటల్ వాతావరణం పడట్లేదు అని జ్యోత్స్న అంటే తాతను పిలుస్తాను అని కార్తీక్ అంటాడు. అవసరం లేదు. ఇస్తాను అని జ్యోత్స్న అంటుంది. నీకు ముందు నుయ్యి వెనుక గొయ్యి చిన్న మరదలా అని కార్తీక్ అనుకుంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్లి జ్యోత్స్న ఒప్పుకుంది చెబుతాడు కార్తీక్. జ్యోత్స్న బ్లడ్ సాంపిల్స్ ఇస్తుంది. ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదని టెన్షన్ పడుతుంది జ్యోత్స్న.
మరోవైపు పంతులు ఇంటికి వస్తాడు. కర్మ ఫలితం ఎవరు తప్పించుకోలేరని, ఆరోజు హోమంలో పూర్ణాహుతి గుండంలో పడకపోతే సమస్యకు పరిష్కారం దొరికేది కాదు అని చెబుతాడు. సమస్య అప్పుడే మొదలైందని జ్యోత్స్న వచ్చి అంటే.. లేదు పూర్ణాహుతి నేలపాలు కాకుండా దీపే కాపాడింది అని పంతులు అంటాడు.
సాలెగూడులో చిక్కుకున్నట్లు
అయినా జ్యోత్స్న దీపని మాటలు అంటుంది. కార్తీక్ అడ్డుపడతాడు. జ్యోత్స్న బాగా టెన్షన్ పడుతుంది. ఆమె చెప్పుకోని బాధలు ఏమైనా ఉన్నాయో మొహం చూసి జాతకం చెప్పండి అని కార్తీక్ అంటాడు. దాంతో జ్యోత్స్న మొహం చూసి సాలెగూడులో చిక్కుకున్నట్లు ఇబ్బంది పడుతున్నావ్. ఆ ఇబ్బంది నుంచి బయటపడతావ్ అని పంతులు అంటాడు.
గడవబోయే కాలం మరింత కష్టంగా ఉంటుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని పంతులు అంటాడు. దీప గర్భవతి తన భవిష్యత్తు ఎలా ఉందో చెప్పమని అడుగుతాడు కార్తీక్. నీ భవిష్యత్తు కూడా కాస్తా ఇబ్బందికరంగానే ఉంది. నువ్వు కావాలనుకున్న దానికోసం నువ్వు కోరుకున్నది వదులుకోవాల్సి వస్తుంది. కానీ, నీకు శుభం జరుగుతుంది. సంచార జీవిలా తిరుగుతున్న నువ్వు సొంత గూటికి చేరే రోజు వస్తుందని పంతులు జాతకం చెబుతాడు.
మీరు అన్నది జరగదు. అమ్మాయికి సొంత గూడు అంటే పుట్టిల్లు. దీపకు కన్నవాళ్లు ఎవరో తెలియదు కదా అని పారు అంటే త్వరలోనే తెలుస్తుందమ్మా. కలవాలని రాసి ఉన్నప్పుడు జరుగుతుంది. అదే కర్మ సిద్ధాంతం అని పంతులు అంటాడు.
బిడ్డ జాగ్రత్తమ్మా
తర్వాత సుమిత్రతో మీకున్న గండం గట్టెక్కిందని చెప్పలేను కానీ కాస్తా జాగ్రత్త అవసరం, దీపతో బిడ్డ జాగ్రత్తమ్మా.. ఆ దేవుడిని నమ్ముకోండి. ఎవరికి ఏం కాదు అని పంతులు హెచ్చరించి వెళ్లిపోతాడు. జ్యోత్స్న బ్లడ్ సాంపిల్స్ రిపోర్ట్స్ గురించి ఫోన్ చేసి అడుగు, త్వరగా వచ్చేలా చూడమని చెప్పు అని దశరథ్‌కు చెబుతాడు శివ నారాయణ. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.