కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్ర రిపోర్ట్స్ గురించి కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. ఇంతలో దశరథ్ వచ్చి హాస్పిటల్‌కు వెళ్దామని చెబుతాడు. సరేనని దీపను టెన్షన్ పడకని చెప్పి కార్తీక్ వెళ్తాడు. ఇంతలో తులసి కోటలో ఉన్న దీపం ఆరిపోతుంది. అది చూసి దీప షాక్ అవుతుంది.
దశరథ్‌కు పెరిగిన బీపీ

హాస్పిటల్‌లో డాక్టర్ హారికను దశరథ్, కార్తీక్ కలుస్తారు. దశరథ్ కంగారు చూసి వాటర్ తాగమంటుంది డాక్టర్. దశరథ్ నీళ్లు తాగుతాడు. కార్తీక్ ఎవరు అని డాక్టర్ అడిగితే మేనల్లుడు, కొడుకు కంటే ఎక్కువ అని చాలా కంగారుగా చెబుతాడు దశరథ్. పక్కనున్న డాక్టర్‌కు దశరథ్ గారికి బీపీ చెక్ చేయించండి, హై బీపీ ఉన్నట్లుంది అని పంపిస్తుంది డాక్టర్ హారిక.
కార్తీక్‌ను మాత్రం ఉండమంటుంది. సుమిత్రకు ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెబుతుంది. మరోవైపు కాశీ గురించి ఏం ఆలోచించావ్ అని జ్యోత్స్నను అడుగుతుంది పారిజాతం. వెంటనే అయిపోదని జ్యో అంటుంది. కార్తీక్, దశరథ్ ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవాలని జ్యోని పిలుస్తుంది పారిజాతం. కాశీ జైల్లో ఉండటం గురించి నానా మాటలు అంటుంది పారిజాతం.
కాశీ పోతే స్వప్న మరో పెళ్లి చేసుకుంటుంది అని జ్యో అనబోతుంటే దీప ఆపుతుంది. దశరథ్ ఎక్కడికి వెళ్లాడని అడిగితే ఫోన్ చేసి కనుక్కోండని అంటుంది దీప. కాశీని అంతా వాడుకున్నారని రచ్చ చేస్తుంది పారిజాతం. కాఫీ ఇవ్వమని లాక్కుంటుంది. అది కింద పడుతుంది. దీప మీద అరుస్తూ వెళ్తుంటే శివ నారాయణ వచ్చి అడ్డుకుంటాడు.
పారిజాతంకు వార్నింగ్
కాఫీ ఎలా కింద పడిందో తెలుసు. మనవడు జైలులో ఉంటే కాఫీ తాగే అంత తీరిక ఎలా ఉందో మరి. నువ్వెళ్లొచ్చుగా పోలీస్ స్టేషన్‌కు. కావాలంటే రెండు రోజులు జైళ్లో ఉండు. ఎస్సైతో నేను మాట్లాడుతాను అని శివ నారాయణ అంటాడు. ఇంతలో సుమిత్ర వచ్చి దీపను ఎవరికి కాఫీలు ఇవ్వకని, వంటలు మాత్రం చేసుకోమ్మని చెబుతుంది. దీప వెళ్లి కాఫీ కప్ ఊడవడానికి వస్తుంది.
{{/usCountry}}కాఫీ ఎలా కింద పడిందో తెలుసు. మనవడు జైలులో ఉంటే కాఫీ తాగే అంత తీరిక ఎలా ఉందో మరి. నువ్వెళ్లొచ్చుగా పోలీస్ స్టేషన్‌కు. కావాలంటే రెండు రోజులు జైళ్లో ఉండు. ఎస్సైతో నేను మాట్లాడుతాను అని శివ నారాయణ అంటాడు. ఇంతలో సుమిత్ర వచ్చి దీపను ఎవరికి కాఫీలు ఇవ్వకని, వంటలు మాత్రం చేసుకోమ్మని చెబుతుంది. దీప వెళ్లి కాఫీ కప్ ఊడవడానికి వస్తుంది.
{{/usCountry}}అది వేరే వాళ్లు తీస్తారని దీపను పంపిస్తాడు శివ నారాయణ. పారిజాతాన్ని తీయమని చెబుతాడు. కాఫీ మరకలు లేకుండా తీసేలా చూడమని జ్యోకి చెప్పి వెళ్లిపోతాడు శివ నారాయణ. పారిజాతంతో ఊడిస్తుంది జ్యోత్స్న. ఆ దీప ఎందుకే ఏడుస్తుంది. ఇంట్లో మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని పారిజాతం అంటుంది.
మరోవైపు సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అని కార్తీక్‌కు డాక్టర్ చెబుతుంది. దాంతో కార్తీక్ షాక్ అవుతాడు. పంతులు చెప్పింది గుర్తు చేసుకుంటాడు. తల్లడిల్లిపోతాడు కార్తీక్. ఇప్పుడు ఏం చేయాలి, అత్తను ఎలా కాపాడుకోవాలి అని కార్తీక్ అడుగుతాడు. ఇంకా చేయాల్సిన కొన్ని టెస్ట్‌లు ఉన్నాయి. వాటి తర్వాతే దీనికి ట్రీట్‌మెంట్ ఏంటో తెలుస్తుంది. కానీ, దానికి 2 డేస్ పడుతుంది. మీ అత్తకు వచ్చిన బ్లడ్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ చేసే దశలోనే ఉందని డాక్టర్ చెబుతుంది.
సుమిత్రకు గండం
రెండు రోజుల్లో సుమిత్రను హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలి. మీరే ఇలా ఉన్నారంటే వాళ్లు ఎలా తట్టుకుంటారో తెలియదు. వ్యాధి కంటే భయం ఎక్కువ చంపేస్తుంది. ముందు ఇంట్లోవాళ్లకు, తర్వాత సుమిత్రకు చెప్పి ప్రిపేర్ చేయించండి. మీకు ఎక్కువ టైమ్ లేదు. భయంతో వణికిపోతున్న మనిషికి ట్రీట్‌మెంట్ చేయలేం. టైమ్ లేదన్నది గుర్తు పెట్టుకోండి అని డాక్టర్ చెబుతుంది.
మెడిసిన్ రాసిస్తా ఈ రెండు రోజులు మీ అత్తతో వాడించండి అని డాక్టర్ చెబుతుంది. తాత చెప్పిన గండం అత్తకు వచ్చింది. ఈ నిజం ఎవరు తట్టుకోలేరు. ఎలా చెప్పాలి అని కార్తీక్ అనుకుంటాడు. ఇంతలో దశరథ్ వస్తే.. ఇక మీరు బయలుదేరొచ్చు అని డాక్టర్ చెబుతుంది. మెడిసిన్ తీసుకుని వెళ్దామని కార్తీక్ అంటాడు. దాంతో ఇద్దరు వెళ్తారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.