Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో శివ నారాయణ ఇచ్చిన రూపాయిని చూస్తూ ఉంటుంది మాలిని. కాంచన ఇంటికి ఎందుకు వెళ్లావ్ అని మాలినిని నిలదీస్తాడు దక్షిణామూర్తి. కార్తీక్, దీప మిమ్మల్ని కాపాడారు. వారికి ఏదైనా సాయం చేద్దామనుకున్నాను అని మాలిని అంటుంది.
మనం దీన్ని మార్చాలి

సాయం అంటే అని దక్షిణామూర్తి అడుగుతాడు. నేను ఊహించినదానికంటే పేదరికంలో ఉన్నారు. అందుకే డబ్బులు ఇస్తే తీసుకోరని చెక్ ఇచ్చాను. ఇప్పటికీ ఆ అమాయకులు బాబాయ్‌నే నమ్ముతున్నారు. దీన్ని మనం మార్చాలి, ఏదోటి ప్రయత్నం చేయాలని మాలిని అంటుంది. నా కూతురే నమ్ముతుంది. నీ మంచితనం వాళ్లకు అర్థం కాదు అని దక్షిణామూర్తి అంటాడు.
నేను అలసిపోయాను. నా కూతురు గురించి తప్పా ఇంకెవరి గురించి ఆలోచించాలని అనుకోవట్లేదని, నన్ను ఆశ మాత్రమే బతికిస్తుందని దక్షిణామూర్తి అంటాడు. ఆశ మాత్రమే కాదు పగ, ప్రతీకారం కూడా బతికిస్తుంది. బాబాయ్ ఏం చేశాడు. ఆ కుటుంబం వల్ల ఏం నష్టపోయామో మనకు తెలుసు. శివ నారాయణ సంతోషంగా అందరిలో ఉండాలా. లేదు. బాబాయ్ బలం తగ్గించాలి. బాబాయ్ దగ్గరున్న వాళ్లను దూరం చేయాలని మాలిని అంటుంది.
నాకు అర్థమైందమ్మా. కానీ ఇలాంటివి చేసేటప్పుడు నాకు చెప్పు అని దక్షిణామూర్తి అంటాడు. చెప్పి చేస్తే మీరు ఏది చేయనివ్వరు మావయ్య. అన్నింటికి సమాధానం చెప్పే తీరుతాను అని రూపాయి పట్టుకుని అనుకుంటుంది మాలిని. మరోవైపు ఆఫీస్‌లో జ్యోత్స్నకు సూరజ్ సైట్ కొడతాడు. జో ఇరిటేట్ అవుతుంది. జ్యోత్స్న దీప దగ్గరికి వెళ్లి వచ్చేలోపు బ్లాక్ కళ్లద్దాలు పెట్టుకుని సైట్ కొడతాడు సూరజ్.
పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు
అది చూసిన జ్యో రేయ్ సైట్ కొట్టేందుకు సిగ్గు లేదా అని అడుగుతుంది. మరి నువ్వు నాకెందుకు సైట్ కొడుతున్నావ్ అని రివర్స్‌లో అంటాడు సూరజ్. కాలేజ్, స్కూల్లో ఎవరిని లవ్ చేయలేదా అని జ్యోత్స్న అడుగుతుంది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ప్రేమించిన మొదటి అమ్మాయివి నువ్వే, నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టినప్పుడే అలా ఫిక్స్ అయ్యాను అని సూరజ్ అంటాడు.
{{/usCountry}}అది చూసిన జ్యో రేయ్ సైట్ కొట్టేందుకు సిగ్గు లేదా అని అడుగుతుంది. మరి నువ్వు నాకెందుకు సైట్ కొడుతున్నావ్ అని రివర్స్‌లో అంటాడు సూరజ్. కాలేజ్, స్కూల్లో ఎవరిని లవ్ చేయలేదా అని జ్యోత్స్న అడుగుతుంది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ప్రేమించిన మొదటి అమ్మాయివి నువ్వే, నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టినప్పుడే అలా ఫిక్స్ అయ్యాను అని సూరజ్ అంటాడు.
{{/usCountry}}ఏ జన్మలో నేను నీకు దక్కను, ఇలాగే మాట్లాడితే ఆ నాలుక కట్ చేసి పడేస్తాను అని జ్యోత్స్న అంటుంది. కళ్లతో చూస్తానని సూరజ్ ఆడుకుంటాడు. నేను ఏదైనా కావాలనుకుంటే అదే నా దగ్గరకు తెచ్చుకుంటాను అని సూరజ్ అంటుండంగా.. దీప వస్తుంది. ఎందుకు పదే పదే ఇదే విషయం చెబుతావని జ్యో అంటుంది. సూరజ్ ఆగిపోతాడు.
నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా. ఏం అనుకున్నా జరుగుతుంది అనుకుంటున్నావా. ఎందుకురా అంత బిల్డప్ అని జ్యోత్స్న తిడుతుంది. ఆ మాటలు దీప వింటుంది. దీపను జ్యోత్స్న చూసి నవ్వి వెళ్లిపోతుంది. అందరూ నాతో ఆడుకుంటున్నారుగా. చెబుతా అని జ్యోత్స్న అంటుంది. ఇంతలో జ్యోత్స్నకు కాల్ చేసి ఒక ప్లేస్‌కి వెళ్దామని అంటుంది పారిజాతం.
సూరజ్‌కు షాక్
ఫోన్ అక్కడే పెట్టి రా అని పారిజాతం అంటుంది. జ్యోత్స్న డెస్క్‌లో ఫోన్ పెట్టి వెళ్తుంటే.. సూరజ్ అడుగుతాడు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నా అని జ్యోత్స్న అంటుంది. దాంతో సూరజ్ షాక్ అవుతాడు. మన పెళ్లి గురించి మాట్లాడేందుకు మీ ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నాను అని జ్యోత్స్న అంటుంది.
సూరజ్ అలాగే దిమ్మతిరిగి నిల్చుండిపోతాడు. పిల్లోడు షాక్ అయినట్లున్నాడు. పిల్లబాతు బచ్చాగాడు అని జ్యో వెళ్లిపోతుంది. జ్యోత్స్నను మాలిని ఇంటికి తీసుకెళ్తుంది పారిజాతం. నువ్వు పుట్టినప్పటి నుంచి మొదటిసారి మేనత్త ఇంటికి వచ్చావని మాలిని ఎంట్రీ ఇస్తుంది. పారిజాతంను తిడుతుంది జ్యో. పారిజాతం ఎవరికి చెప్పరు కదా అని మాలిని అంటుంది.
పెద్దవారిని గౌరవించి మాట్లాడాలని తెలియదా అని క్లాస్ పీకుతుంది జ్యోత్స్న. ఏం పొగరుందే నీలో. మాలిని మేనకోడలు అంటే ఇలాగే ఉండాలి అని మాలిని అంటుంది. మాలిని నీతో ఏదో మాట్లాడాలట అని పారిజాతం అంటుంది. తాత చెప్పింది మర్చిపోయావా అని జ్యోత్స్న అంటుంది. నువ్వు నా మేనకోడలివి. నాకు కొడుకు ఉండుంటే పెళ్లి చేసేదాన్ని అని మాలిని అంటుంది.
మాలిని ఇంట్లో జ్యోత్స్న
ఆశకు హద్దు ఉండాలని జో అంటుంది. పారిజాతం చెప్పడంతో కూర్చుని మాట్లాడుతారు. మరోవైపు ఈ పెండింగ్ ఫైల్స్ ఏంటీ, నీ అసిస్టెంట్ ఏం చేస్తుందని దీపతో కార్తీక్ అంటాడు. అది సరిగా చేయట్లేదని దీప అంటుంది. నువ్వు సరిగా చేయించుకోవట్లేదు. నిన్నే అంటారని, నీదే తప్పు అవుతుందని కార్తీక్ అంటాడు. కార్తీక్ బెల్ కొడతాడు.
జ్యోత్స్న రాదు. బయటకు వెళ్లి చూస్తే జ్యో ఉండదు. సూరజ్ కూడా ఉండడు. ఇంతలో శివ నారాయణ వచ్చి చిన్న పని ఉంది బయటకు వెళ్తున్నా అంటాడు. జ్యోత్స్న గురించి అడుగుతాడు. ఇంతలో సూరజ్ వచ్చి బయటకు వెళ్లిందని చెబుతాడు. అడిగిన చెప్పలేదంటాడు. కార్తీక్ ఫోన్ చేస్తే డెస్క్‌లోనే పోన్ ఉంటుంది. మొబైల్ ఇక్కడే వదిలి వెళ్లిందని కార్తీక్ అంటాడు.
వెళ్లేముందు ఒక ఫోన్ కాల్ మాట్లాడి వెళ్లారు. అది వాళ్ల గ్రానీ అనుకుంటున్న అని సూరజ్ చెబుతాడు. దాంతో సుమిత్రకు కాల్ చేసి పారిజాతం గురించి అడిగితే.. బయటకు వెళ్లిందని సుమిత్ర చెబుతుంది. పారిజాతంకు కాల్ చేస్తే స్విచ్చాఫ్ వస్తుంది. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్లారని శివ నారాయణ డౌట్ పడతాడు. మరోవైపు ఎందుకు పిలిచారో చెబితే వెళ్తానంటుంది జ్యోత్స్న.
నీకు అమ్మ పోలికలు రాలేదేంటీ
నిన్ను చూసినప్పటినుంచి నీలో కుటుంబాన్ని వెతుకుతున్నాను. నీకు మీ అమ్మ పోలికలు రాలేదేంటీ అని మాలిని అడుగుతుంది. దాంతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. నీకు ఇంకా ఎవరి పోలికలు కానీ చనిపోయిన నానమ్మ పోలికలు కానీ రాలేదు. నీ పొగరు, నీ ఆవేశం కొత్తగా ఉన్నాయి. ఇవి ఎవరి లక్షణాలు అని మాలిని ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తుంది.
పారిజాతం భయపడిపోతుంది. నా గురించి తెలుసుకుని బుక్ రాస్తారా అని జ్యోత్స్న కౌంటర్ వేస్తుంది. దీప దగ్గర అసిస్టెంట్‌గా చేస్తున్నావా. ఐదో తరగతి చదివినదాని దగ్గర అసిస్టెంట్‌గా పెట్టడం ఏంటని మాలిని అంటే.. ఇదంతా పెళ్లి అయ్యేవరకే అని పారిజాతం అంటుంది. నీకు కార్తీక్‌కు పెళ్లి చేయాలనుకున్నారే అని మాలిని అడుగుతుంది.
వాడు దీపను చేసుకున్నాడుగా అని పారిజాతం అంటే.. అందుకేనా నువ్వు పెళ్లి చేసుకోలేదు అని మాలిని అంటుంది. అలా చెప్పాను. నాకు నచ్చినప్పుడు చేసుకుంటాను అని జ్యో అంటుంది. మనసులో ఎవరైనా ఉంటే చెప్పి పెళ్లి చేస్తా అని మాలిని అంటుంది. అప్పుడు వీళ్ల తాత నీ ఫొటోకు దండేస్తాడు అని పారిజాతం అంటుంది.
సగం ఆస్తి ఆఫర్
ఆ ఇంట్లో నీ పరిస్థితి బాలేదని పిలిపించాను. నీకు ఏం కావాలో చెప్పు. నువ్వు ఏది అడిగిన కాదనకుండా ఇస్తాను. జ్యోత్స్న ఊ అంటే ఆస్తిలో సగం వాటా ఇస్తానంటుంది మాలిని. నా ఆస్తిలో సగం నా ఆడపడుచు కూతురికేగా అని మాలిని ఆఫర్ ఇస్తుంది. నీ మేనత్తకు నువ్వంటే ఎంత ప్రేమో చూశావా అని పారిజాతం అంటుంది.
దాంతో లేచిన జ్యోత్స్న నాకు ఎవరి ప్రేమలు అవసరం లేదు అని జ్యో అంటుంది. కాఫీ తీసుకోలేదని మాలిని అంటే.. ఇంకోసారి ఇవ్వరని జ్యో అంటుంది. అంటే ఇంకోసారి వస్తానంటున్నావా అని మాలిని పంచ్ వేస్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.