Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న ఎక్కడికి వెళ్లింది అనేది ఇంట్లో శివ నారాయణ పంచాయితీ పెడుతాడు. జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందో అడగడం నాది తప్పంటారా అని సూరజ్ అంటుంటే.. తప్పు లేదని దశరథ ఎంట్రీ ఇస్తాడు.
తాడు బొంగరం లేనోడి మాటలు

మన ఆఫీస్‌లో పని చేసేందుకు నిజాయతీ, జవాబుదారీతనం కచ్చితంగా ఉండాల్సిందే అని దశరథ్ అంటాడు. ఇప్పుడు లేవని ఎవరన్నారని పారు అంటే.. చెప్పకుండా వెళ్లిన జ్యోత్స్ననే అని కార్తీక్ అంటాడు. నువ్వు ఆపురా నాయనా.. ఆ తాడుబొంగరం లేనోడి మాటలు పట్టుకుని అని పారిజాతం అంటుంది.
తాడుబొంగరం లేనోడు అంటే అని సూరజ్ అడిగితే.. పెళ్లి పెటాకులు లేనోడని అర్థమని పారు చెబుతుంది. అంటే నన్ను జ్యోత్స్నను కలిపి మా ఇద్దరిని తిడుతున్నట్లే అని సూరజ్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. మెడనొప్పి పోయింది గుండెనొప్పి తెప్పించేలా ఉన్నావ్. ఆ చిన్నోడిని కాస్తా ఆపమని చెప్పురా పెద్దోడా. జ్యోత్స్నకు నాకు ఎలాంటి సంబంధం లేదని పారిజాతం అంటుంది.
జ్యోత్స్న చెప్పింది నిజమే అని సూరజ్ అంటాడు. ఏం చెప్పిందని పారు నోరు జారబోతుంటే.. గ్రానీ, నాకు తలనొప్పి వచ్చింది. ట్యాబ్లెట్ కోసం వెళ్లాను. చెప్పకుండా వెళ్లినందుకు అబద్ధం చెప్పానని పంచాయితీ పెట్టారు అని జ్యోత్స్న చెప్పేస్తుంది. దాంతో పారిజాతం సైలెంట్ అవుతుంది. ఇంకెప్పుడు ఇలాంటివి చేయొద్దని శివ నారాయణ వార్నింగ్ ఇస్తాడు.
దశరథ్ మాటలు విన్న శ్రీధర్
పెళ్లి గురించి మాట్లాడినందుకు మీరేం ఫీల్ అవ్వలేదుగా అని కావాలనే టాపిక్ తీస్తాడు సూరజ్. దీంట్లో సూరజ్ అన్నది తప్పులేదు. నీ పెళ్లి గురించి నీకు ముఖ్యం కాకపోవచ్చు. మాకు చాలా ముఖ్యం. అందరు నీ కూతురు పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు అని దశరథ్ అంటాడు. దీపను తీసుకెళ్తానంటాడు. సూరజ్ వెళ్లిపోతాడు.
{{/usCountry}}పెళ్లి గురించి మాట్లాడినందుకు మీరేం ఫీల్ అవ్వలేదుగా అని కావాలనే టాపిక్ తీస్తాడు సూరజ్. దీంట్లో సూరజ్ అన్నది తప్పులేదు. నీ పెళ్లి గురించి నీకు ముఖ్యం కాకపోవచ్చు. మాకు చాలా ముఖ్యం. అందరు నీ కూతురు పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు అని దశరథ్ అంటాడు. దీపను తీసుకెళ్తానంటాడు. సూరజ్ వెళ్లిపోతాడు.
{{/usCountry}}నా ఇగోను టచ్ చేశావు కదరా అని జ్యో, పోతు పోతూ అగ్గిపుల్ల గీసి పోయాడు. ఎంతవరకు తగలబడుతుందో అని పారిజాతం అనుకుంటారు. కార్తీక్, దీపను డ్రాప్ చేస్తాడు దశరథ్. జ్యోత్స్న పెళ్లి గురించి అడుగుతాడు. జ్యోత్స్న పెళ్లి చేసుకునేదెప్పుడు నా కూతురు దీప ఆ ఇంట్లో అడుగుపెట్టేదెప్పుడు అని దశరథ అంటాడు. ముగ్గురు మాట్లాడుకోవడం శ్రీధర్ చూస్తాడు.
వీళ్లకు సర్‌ప్రైజ్ ఇద్దామని శ్రీధర్ వెళ్తాడు. దీప జీవితం జ్యోత్స్న పెళ్లితో ముడిపడి ఉందిరా. దీప జీవితం వెలుగులోకి రావాలంటే జ్యోత్స్న పెళ్లి జరగాలని దశరథ్ అంటాడు. అది విని శ్రీధర్ షాక్ అయి ఆగిపోతాడు. నాకు తెలుసు మావయ్య, ఇక నీ కూతురు పెళ్లి అయిపోయినట్లే అని కార్తీక్ అంటాడు. అర్జంట్ వర్క్ ఉందని దశరథ్ వెళ్లిపోతాడు.
జ్యోత్స్న దొంగ ఫొటోలతో మురిసిపోయిన సూరజ్
వెనక్కి తిరిగేసరికి శ్రీధర్‌ను చూసి ఆశ్చర్యపోతారు కార్తీక్, దీప. శ్రీధర్‌ను హగ్ చేసుకుంటాడు కార్తీక్. నేను మీకు సర్‌ప్రైజ్ ఇద్దామనుకుంటే మీరు నాకు పెళ్లి గురించి చెప్పి సర్‌ప్రైజ్ ఇచ్చారు. దశరథ బావతో ఏం మాట్లాడారో విన్నాను అని ఏంటీ సంగతి అని అడుగుతాడు శ్రీధర్. మీరు నాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని శ్రీధర్ అంటే.. అవును, టైమ్‌కి ట్యాబ్లెట్స్ వేసుకుని ప్రశాంతంగా ఉండు అని కార్తీక్ అంటాడు.
మరోవైపు జ్యోత్స్న ఆల్బమ్ ఫొటోలు చూస్తూ, తనతో జరిగినవి తలుచుకుంటూ మురిసిపోతాడు సూరజ్. జ్యో ప్రేమలో మునిగిపోతాడు సూరజ్. ఇంతలో జ్యోత్స్న వచ్చి షాక్ ఇస్తుంది. చేతిలో ఉంది ఇవ్వమంటుంది. సూరజ్ ఇవ్వకుంటే లాక్కుంటుంది. జ్యోత్స్న తన ఆల్బమ్ చూసి షాక్ అవుతుంది. ఈ ఫొటోలన్నీ ఎప్పుడు తీశావురా అని జ్యో అడుగుతుంది.
కోపంలో జ్యోత్స్న, కొంటెగా జ్యోత్స్న, అరుస్తూ జ్యోత్స్న, అందంగా జ్యోత్స్న, ఆఫీస్‌లో జ్యోత్స్న అని ఒక్కో ఫొటో గురించి గొప్పగా చెబుతాడు సూరజ్. ఒక్కటే జ్యోత్స్న ఎన్నో వైరుధ్యాలు అంటాడు. నా ఫొటోలు ఎందుకు తీశావురా అని తిడుతుంది జ్యోత్స్న. నాతో ఎప్పుడు ఇలా ఉండవుగా అందుకే అలాగే ఉండిపోతాయని తీశానని సూరజ్ అంటాడు.
దొంగచాటుగా తీయడం ఏంట్రా
దొంగచాటుగా ఫొటోలు తీయడం ఏంట్రా అని జ్యో అంటే.. మరి నా ఫొటోలు తీసి చూడు. తీయలేవు. అది టాలెంట్ అని సూరజ్ అంటాడు. మా నాన్నతో పెళ్లి టాపిక్ ఎందుకు తీశావురా అని అడుగుతుంది జ్యోత్స్న. నాకు అన్ని తెలుసు నువ్వు ట్యాబ్లెట్ తీసుకునేందుకు వెళ్లావో, ఇంకెవరినైనా కలిసేందుకు వెళ్లావో నాకు తెలియదా అని సూరజ్ అంటాడు.
దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. పారిజాతం హాస్పిటల్, జ్యో మెడికల్ షాప్ భలే సింక్ అని అంటాడు సూరజ్. నా ఫొటోలు దగ్గరపెట్టుకుంటే పామును దగ్గర పెట్టుకున్నట్టే. ప్రమాదం. రోజులు గుర్తుపెట్టుకో పోయేకాలానికి అని జ్యోత్స్న అనేసి వెళ్తుంది. మనం కలిసి తినే రోజులు వస్తాయని సూరజ్ అంటాడు. మరోవైపు శ్రీధర్ ఇంట్లోనే ఉండటం గురించి శౌర్య అడుగుతుంది.
ఇక్కడే ఉంటాడు. రెస్ట్ అవసరం కదా. పెద్దమ్మ ఊరిలో లేదుగా తన గదిలో ఉండమని కార్తీక్ అంటాడు. శ్రీధర్ థ్యాంక్స్ చెబుతాడు. శౌర్య హోమ్ వర్క్ అని చెప్పి వెళ్తుంది. కార్తీక్ కూడా చేయాల్సిన హోమ్ వర్క్ ఉందంటాడు శ్రీధర్. జ్యోత్స్న పెళ్లి చేసేందుకు పెళ్లిళ్ల పేరయ్య నెంబర్ ఇవ్వమంటావా అని శ్రీధర్ అంటే.. అదంతా మనకెందుకు అని కాంచన అంటుంది.
నోరుజారిన దీప
మీ అన్నయ్య జ్యోత్స్న పెళ్లి గురించి ఎంత టెన్షన్ పడుతున్నాడో తెలుసా అని దశరథ ఇంటికొచ్చిన విషయం గురించి చెబుతాడు శ్రీధర్. జ్యోత్స్న దీపకు తోబుట్టువు లాంటిది, పైగా ఆ పెళ్లికి ఎవరి జీవితాలో అని దీప అన్న మాటలు ఇన్‌డైరెక్ట్‌గా చెబుతాడు శ్రీధర్. మాస్టారు.. భోజనం చేయండి అని కార్తీక్ అంటాడు. దీప నీకు బావ ఏం చెప్పలేదా అని శ్రీధర్ అంటే.. నాన్న నాకు ఏం చెబుతాడు అని దీప నోరు జారుతుంది.
అంతా షాక్ అవుతారు. జ్యోత్స్న వాళ్ల నాన్న ఏం చెబుతాడు అని కార్తీక్ కవర్ చేస్తాడు. మీరెందుకురా కవర్ చేస్తున్నారు అని కాంచన అంటే.. నిజాన్ని దాస్తున్నారు కాబట్టి అని శ్రీధర్ అంటాడు. నిజాన్ని దాచేవాళ్లే కంగారుపడతారు. వీళ్లకు అవసరం లేదు. తినండి.. తినండి. పెళ్లి చేస్తామని మాటిచ్చారుగా అని శ్రీధర్ తర్వాత కవర్ చేస్తాడు.
మీరు ఏదైనా చేయగలరు.. మీరు ఏదైనా దాచగలరు. అయినా నిజాన్ని ఎవరైనా ఎంతకాలం దాచగలరు. ఏదో ఒక రోజు బయటపడాల్సిందే అని కార్తీక్, దీపకు చెమటలు పట్టేలా చేస్తాడు శ్రీధర్. మీ గురించి కాదులే తినండి అని శ్రీధర్ అంటే.. నాన్నతో జాగ్రత్తగా ఉండాలని కార్తీక్ మనసులో అనుకుంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.