...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కాశీ, స్వప్న రొమాన్స్- దశరథను రెచ్చగొట్టిన జ్యోత్స్న- తాత రాంగ్ టైమ్- సుమిత్ర చివరి మాట

Karthika Deepam 2 Serial March 7th Episode: కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 7వ ఎపిసోడ్‌లో దీపను హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే తల్లిని కూడా కాపాడలేమని డాక్టర్ హారిక అంటుంది. ఇంటికెళ్లిన దశరథ్‌ను నిజం చెప్పించడానికి జ్యోత్స్న రెచ్చగొడుతుంది. శివ నారాయణ వచ్చి అడ్డుకుంటాడు.

Published on: Mar 7, 2026, 07:21:43 IST
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో నిజం తెలిసాకా అంతా అర్థం చేసుకుంటారు. అందుకోసం నేను ఎన్ని బాధలు పడిన సరే మావయ్య అని కార్తీక్ అంటాడు. దాంతో కార్తీక్‌ను హగ్ చేసుకుంటాడు దశరథ్. తర్వాత దీపను, కార్తీక్ ఇద్దరిని దశరథ్ ప్రేమగా హత్తుకుంటారు.

నాకోసమే కన్నదిరా

కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 7వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 7వ తేది ఎపిసోడ్

నా చెల్లి నిన్ను నాకోసమే కన్నట్టుందిరా అని దశరథ్ అంటే.. లేదు మావయ్య దీపకోసం కన్నదని కార్తీక్ అంటాడు. ఇంత బాధలో కూడా నవ్వించగలడని దశరథ్ అంటాడు. ఓపికగా చూసినంత మంచిపని ఇంకోటి ఉండదని కార్తీక్ అంటాడు. ముగ్గురు హాస్పిటల్‌కు వెళ్తారు. మరోవైపు తను మాట్లాడింది ఏమైనా తప్పా, దీప సమస్యలను కొని తెచ్చుకుంటుంది, ఆరోజు పంతులు దీపను బిడ్డ జాగ్రత్త అని హెచ్చరించారని ఆవేదనగా మాట్లాడుతుంది కాంచన.

అనవసరమైన ఆశలు పెట్టుకున్న కాబట్టి ఇది నా కర్మ అనుకోవాలి. నా కలలోకి వచ్చిన మా అమ్మ నా కళ్లముందుకు వస్తాననుకున్నా. కోడలు మరోకసారి మా అమ్మను చంపేలా ఉంది. నా సంగతి వదిలేయండి. కనీసం భర్త గురించి అయినా ఆలోచించాలిగా. ఇదంతా స్వయంకృత అపరాధం అని కోపంగా మాట్లాడుతుంది కాంచన. దేవుడి దయ వల్ల అందరికి మంచే జరుగుతుంది అని శివ నారాయణ ఓదారుస్తాడు.

నేను కోరుకునేది ఒక్కటే తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కాంచన అంటుంది. మరోవైపు స్టూల్ ఎక్కి బూజు దులుపుతుంది కావేరి. స్వప్న వచ్చి అడుగుతుంది. తల్లిని దించి తాను దులుపుతానంటుంది. స్టూల్ ఎక్కి స్వప్న బూజు దులుపుతుంది. అప్పుడే కాశీ ఇంట్లోకి వస్తాడు. స్టూల్ మీద నుంచి స్వప్న కింద పడబోతుంటే కాశీ వచ్చి పట్టుకుంటాడు.

కాశీ, స్వప్న రొమాన్స్

తల్లిని లేపేందుకు హెల్ప్ అడిగితే మిరపకాయలు కోశాను, కారంగా ఉంటుందని వెళ్లిపోతుంది. కాశీ అడిగితే వద్దని తానే లేస్తుంది స్వప్న. అసలు ఇంట్లోకి ఎందుకు వచ్చావని కాశీ అంటే.. కూరగాయలు తెచ్చానని చూపిస్తాడు. ఇద్దరు ప్రేమ గురించి, పూల గురించి వాదించుకుంటారు. నిన్ను నీకే కొత్తగా పరిచయం చేస్తాను అని కాశీ అంటాడు. ఆ మాటలకు ఆలోచనలో పడిపోతుంది స్వప్న.

మరోవైపు దీపను డాక్టర్ హారిక చెక్ చేస్తుంది. బీపీ నార్మల్‌గా ఉంది. ఇలాగే ఉండండి. ఆపరేషన్ అయ్యేవరకు హాస్పిటల్‌లోనే ఉండాలని డాక్టర్ హారిక చెబుతుంది. తర్వాత దశరథ్‌తో సుమిత్రను ఎప్పుడు హాస్పిటల్‌లో జాయిన్ చేయాలని తాను చెబుతానని, జ్యోత్స్నతో జాగ్రత్తగా ఉండమని, ఇవాళ తనను కలిసింది చెబుతుంది హారిక. కడుపుతో ఉన్న వాళ్లు బోన్ మ్యారో ఇవ్వొచ్చా అని అడిగిందని, నేను సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేదని, ఏదైనా తను సమస్య చేస్తే నేను కవర్ చేయలేనని హారిక అంటుంది.

ఇన్ఫెక్షన్ అయితే తల్లి బతకదు

దీప ఇక్కడ ట్రీట్‌మెంట్ కోసం ఉందని చెబుదామని కార్తీక్ అంటాడు. నార్మల్ పర్సన్ అయితే ఏం కాదు. కానీ, దీప ప్రెగ్నెంట్, ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే తల్లికి కూడా ప్రమాదమే అని డాక్టర్ హారిక చెబుతుంది. నా కూతురు, నా కూతురు కడుపులో బిడ్డ ఇద్దరు బతకాలి. దానికి నేను ఏం చేయాలి. ఏం చేస్తే బతుకుతారో చెప్పండి అని దశరథ్ ధీనగా అడుగుతాడు.

పాజిబులిటీ ఉంటే నేను చేయనా. మీరు మాత్రం ఎలాంటి హోప్స్ పెట్టుకోకండి అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతుంది. ఇక నేను మీ అమ్మకు నా మొహం చూపించలేనురా అని దశరథ్ బాధపడుతాడు. ఇంటికెళ్లి క్యారేజ్ తీసుకొస్తానని దీపతో అంటాడు కార్తీక్. దీపను హాస్పిటల్‌లో ఉంచేసి కార్తీక్, దశరథ్ వెళ్లిపోతారు. జరిగిన విషయాలన్నింటి గురించి ఆలోచిస్తుంది జ్యోత్స్న.

డాడీని రెచ్చగొట్టి తనకేం తెలుసో నిజం రాబట్టాలని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంతలో దశరథ్ వస్తాడు. ఎక్కడికి వెళ్లావ్ అని జ్యోత్స్న అడిగితే.. దీపను హాస్పిటల్‌లో అడ్మిట్ చేయడానికి అని దశరథ్ అంటాడు. ఆ పని మనిషి కోసం నువ్వెళ్లాల్సిన అవసరం ఏంటీ అని జ్యోత్స్న అంటుంది. శివ నారాయణ, సుమిత్ర, పారిజాతం వస్తారు.

దశరథ్‌ను రెచ్చగొట్టిన జ్యోత్స్న

దీపను పని మనిషి అంటూ దశరథ్‌ను రెచ్చగొడుతుంది జ్యోత్స్న. దీప ఎవరో చెప్పు అని జ్యోత్స్న అంటే.. దీప ఎవరంటే అని దశరథ్ చెప్పబోతుంటే.. దశరథ ఎందుకు అంత గట్టిగా చెబుతున్నావ్, ఏమైందని శివ నారాయణ అడ్డుకుంటాడు. తాతా రాంగ్ టైమ్‌లో వచ్చావ్. నా అనుమానం కరెక్టే డాడీకి ఏదో తెలిసింది అని జ్యోత్స్న అనుకుంటుంది.

జ్యోత్స్న అడిగిన విధానం కరెక్టే కానీ తప్పు కాదు అని శివ నారాయణ అంటాడు. జ్యోత్స్నను సమర్థిస్తున్నావా అని దశరథ్ అంటే.. నేను ఎవరిని సమర్ధించట్లేదు. దీప సంగతి కార్తీక్ చూసుకుంటాడు. నువ్వు వెళ్లింది దీప కడుపులో బిడ్డకు సమస్య ఉన్నందుకు అని శివ నారాయణ అంటాడు. ఏంటీ మావయ్య దీప బిడ్డకు సమస్య అని సుమిత్ర అడుగుతుంది.

లేదు. కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్‌లో జాయిన్ చేశామని దశరథ్ అబద్ధం చెబుతాడు. అవును, అని శివ నారాయణ కవర్ చేస్తాడు. నాన్నతో బిజినెస్ గురించి మాట్లాడాలి, నువ్వు లోపలికి వెళ్లు సుమిత్ర అని దశరథ్ అంటాడు. దీప నా గురించి కంగారు పడుతుంటుంది. నాకేం కాదని చెప్పండి. దీప పిల్లలతో కూడా నేను ఆడుకుంటానని చెప్పండి అని సుమిత్ర అంటుంది.

నీ చివరి మాట చెబుతాను

నీ మాటలన్నీ నిజం కావాలని ఆ పరమ శివుడును కోరుకుంటున్నాను అని దశరథ్ అంటాడు. దీప కడుపులో బిడ్డకు ఏం కాదని నా మాటగా చెప్పండని సుమిత్ర అంటుంది. ఈ చివరి మాట తప్పకుండా చెబుతాను అని దశరథ్ అనడంతో సుమిత్ర వెళ్లిపోతుంది. దీప గురించి సుమిత్రకు ఏం చెప్పొద్దు అని దశరథ్ అంటాడు. డాక్టర్ గారు ఏమన్నారని శివ నారాయణ అడుగుతాడు.

నువ్వన్నదే చెప్పారని దశరథ్ అంటాడు. దశరథ్ మాట మారుస్తున్నాడని పారిజాతం డౌట్ పడుతుంది. ఏం కానప్పుడు అమ్మకు ఎందుకు చెప్పొద్దని జ్యోత్స్న అంటుంది. కొన్ని ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి. కరెక్ట్ టైమ్ కోసం ఎదురుచూస్తున్నా అని దశరథ్ అంటాడు. సుమిత్రను ఎప్పుడు హాస్పిటల్‌లో ఎప్పుడు జాయిన్ చేయాలో ఫోన్ చేసి చెబుతానన్నరని దశరథ్ అంటాడు.

టైమ్ దగ్గరపడింది అని జ్యోత్స్నను ఇన్‌డైరెక్ట్‌గా అంటాడు దశరథ్. దేనికి అని జ్యో అంటే.. ఆపరేషన్‌కు అని కవర్ చేస్తాడు. దాంతో జ్యో షాక్ అవుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe