Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో ఆఫీస్‌లో సీఈఓ పోటీకి అగ్రిమెంట్‌పై జ్యోత్స్న సంతకం చేస్తుంది. దీపను చేయమంటే.. అసలు తనకు సంతకం చేయొచ్చా అని ఎగతాళి చేస్తుంది జ్యోత్స్న. తను 5వ తరగతి వరకు చదువుకుందని కార్తీక్ అంటాడు. ఏదో ఎంబీబీఎస్ చదివినట్లు చెప్పావని వెటకారంగా అంటుంది జ్యోత్స్న.
తండ్రి కోసం చదువు ఆపి

దానికి పని మనుషులు, ఇస్త్రీ చేసేవాళ్లు, 2 లక్షల స్కూల్ ఫీజు, 25 లక్షల కారులో వెళ్లడంతో నీ చదువు అయింది. కానీ, ఓ మధ్య తరగతి ఆడపిల్లకు రోజు ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా అని దీప అంతవరకు చదువుకోవడం ఎంత కష్టమైందో గొప్పగా చెబుతాడు కార్తీక్. తండ్రి కష్టం చూసి తనకిష్టమైన చదువును ఐదో తరగతిలోనే ఆపేసిందని, నీకు యూనివర్సిటీ డిగ్రీ ఎంతో తనకు ఐదో తరగతి కూడా అంతే అని కార్తీక్ అంటాడు.
నీ చదువు నీకు ఏ జ్ఞాపకాన్ని ఇవ్వలేదు. కానీ, తనకు ప్రతీది జ్ఞాపకంగా మారింది. దీప సంతకం పెట్టు అని కార్తీక్ అంటాడు. కే దీప అని దీప సైన్ చేస్తే.. కే అంటే అని జ్యో అడుగుతుంది. కార్తీక్. అదే నా చిరునామా అని దీప చెబుతుంది. కథ ఇప్పుడే మొదలైందని జ్యో అంటుంది. ఇకనుంచి మీరిద్దరు టెంపరరీ సీఈఓలు అని, వాళ్లకు క్యాబిన్స్ చూపించమని శివ నారాయణ చెబుతాడు.
జ్యోత్స్న, దీపకు క్యాబిన్స్ ఎదురెదురుగా ఉంటాయి. జ్యోత్స్న, దీప మాటలతో సెటైర్లు, పంచ్‌లు వేసుకుంటారు. సూరజ్‌ను రోడ్డుపైకి తేవడం గుర్తు చేసిన కార్తీక్ ఓ పొగరుబోతు గురించి చెప్తున్నానంటాడు కార్తీక్. జ్యోత్స్నకు పంజాగుట్టా బ్రాంచ్ ఇచ్చారని చెబుతుంది. ఇదంతా ఇంగ్లీష్‌లో ఉందని దీప చెప్పడంతో జ్యోత్స్న నవ్వుతుంది. దీప ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటుందని చెప్పి మైత్రివనం బ్రాంచ్ వచ్చిందంటాడు.
గెలిచే ఛాన్స్ కూడా ఉంది
ఇక్కడ పోటీ గట్టిగా ఉంటుంది. గెలిచే ఛాన్స్ కూడా ఉందని కార్తీక్ అంటే.. మనసులో ఈ రెండు వారాల్లో ఏదైనా జరగొచ్చు. దీప గెలవదు. నేను గెలుస్తాను అని జ్యో అనుకుంటుంది. మరోవైపు శివ నారాయణ ఇంట్లో శౌర్య ఉంటుంది. కాంచన కళ్లు మూసి శ్రీధర్‌ను దాక్కోమంటుంది. కాంచన పట్టుకోలేనంటుంది. దాంతో శ్రీధర్‌ను శౌర్య కళ్లు మూయమంటే.. సరేనన్న శ్రీధర్ కాంచన కళ్లు మూసేందుకు వెళ్లి ఆగిపోతాడు.
{{/usCountry}}ఇక్కడ పోటీ గట్టిగా ఉంటుంది. గెలిచే ఛాన్స్ కూడా ఉందని కార్తీక్ అంటే.. మనసులో ఈ రెండు వారాల్లో ఏదైనా జరగొచ్చు. దీప గెలవదు. నేను గెలుస్తాను అని జ్యో అనుకుంటుంది. మరోవైపు శివ నారాయణ ఇంట్లో శౌర్య ఉంటుంది. కాంచన కళ్లు మూసి శ్రీధర్‌ను దాక్కోమంటుంది. కాంచన పట్టుకోలేనంటుంది. దాంతో శ్రీధర్‌ను శౌర్య కళ్లు మూయమంటే.. సరేనన్న శ్రీధర్ కాంచన కళ్లు మూసేందుకు వెళ్లి ఆగిపోతాడు.
{{/usCountry}}అదంతా చూసిన పారిజాతం శ్రీధర్‌పై పంచ్‌లు వేస్తుంది. కార్తీక్ టాపిక్ తీసుకొచ్చి పారిజాతంపైనే సెటైర్లు వేస్తాడు శ్రీధర్. పారిజాతంపై కాంచన ఫైర్ అవుతుంది. తర్వాత నాన్న కోసం శౌర్య ఏడుస్తుందని అనసూయ ఫోన్ చేస్తే తనే తీసుకొచ్చినట్లు శ్రీధర్ చెబుతాడు. కార్తీక్‌కు పని చెప్పాలని ఫైల్ చదవమంటుంది జ్యోత్స్న. కానీ, పక్కనే టేబుల్ వేసుకున్న కార్తీక్ భార్య దీపకు సైట్ కొడతాడు. చాటుగా కన్నుకొడతాడు.
జ్యోత్స్న ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. మా ఆవిడకు సైట్ కొడుతున్నా. నిజం చెప్పాలంటే నా భార్యతో నేను ఈరోజే ప్రేమలో పడ్డాను అని కార్తీక్ అంటాడు. ఇది ఆఫీస్ బావ అని దీప అంటుంది. ఆఫీస్‌లో దీప దగ్గరికి జరిగి రొమాంటిక్‌గా మాట్లాడుతాడు కార్తీక్. తన కళ్లముందే దీపతో కార్తీక్ రొమాంటిక్‌గా ఉండటం చూసి జ్యోత్స్న భరించలేకపోతుంది. ఆఫీస్‌లో ప్రేమ కవితలు చెప్పేందుకు నిన్ను తీసుకురాలేదని, నాకు సపోర్ట్‌గా ఉండాలని అంటుంది జ్యోత్స్న.
ఇద్దరి మరదళ్ల మధ్య కార్తీక్
తాత దగ్గరికి వెళ్లి కూర్చో అని జ్యోత్స్న అంటే.. లేదు నాకు ఇక్కడే బాగుంది. ఇలా ఇద్దరి మరదళ్ల మధ్య కాలు మీద కాలేసుకుని కూర్చొంటే పాపికొండలకు బోట్ షికారుకు వెళ్లినట్లే ఉందని కార్తీక్ అంటాడు. బ్రేక్ టైమ్‌లో క్యాంటిన్‌కు రమ్మని ఇన్‌డైరెక్ట్‌గా దీపకు చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్. దీప మురిసిపోతుంది. తర్వాత కార్తీక్ వెంటే వెళ్తుంది దీప. కార్తీక్ దగ్గరి దీప వెళ్తుంది. దీపను మేడమ్ అని కార్తీక్ పిలుస్తాడు.
నీ సొంత కంపెనీకి కాబోయే సీఈఓ అని కార్తీక్ అంటాడు. నీ భార్యకు మించిన అధికారం, ప్రేమకు మించిన ఐశ్వర్యం ఇంకేం లేదని దీప అంటుంది. అంతలో జ్యోత్స్న వచ్చి వాటే డైలాగ్ అంటుంది. అది హాట్ సీట్. దాంట్లో కూర్చునే వాళ్లకే తెలుస్తుందని జ్యోత్స్న అంటుంది. ఎన్నో దాటే వచ్చామని కార్తీక్ అంటాడు. కాఫీ వేస్ట్ అయిపోయిందని కార్తీక్ వెళ్లిపోతాడు.
నీ గెలుపు నీకోసం. నా గెలుపు కుటుంబం కోసం. కూతురు జోలికి వస్తేనే ఊరుకోలేదు. కుటుంబం జోలికి వస్తే ఊరుకుంటానా అని జ్యోత్స్నకు స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది దీప. ఫస్ట్ డే అని నేను ఇంకా నీ మీద ఏ ప్రయోగం చేయలేదు. చేస్తే ఎలా ఉంటుందో చూస్తావుగా అని జ్యోత్స్న నవ్వుకుంటుంది. తర్వాత మేనేజర్ వచ్చి దీపకు ల్యాప్‌ట్యాప్ ఇస్తాడు. వివరాలు, ఫైల్స్ అన్ని అందులో ఉంటాయని, మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వమని అతను చెబుతాడు.
దీపకు అవమానం
కార్తీక్ చెప్పేందుకు ట్రై చేస్తుంటే ఛైర్మన్‌కి కంప్లైంట్ చేస్తానని జ్యోత్స్న బెదిరిస్తుంది. దీపకు అంతా అయోమయంగా ఉంటుంది. ల్యాప్‌ట్యాప్‌లో వర్క్ అనేసరికి బిత్తరపోతుంది దీప. తన దగ్గర ఓటర్ ఐడీ ఉందని చెబుతుంది. దాంతో జ్యోత్స్న గట్టిగా నవ్వుతుంది. స్టాఫ్ అందరి ముందర దీప పరువు తీస్తుంది జ్యోత్స్న.
ఎవరి దగ్గర ఏం చెప్పాలో తెలుసుకో వంశీ. వంటల గురించి అడిగితే చెబుతుంది కానీ ల్యాప్‌ట్యాప్ ముందర పెట్టి యాప్, లాగిన్ అంటే కంగారుపడిపోదు అని జ్యోత్న్న చులకనగా మాట్లాడుతుంది. అలా మొదటి రోజే దీపపై ల్యాప్‌ట్యాప్ ప్రయోగం చేస్తుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.