Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో శ్రీధర్‌ను కాపాడిన వ్యక్తిని కార్తీక్ కలుస్తాడు. తనను సూరజ్ అని పరిచయం చేసుకుంటాడు. కార్తీక్ చాలా థ్యాంక్స్ అని చెబుతాడు. ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంతలో సూరజ్‌కు కాల్ వస్తుంది. ఏమైందని కార్తీక్ అడుగుతాడు. ఇంపార్టెంట్ మీటింగ్ అని, తన లక్ష్యం అని చెబుతాడు.
అద్దంలో చూసుకున్నట్లు

అవకాశం కంటే ప్రాణం ముఖ్యం కదా. హాస్పిటల్‌కు తీసుకొచ్చి ఇక ఆయనకు ఏం కాదని తెలిసాక నా మీటింగ్ గుర్తొచ్చిందని సూరజ్ అంటాడు. చాలా రోజుల తర్వాత మనిషిని చూస్తున్నాను. అందరూ స్వార్థం కోసం బతికే ఈరోజుల్లో మీరు చేసింది చాలా గొప్ప పని. రియల్లీ మీరు చాలా గ్రేట్. మిమ్మల్ని చూస్తుంటే అద్దంలో నన్ను నేను చూసుకున్నట్లు ఉందని కార్తీక్ చెబుతాడు. అంటే కార్తీక్ లాగే సూరజ్ మనసు ఉందని తెలుస్తోంది. మరింత గొప్పవాన్ని చేయకండి. మీకు ఏమైనా చేయాలనుకుంటే మీరు కూడా ఎవరికైనా సాయం చేయండని సూరజ్ చెబుతాడు.
దాంతో మరింత ఇంప్రెస్ అవుతాడు కార్తీక్. తర్వాత ఇద్దరు శ్రీధర్‌ను కలుస్తాడు. ఎలా ఉందని సూరజ్ అడిగితే.. నీ దయవల్ల బాగున్నాను అని శ్రీధర్ అంటాడు. అంతా దేవుడి దయ అని సూరజ్ అంటే.. నువ్వు అచ్చం నా కొడుకులానే మాట్లాడుతున్నావని శ్రీధర్ అంటాడు. సూరజ్‌ను మెడిసిన్‌కు ఎంత అయిందని అడిగితే.. నేను తీసుకోలేనంత అని డబ్బులు తీసుకోకుండానే వెళ్లిపోతాడు సూరజ్.
ఈ అబ్బాయి చాలా మంచోడిలా ఉన్నాడని శ్రీధర్ అంటే.. దీపను చూస్తున్నట్లుగా ఉందని కార్తీక్ అంటాడు. ఇంతలో డాక్టర్ వస్తాడు. ఇప్పుడు మీకు వచ్చింది మైల్డ్ స్టోక్. మరోసారి హార్ట్ స్టోక్ వచ్చిందంటే చాలా కష్టం. బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అది ఎలాంటి పరిస్థితులకైన దారితీస్తుంది. ఏం చేస్తే రిలాక్స్‌గా ఉండగలరో ఆలోచించండి. రెండు రోజులు హాస్పిటల్‌లోనే ఉండాలని డాక్టర్ చెబుతాడు.
ఇంట్లోనే రిలాక్స్‌గా ఉంటాను
నేను ఇక్కడ ఉండలేను. మా వాళ్లకు తెలిస్తే అంతా ఇక్కడే ఉంటారు. ఇంట్లోనే రిలాక్స్‌గా ఉంటాను అని శ్రీధర్ అంటాడు. సరే డిస్ఛార్జ్ చేస్తాను. కానీ ట్యాబ్లెట్స్ వాడాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం, బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుందని శ్రీధర్, కార్తీక్‌ను హెచ్చరిస్తాడు డాక్టర్. మరోవైపు అత్తింటికి దీప వెళ్తుంది. కార్తీక్ గురించి కాంచన అడిగితే తెలియదని దీప చెబుతుంది. ఇంట్లో చిన్న గొడవ జరిగిందని చెబుతుంది. శ్రీధర్‌కు కాంచన కాల్ చేస్తుంది.
{{/usCountry}}నేను ఇక్కడ ఉండలేను. మా వాళ్లకు తెలిస్తే అంతా ఇక్కడే ఉంటారు. ఇంట్లోనే రిలాక్స్‌గా ఉంటాను అని శ్రీధర్ అంటాడు. సరే డిస్ఛార్జ్ చేస్తాను. కానీ ట్యాబ్లెట్స్ వాడాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం, బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుందని శ్రీధర్, కార్తీక్‌ను హెచ్చరిస్తాడు డాక్టర్. మరోవైపు అత్తింటికి దీప వెళ్తుంది. కార్తీక్ గురించి కాంచన అడిగితే తెలియదని దీప చెబుతుంది. ఇంట్లో చిన్న గొడవ జరిగిందని చెబుతుంది. శ్రీధర్‌కు కాంచన కాల్ చేస్తుంది.
{{/usCountry}}కార్తీక్ గురించి చెబితే నాతోనే ఉన్నాడని శ్రీధర్ అంటాడు. ఎక్కడున్నారని అడిగితే.. శ్రీధర్ చెప్పడు. కార్తీక్‌కు ఇవ్వమంటే దూరంగా ఉన్నాడని శ్రీధర్ అంటాడు. దీప ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని కాంచన అంటే.. వాడు దీపకు దూరంగా ఉంటే తన ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తాడని సెటైర్లు వేసి కాల్ కట్ చేస్తాడు శ్రీధర్. నువ్వు పేషంట్‌వి స్టాండప్ కమెడియన్‌వి కాదని కార్తీక్ అంటాడు. ఇలా మాట్లాడకుంటే మీ అమ్మకు అనుమానం వస్తుందని శ్రీధర్ చెబుతాడు.
మీ అమ్మకు ఎలాగు సంతోషం ఇవ్వలేదు. బాధ ఎందుకు ఇవ్వాలి. ఇది మనలోనే ఉండని అని శ్రీధర్ అంటాడు. మరోవైపు దీప, సుమిత్ర కొట్టింది తలుచుకుని ఫీల్ అవుతుంది జ్యోత్స్న. పారిజాతం వచ్చి కుర్చీలో స్టైల్‌గా కూర్చుంటుంది. నేను, నా మనవడు, దీప ముగ్గురం కలిసి నిన్ను ఇరికించాం. ఈ చీర కొన్నదే నీకోసం. ఈ ప్లాన్ అంతా కార్తీక్ గాడిదే. ఇంట్లోవాళ్లకు నువ్వేంటో తెలిసి పెళ్లి కడుకు రావాలి అని పారిజాతం అంటుంది.
పారు పంచ్‌లు, వార్నింగ్
నీ వాళ్లే నీకు శత్రువులు అయ్యారు. నీ ఇల్లే నీకు జైలు అయింది. మీ అమ్మె నిన్ను కొట్టి దీపను సపోర్ట్ చేసింది. నువ్వు ఓడిపోయావే పిల్ల బాతు బచ్చా. సరిగ్గా 30 రోజుల్లో నీ పెళ్లి జరుగుతుందని పారు అంటుంది. నా పెళ్లి అయ్యేది బావతోనే అంటుంది జ్యో. ఇంట్లోంచి గెంటించేసికునేలా ఉన్నావ్. ఇది గెలుపుకు ఆరంభం అని పారిజాతం అంటుంది. జ్యోత్స్న మాటలకు పంచ్‌లు ఇస్తుంది పారిజాతం.
తనకు సపోర్టే చేయమంటుంది. పారు వినదు. నీ పెళ్లి కార్తీక్ గాడు జరిపిస్తాడు. సరిగ్గా నెల రోజులు. గుర్తు పెట్టుకోవే సుమిత్ర కూతురా అని పారిజాతం చిటికెలు వేసి మరి జ్యోత్స్నతో ఛాలెంజ్ చేస్తుంది. మరోవైపు ఇంటికి శ్రీధర్‌ను తీసుకెళ్లి హార్ట్ ఎటాక్ వచ్చింది చెబుతాడు కార్తీక్. ఎవరి గురించి ఆలోచించావ్ అని కార్తీక్ అడిగితే.. నా కూతురు గురించి అని శ్రీధర్ అంటాడు. స్వప్న టూర్ కోసం జరిగిన గొడవ గురించి చెబుతుంది కావేరి.
శ్రీధర్‌కు ట్యాబ్లెట్స్ ఇవ్వమని స్వప్నకు ఇస్తాడు కార్తీక్. తండ్రికి మనశ్శాంతిగా ఉండే ట్యాబ్లెట్ కూడా ఇవ్వాలని స్వప్నకు చెబుతాడు కార్తీక్. స్వప్నకు క్లాస్ పీకుతాడు కార్తీక్. తను పడుతున్న ఆవేదన గురించి కూడా కార్తీక్ చెబుతాడు. దాంతో స్వప్న సారీ చెప్పి ఇంకోసారి నాన్నతో గొడవ పడనంటుంది. పడితే ఆయన ఉండడు అని కార్తీక్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు.
ఏడిపించిన కార్తీక్
నాన్న, అమ్మ పోతే మరొకరిని తీసుకురాగలమా. నువ్వు లేకుంటే నాకు మరో చెల్లి దొరుకుతుందా. నాన్నను బాగా చూసుకో. నీకు చేత కాకుంటే నేను చూసుకుంటాను అని అందరినీ ఏడిపిస్తాడు కార్తీక్. పిన్ని మా నాన్నను జాగ్రత్తగా చూసుకో. కాశీ ఇక్కడే ఉండు అని కార్తీక్ అంటాడు. కావేరి, స్వప్న, కాశీ చూసుకుంటామని చెబుతారు. అమ్మకు ఏం చెబుతావ్ అని శ్రీధర్ అడిగితే.. జరిగిందే చెబుతానంటాడు కార్తీక్.
తట్టుకోలేదురా అని శ్రీధర్ అంటే.. తట్టుకునేంతవరకు చెబుతాను అని కార్తీక్ వెళ్లిపోతాడు. కాశీ వైపు కన్నీళ్లతో ప్రేమగా చూస్తుంది స్వప్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.