...
...
Next Story

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపతో ఫలించని జ్యోత్స్న బేరాలు- కార్తీక్ వెన్నుపోటు- సీఈఓగా ప్రకటన- బావ, మరదలి మాటల యుద్ధం

కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 7 ఎపిసోడ్‌లో కూతురు పెళ్లి చూడాలని సుమిత్ర చెప్పడంతో పారిజాతం యుద్ధ నీతి చెబుతుంది. దాంతో దీప దగ్గరకు వెళ్లి జ్యోత్స్న బేరాలు ఆడుతుంది. ఆఫీస్ దగ్గర కార్తీక్‌తో మాట్లాడిన జ్యోత్స్న నానా మాటలు అంటుంది. వాటికి ఘాటుగా కార్తీక్ బదులిస్తాడు. బావ, మరదలు మాటల యుద్ధం చేస్తారు.

Published on: Nov 7, 2025, 08:33:35 IST
Advertisement

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్నను సీఈఓ చేయడంపై సుమిత్ర అభిప్రాయాన్ని అడుగుతారు. నా కూతురుని పెళ్లి కూతురుగా చూడాలనుకుంటున్నాను అని చెప్పి అందరికి షాక్ ఇస్తుంది సుమిత్ర. అదే నా కల. నా కూతురుకు పెళ్లి చేసి ఒక అందమైన జీవితాన్ని కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇంతకుమించి నేను ఏం కోరుకోవట్లేదు అని సుమిత్ర అంటుంది.

ట్విస్ట్‌కు దిమ్మ తిరిగిందని

కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 7వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 7వ తేది ఎపిసోడ్

అత్త ఇచ్చిన ట్విస్ట్‌కు దిమ్మ తిరిగిందని దీపతో అంటాడు కార్తీక్. కాసేపట్లో ఆఫీస్‌కు వెళ్లాలి రెడీగా ఉండు అని శివ నారాయణ చెప్పేసి వెళ్లిపోతాడు. పెద్ద మేడమ్‌కు స్ట్రాంగ్‌గా కాఫీ పెట్టమని దీపకు చెబుతాడు కార్తీక్. బావ సీఈఓ అయిపోతే దీప ముందు ఓడిపోయినట్లే అని జ్యోత్స్న అంటుంది. అయితే దీపను పట్టుకో. ఇదే యుద్ధ నీతి. పురాణాల్లో కూడా ఇదే రాసి ఉంది. మనకి సపోర్ట్ చేయడని తెలిసిన మనిషిని సాయం అడగాలి. అప్పుడు తప్పించుకోడానికి చూస్తాడు. అప్పుడు లాక్ చేయాలి అని పారు అంటుంది.

దీప ఏం చేస్తది అని జ్యో అడిగితే.. కార్తీక్ గాడిని నీకు సపోర్ట్ చేసేలా చేస్తుంది. కార్తీక్ గాడు నీకు సపోర్ట్ చేస్తే మీ తాత నీకు సపోర్ట్ చేస్తాడు అని పారిజాతం అంటుంది. దాంతో దీప దగ్గరికి జ్యోత్స్న వెళ్లి సాయం కావాలంటుంది. మీరు అన్ని గుండెలు అదిరిపోయేటివే అడుగుతావ్. ముందు మాటివ్వలేను అని దీప అంటుంది. మన బావ గురించే అడిగేదని జ్యోత్స్న అంటుంది.

నాకు మాత్రమే బావ. నీకు పిలిచే అర్హతే లేదు అని దీప అంటుంది. నా మేనత్త కొడుకు. నాకెందుకు లేదని జ్యోత్స్న అంటుంది. అందుకేనా డ్రైవర్‌ను చేశారు అని దీప అంటుంది. బావ డ్రైవర్ నుంచి ఓనర్ అవుతాడు అని జ్యో అంటుంది. మీకిచ్చి పెళ్లి చేయమంటారా ఏంటీ అని దీప పంచ్ వేస్తుంది.

40 ముక్కలు చేసిన

నువ్వు ఈ ఇంటికి రావడాని కారణం నేనే. నా వల్లే నీకు బావ దక్కాడు. నా రుణం తీర్చుకుంటున్నాను అనుకో అని జ్యో అంటే.. మీ రుణం నేనే తీర్చుకుంటా. అది నా పర్సనల్ అకౌంట్ అని దీప అంటుంది. నేను చెప్పినవన్నీ తీరుస్తానంటున్నానుగా అని దీప చేయి పట్టుకుని ప్రామిస్ చేస్తుంది జ్యో. ఎవరి సపోర్ట్ లేదని ఏడుస్తున్నట్లు నటిస్తుంది జ్యోత్స్న.

మీరు వెళ్లండి నేను ఆలోచిస్తా అని దీప అంటుంది. దాంతో థ్యాంక్స్ చెప్పి సంతోషంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న. నేను ఏం చేయాలో నాకు తెలుసు. ఇది నీకు మీ నానమ్మ ఇచ్చిన సలహా. ముందు ఆవిడకు బుద్ధి చెబితే సెట్ అవుతుందని దీప అనుకుంటుంది. దీపకు ఆఫర్ ఇచ్చింది పారుకు చెబుతుంది జ్యో. ఇది వర్కౌట్ అవ్వదనిపిస్తుందని పారిజాతం అంటుంది.

ఒక్కసారి మూడు ముళ్లు పడితే

ఇవన్నీ మానేసి పెళ్లి చేసుకో అని పారిజాతం అంటుంది. పెళ్లి పెళ్లి అని చంపుతున్నారు. ఒక్కసారి మూడు ముళ్లు పడితే నచ్చకున్న కలిసి బతకాల్సిందే. సీఈఓ అయితే బావే నా భర్త అది ఎలాగో చెబుతా అని జ్యోత్స్న అంటుంది. ముందు ఆఫీస్‌కు బయలుదేరు. ఈలోపు బ్రహ్మాండమైన ఐడియా ఇస్తాను అని పారిజాతం అంటుంది. ఆఫీస్‌కు అంతా వెళ్తారు.

కార్తీక్‌తో జ్యోత్స్న మాట్లాడుతుంది. అనుకుంది సాధించాలంటే రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి నాలా స్ట్రిక్ట్‌గా జెన్యూన్‌గా ఫైట్ చేయడం, రెండోది నీలా బ్యాక్ స్టాబ్ చేయడం అంటే వెన్నుపోటు పొడవడం. నా మనుషులనే నాకు కాకుండా చేశావ్. ఏకైక వారసురాలిని అయిన అధికారం లేకుండా చేశావ్. బోర్డ్ మీటింగ్ పెట్టింది సీఈఓను చేయడానికి. ఇదంతా నువ్వు దీప కోసం చేస్తున్నావ్ అని జ్యోత్స్న అంటుంది.

అంటే ఇప్పుడు నేను పగ సాధిస్తున్నాను అంటున్నావా అని కార్తీక్ అంటాడు. అవును అన్ని తాను చేసిన పనులను కార్తీక్ చేయించినట్లుగా చెబుతుంది జ్యోత్స్న. నీ చేతకాని తనాన్ని వేరేవాళ్లపై రుద్దకు అని కార్తీక్ అంటాడు. మీలా ఇంతలా దిగజారలేదు అని జ్యోత్స్న అంటుంది.

నాతో బేరాలు ఆడావ్

ఆ మాట అనడానికి నీకు నోరెలా వస్తుంది. నిన్ను సీఈఓగా బోర్డ్ మెంబర్స్ వద్దన్నారు. నీకు సిగ్గుంటే ఆరోజే రిజైన్ చేసేదానివి. కానీ, నాతో బేరాలు ఆడావ్. నిజాలు మాట్లాడుతుంటే మండుతుందా. నిజానికి దిగజారిపోయింది నువ్వు. నా భార్యతో వంట గదిలో బేరాలు ఆడటం నేను చూశాను. దీన్నే దిగజారడం అంటారు అని కార్తీక్ అంటాడు.

దాంతో అవాక్కయిన జ్యో లోపల ఏదైనా తేడా జరగాలి మీ అందరిని అని జ్యోత్స్న అంటుంటే.. ఏం చేయలేవ్.. ఏం చేయలేవ్. లోపల ఏం జరుగుతుందో అని భయపడి చేస్తున్నావ్. తల ఎగిరేసిన వాళ్లముందు తలదించుకోవాల్సి వస్తుందని భయపడి చేస్తున్నావ్. నేను రాను. పిలుపు వస్తే ఆగను అని కార్తీక్ అంటాడు. లోపలికి జ్యోత్స్న వెళ్తుంది.

జ్యోత్స్న గారు సీఈఓగా ఉంటే మేము ఈ సంస్థలో ఉండలేం సర్ అని బోర్డ్ మెంబర్ భరణి అంటాడు. నాకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అని జ్యోత్స్న అడుగుతుంది. ఏమంటారు అని శివ నారాయణ అంటే భరణి సారీ అంటాడు. దశరథ్ కూడా వద్దంటాడు.

సీఈఓగా కార్తీక్

మరి కొత్త సీఈఓ ఎవరు అని జ్యోత్స్న అడిగితే.. కార్తీక్‌ను పిలవమని శివ నారాయణ చెబుతాడు. బావను సీఈఓగా చేయకుండా ఎలా ఆపాలి అని అనుకుంటుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe