Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్ లో సుమిత్ర క్యారెక్టర్ తో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్న నటి సీత. సీరియల్ లో తన పాత్రలో ఆమె జీవిస్తూ, ప్రతి ఎపిసోడ్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మారుస్తోంది. సీరియల్ లో తల్లి పాత్ర పోషిస్తున్న సీత.. బయట మాత్రం డ్యాన్స్ లు, రీల్స్ తో హుషారుగా ఉంటోంది.
కార్తీక దీపం 2 సుమిత్ర

కార్తీక దీపం 2 సీరియల్ ను చూసేవాళ్లకు, అందులోని సుమిత్ర క్యారెక్టర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు కన్న కూతురు దీప, మరోవైపు పెంచిన కూతురు జ్యోత్స్న తల్లిగా సుమిత్ర క్యారెక్టర్ కొనసాగుతోంది. కానీ దీప కన్న కూతురని, జ్యోత్స్న తన సొంత కుమార్తె కాదని సుమిత్రకు ఇంకా నిజం తెలియదు.
డ్యాన్స్ తో అదుర్స్
కార్తీక దీపం 2 సీరియల్ లో బరువైన, ప్రధాన పాత్ర పోషిస్తున్న సుమిత్ర అలియాస్ సీత తాజాగా డ్యాన్స్ తో అదరగొట్టింది. డాడీ సినిమాలోని చిరంజీవి సాంగ్ కు సీత స్టెప్పులేసింది. మంచి రిథమ్ తో ఆమె చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సీత ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ‘‘హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవెనింగ్. చాలా రోజుల తర్వాత ఒక చిన్న డ్యాన్స్’’ అనే క్యాప్షన్ తో ఈ వీడియోను సీత పెట్టింది.
సోషల్ మీడియాలో యాక్టివ్
కార్తీక దీపం 2 సీరియల్ లో యాక్టింగ్ తో అలరిస్తున్న సీత.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సహచర సీరియల్ ఆర్టిస్ట్ లు స్వర్ణ, గాయత్రి సింహాద్రి, ప్రేమి విశ్వనాథ్ లతో తరచుగా రీల్స్ చేసి సీత పోస్టు చేస్తూ ఉంటుంది. ఇలా డ్యాన్స్ వీడియోలూ పెడుతోంది.
రసవత్తరంగా
{{/usCountry}}కార్తీక దీపం 2 సీరియల్ లో యాక్టింగ్ తో అలరిస్తున్న సీత.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సహచర సీరియల్ ఆర్టిస్ట్ లు స్వర్ణ, గాయత్రి సింహాద్రి, ప్రేమి విశ్వనాథ్ లతో తరచుగా రీల్స్ చేసి సీత పోస్టు చేస్తూ ఉంటుంది. ఇలా డ్యాన్స్ వీడియోలూ పెడుతోంది.
రసవత్తరంగా
{{/usCountry}}కార్తీక దీపం 2 సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. నిరుపమ్ ఏమో కార్తీక్ గా, ప్రేమి విశ్వనాథ్ ఏమో దీపగా నటిస్తున్నారు. విలన్ జ్యోత్స్న క్యారెక్టర్ లో గాయత్రి సింహాద్రి అదరగొడుతోంది. నటకుమారి ఏమో జ్యోత్స్న నానమ్మ పారిజాతం క్యారెక్టర్ ప్లే చేస్తోంది.
ఇప్పటికే కార్తీక దీపం ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కార్తీక దీపం 2 కూడా టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.