Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 11 ఎపిసోడ్ లో.. అసలు జీవితంలో పెళ్లే చేసుకోనని జ్యోత్స్న చెప్పిన విషయంపై ఆఫీస్ లో దీప ఆలోచిస్తుంది. మాట్లాడేందుకు జ్యోత్స్నను పిలుస్తుంది. జ్యోను కుర్చీలో కూర్చోబెట్టి మనం కాసేపు ఇద్దరం తోడబుట్టువులాగా మాట్లాడుకుందామా? ఏ అమ్మాయి అని పెళ్లి చేసుకొని పిల్లలను కనాల్సిందేనని దీప చెప్పడం స్టార్ట్ చేస్తుంది.
సూరజ్ ప్రేమిస్తున్నాడు

పెళ్లి మీద విరక్తి కలిగిందని జ్యోత్స్న అంటుంది. అది అబద్ధం. నీది కోపం, బాధ. దానికి కారణం సూరజ్ తిరస్కరించడమే. అది నిన్ను తట్టుకోలేనంతగా బాధపెడుతోంది. ఆ బాధతోనే పెళ్లి చేసుకోను అనే నిర్ణయం తీసుకున్నావ్. నిజం ఏంటో తెలుసా? సూరజ్ కు నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను ప్రేమిస్తున్నాడు. పంతానికి పోయి సూరజ్ ను దూరం చేసుకోకు అని దీప చెప్తుంది.
జ్యోత్స్న కన్నీళ్లు
ఒంటరి జీవితం వసంత కాలంలో ఎండిపోయిన చెట్టు లాంటిది. వసంతం గొప్పదనం తెలియాలంటే చెట్టుకు ప్రాణం ఉండాలి. ఆ ప్రాణమే పెళ్లి. నువ్వు జీవితంలో చాలా తప్పులు చేశావ్. కానీ సూరజ్ ను వదులుకోవడం అన్నింటికంటే పెద్ద తప్పు అవుతుంది. సూరజ్ ఏం చెప్పాడో గుర్తు చేసుకో. ఏం చేయాలో నీకే అర్థమవుతుందని దీప చెప్పేసరికి జ్యోత్స్న ఏడుస్తుంది.
సరైన భర్త
నీక్కూడా సూరజ్ అంటే చాలా ఇష్టం. నీలోపల ఎంత ప్రేమ ఉందో నీ కళ్లే చెెప్తున్నాయి. ఒకరిని తలుచుకోగానే కన్నీళ్లు వస్తున్నాయంటే వాళ్లంటే మనకు ప్రేమ అని అర్థం. సూరజ్ ను వదులుకోకు. నీకు అతను సరైన భర్త అని దీప చెప్తుంది. అప్పుడే కార్తీక్, సూరజ్ లోపలికి వస్తారు.
ఏంటి వదిన, ఈ మధ్య కొంతమంది చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారంటా అని ఇండైరెక్ట్ గా జ్యోత్స్న గురించి సూరజ్ అంటాడు. దీంతో జ్యోత్స్న కోపంగా బయటకు తోసుకుంటూ వెళ్లిపోతుంది.
జ్యోత్స్న మనసులో కార్తీక్
{{/usCountry}}ఏంటి వదిన, ఈ మధ్య కొంతమంది చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారంటా అని ఇండైరెక్ట్ గా జ్యోత్స్న గురించి సూరజ్ అంటాడు. దీంతో జ్యోత్స్న కోపంగా బయటకు తోసుకుంటూ వెళ్లిపోతుంది.
జ్యోత్స్న మనసులో కార్తీక్
{{/usCountry}}సూరజ్ దగ్గరకు వెళ్లి కార్తీక్ మాట్లాడతాడు. జ్యోత్స్న డిస్టర్బ్ కావడానికి కారణం నువ్వే. నువ్వు పెళ్లికి ఓకే చెప్పి ఉంటే ఇదంతా ఉండేది కాదు. నువ్వు పగతోనే ఇలా చేస్తున్నావ్. నీకు అన్ని తెలుసు కదా అని కార్తీక్ అంటాడు. నీకు, దీపకు పెళ్లి అయింది కదా, కానీ జ్యోత్స్న మనసులో నుంచి నిన్ను తీసేసిందా? వేరే మనిషిని మనసులో పెట్టుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు చిరాకుగా ఉంటుంది. జ్యోత్స్న మనసులో నువ్వే ఉన్నావని సూరజ్ అనే మాటలను జ్యోత్స్న వింటుంది.
జ్యోత్స్న ఫైర్
నిన్ను మనసులో నుంచి తీయలేదు. అందుకే ఏం చేయాలో తెలియక జీవితంలో పెళ్లి చేసుకోనని నిర్ణయం తీసుకుంది. ఇదంతా జ్యోత్స్న ఆడుతున్న నాటకం బ్రదర్ అని సూరజ్ అనగానే.. జ్యోత్స్న గట్టిగా అరుస్తుంది. ఎవరిది రా నాటకం అని కొట్టేందుకు చేయి ఎత్తి, జ్యో ఆగిపోతుంది. నేను నాటకాలు ఆడుతున్నానని ఎవరైనా చెప్పారా? ఏదైనా చెప్పాలంటే ధైర్యంగా నాతో మాట్లాడు అని జ్యోత్స్న ఫైర్ అవుతుంది.
సూరజ్ తోనే పెళ్లి
నేను నిన్ను ఇష్టపడుతున్నా. నువ్వు పెళ్లి చేసుకున్నా, ఇలాగే ఉన్నా నా ఇష్టం మారదు కదా అని మళ్లీ లాజిక్ గా మాట్లాడతాడు సూరజ్. ఇదంతా విని బుర్ర హీటెక్కిపోయిన కార్తీక్ లోపలికి వెళ్లి దీపకు జరిగింది చెప్తాడు. అదే సమయంలో జ్యోత్స్న తన మీద ఉన్న ప్రేమను చంపుకోలేదని కార్తీక్ తెగ ఫీల్ అయిపోతూ చెప్తాడు. సూరజ్ ను తప్పా ఇంకెవరినీ జ్యోత్స్న పెళ్లి చేసుకోలేదు. జ్యోత్న్స మనసులో ఇప్పుడు నువ్వు లేవు. నిన్ను తుడిచివేసిందని దీప అసలు విషయాన్ని చెప్తుంది.
సాధారణ ప్రేమ కాదు
జ్యోత్స్నలో మార్పు మొదలైంది. ఆ విషయం జ్యోత్స్నకు కూడా తెలియదు. సూరజ్ ను చూసేందుకు జ్యోత్స్న.. జ్యోత్స్నను చూసేందుకు సూరజ్ ఆఫీస్ కు వస్తున్నారు. ఇది సాధారణ ప్రేమ కాదు. వాళ్లు ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేరని దీప చెప్తుంది. మరోవైపు జ్యోత్స్నను అదే పనిగా సూరజ్ చూస్తుంటాడు. కానీ జ్యో అడిగితే మాత్రం శూన్యంలోకి చూస్తున్నానని సూరజ్ తలతిక్కగానే సమాధానమిస్తాడు.
నేను నిన్ను చూస్తున్నానని, నువ్వు నన్ను చూస్తేనే కదా తెలుస్తుంది. నువ్వు నన్ను చూడనప్పుడు, నేను నిన్ను చూస్తున్నానని తెలియదు కదా అని సూరజ్ మాట్లాడతాడు. జ్యోత్స్న కోపంగా అక్కడి నుంచి వెళ్లి మళ్లీ తన సీట్లో కూర్చుంటుంది. ఇదంతా దూరం నుంచి కార్తీక్, దీప చూస్తారు. చివరకు వాళ్లే దగ్గరవుతారని కార్తీక్ తో దీప అంటుంది.
లగేజీతో జ్యోత్స్న
రాత్రి సూరజ్ ఏమో స్కూటీ రిపేర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న లగేజీతో బయటకు వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారని సూరజ్ అడుగుతాడు. ఆఫీస్ లో నా ముఖం చూడటం ఇష్టం లేక నువ్వు అమెరికా వెళ్లిపోతున్నావా? అని సూరజ్ అడుగుతాడు. నాకు పని ఉంది. నా దారిన నన్ను పోనివ్వు. ఇన్నాళ్లు రాంగ్ రూట్ లో వెళ్లా. ఇప్పుడు రైట్ గా వెళ్తున్నానని జ్యోత్స్న చెప్తుంది.
సూరజ్ ఎంత అడిగినా జ్యోత్స్న మాత్రం ఎక్కడికి వెళ్తుందో చెప్పదు. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తానని జ్యో ఇల్లు వదిలి బయటకు వెళ్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.