...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- సూర‌జ్‌తో పెళ్లి కావాలి-దీపే వారసురాలని చెప్పేస్తా- జ్యోత్స్న ట్విస్ట్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 17 ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. సూరజ్ తో పెళ్లి కావాలని తపించిపోతున్న జ్యోత్స్న ఓ బంపరాఫర్ ఇస్తుంది. సూరజ్ తో పెళ్లి జరిగిన రోజే దీపే శివ నారాయణ అసలు వారసురాలు అని చెప్పేస్తానంటుంది. పూర్తి ఎపిసోడ్ ఇక్కడ చూసేయండి.

Published on: Aug 17, 2026, 07:05:18 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 17 ఎపిసోడ్ లో.. సూరజ్ కు పెళ్లి సంబంధాలు ఎందుకు చూస్తున్నారని కార్తీక్, దీపను జ్యోత్స్న అడుగుతుంది. సూరజ్ ఏమో నీ మనసులో తాను ఉన్నానని నిరూపిస్తేనే పెళ్లి అంటున్నాడు. నువ్వేమో అసలు పెళ్లే చేసుకోనంటున్నావని దీప చెప్పుకొస్తుంది.

దీప కౌంటర్

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

ఏ బంధం లేకపోయినా నన్ను వదిన అని ప్రేమగా పిలుస్తున్నాడు. అందుకే అతనికి మేం శ్రేయోభిలాషులుగా ఉండాలి కదా అని దీప చెప్తుంది. మరి నాకు కూడా శ్రేయోభిలాషులుగా ఉండొచ్చు కదా అని జ్యోత్స్న అడుగుతుంది. మాతో నీకు బంధం అవసరం లేదు కదా అని దీప కౌంటర్ వేస్తుంది.

సూరజ్ నాకు కావాలి

ఏనాడైనా ప్రేమగా పిలిచావా? మరి నీ కోసం ఎందుకు ఆలోచించాలి? అని దీప అంటుంది. మీరు సూరజ్ కు సంబంధాలు చూడటం నాకు ఇష్టం లేదని జ్యోత్స్న చెప్తుంది. నువ్వు చెప్పాల్సిన పాయింట్ కు రా అని కార్తీక్ రెచ్చగొట్టగానే జ్యోత్స్న తన మనసులోని మాట చెప్తుంది. సూరజ్ అంటే నాకు ఇష్టం. నేను వాడిని ప్రేమిస్తున్నా. సూరజ్ నే పెళ్లి చేసుకుంటా. సూరజ్ నాకు కావాలని జ్యోత్స్న చెప్తుంది.

జ్యోత్స్న రిక్వెస్ట్

ఈ మాట నేను ఎలా నమ్మాలి? అని కార్తీక్ గుచ్చిగుచ్చి అడుగుతాడు. నా మనసులో నువ్వు లేవు. సూరజ్ మాత్రమే ఉన్నాడు. సూరజ్ నే పెళ్లి చేసుకుంటా. మీరు నా పెళ్లి చేస్తానని ఫ్యామిలీకి మాటిచ్చారు. సూరజ్ తో నాకు పెళ్లి చేయించండని జ్యోత్స్న ఫీల్ అవుతూ చెప్తుంది. ఇదే మాట వెళ్లి సూరజ్ తో చెప్పమని దీప సలహా ఇస్తుంది. కానీ నా మాట నమ్మడు. మీరు ఇద్దరు చెప్తే కచ్చితంగా వింటాడు. మీరే సూరజ్ ను ఒప్పించాలని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది.

దీపే శివ నారాయణ మనవరాలు

మేం ప్రయత్నిస్తాం. కానీ నువ్వు కూడా ఒక అడుగు వేయాలి. సూరజ్ కు నీ ప్రేమ తెలియాలి. దూరంగా ఉండాలని చూడకు అని జ్యోత్స్నకు దీప చెప్తుంది. నీ పెళ్లి చేసే బాధ్యత మాదే అని జ్యోత్స్నకు మాటిస్తారు.

శ్రీధర్ డౌట్

జ్యోత్స్న ఏమంటుంది? అని ఇంట్లోకి వెళ్లిన కార్తీక్, దీపను కాంచన అడుగుతుంది. నేను మారాను, పెళ్లి చేయమంటుందని కార్తీక్ చెప్తాడు. మధ్యలో వచ్చి శ్రీధర్ ఏదో మాట్లాడాలని ట్రై చేస్తే కార్తీక్ కట్ చేస్తాడు. జ్యోత్స్న పెళ్లికి, మీ జీవితానికి ఏదో సంబంధం ఉంది. జ్యోత్స్న కూడా ఏదో నిజం చెప్తానంది. ఆ నిజం ఏంటో చెప్పు అని కార్తీక్ ను శ్రీధర్ అడుగుతాడు. కానీ మట్టిలో దొరికే బంగారం కథ చెప్పి కార్తీక్ తప్పించుకుంటాడు.

సూరజ్ కోసం కాఫీ

మరోవైపు సూరజ్ ఔట్ హౌజ్ కు వెళ్లేసరికి జ్యోత్స్న కాఫీ చేస్తుంటుంది. ఇది నా ఇల్లు. ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని జ్యోత్స్న తెలివిగా మాట్లాడుతుంది. నీ కోసం కాఫీ చేశా. నా చేతలను అర్థం చేసుకోవాలంటే మనసు ఉండాలని కాఫీ కప్ ను సూరజ్ చేతుల్లో పెడుతుంది జ్యోత్స్న. కాఫీలో ఏం కలపలేదు కదా అని సూరజ్ అడుగుతాడు. షుగర్, కాఫీ పౌడర్ అంతే అని జ్యో చెప్తుంది.

నీ లాంటి అమ్మాయి కాఫీ పెట్టిందంటే ఎవిడెన్స్ లేని మర్డర్ ఏదో ప్లాన్ చేసిందని అర్థం అని సూరజ్ అంటాడు. ఇందులో ఏం కలపలేదు. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు అని కాఫీని సాసర్ లో పోసుకుని జ్యోత్స్న తాగుతుంది. అప్పుడు సూరజ్ కాఫీ తాగుతుంటే జ్యోత్స్న సిగ్గుపడుతూ చూస్తుంటుంది.

ఒక అమ్మాయి కాఫీ పెట్టి తను కూడా తాగకుండా నీ చేతిలో పెట్టిందంటే ఏంటి అర్థం అని జ్యోత్స్న అడుగుతుంది. ఈ కాఫీ కప్, గిన్నె ఎవరు కడుగుతారు? అని సూరజ్ ప్రశ్నిస్తాడు. పెళ్లి చేసుకుంటే నీ పెళ్లాం కడుగుతుందని చెప్పి జ్యోత్స్న వెళ్లిపోతుంది.

యుద్ధం చేయాలి జ్యోత్స్న

రాత్రి కాగానే దీపకు కాల్ చేసి జరిగిన విషయాన్ని జ్యోత్స్న చెప్తుంది. నువ్వు మారావు. అది మాకు అర్థమైంది. నీకూ అర్థమైంది. ఒక్కరోజులోనే అన్నీ జరగవు. సూరజ్ నీకు పరీక్షలు పెడతాడు. మనసును గాయపరుస్తాడు. ఇవన్నీ దాటితే సూరజ్ దొరుకుతాడు. అద్భుతాలు అందాలంటే యుద్ధాలు చేయాలి. సూరజ్ ను పెంచిన పెద్దాయన ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కో అని దీప సలహా ఇస్తుంది.

మనకు కావాల్సిన దాని కోసం యుద్ధం చేయాలని జ్యోత్స్న ను దీప ఇన్ స్పైర్ చేస్తుంది. సరే దీపం యుద్ధమే చేస్తానని సూరజ్ ను దక్కించుకోవడం కోసం జ్యోత్స్న సై అంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe