...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. జ్యోత్స్న పంతం- పెళ్లికి సూరజ్ ఓకే- కథను అదిరే మలుపు తిప్పే ట్విస్ట్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 19 ఎపిసోడ్ లో కథను మలుపు తిప్పే ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. జ్యో తన మనసులో మాటను చెప్తుంది. దీంతో జ్యోత్స్న ప్రేమలో పడిపోతాడు సూరజ్. జ్యోను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొంటాడు. అది చూసి దాసు షాక్ అవుతాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ వివరాలు చూసేయండి.

Published on: Aug 19, 2026, 06:59:21 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 19 ఎపిసోడ్ లో.. సూరజ్ కు తన ప్రేమ విషయం చెప్పినా కూడా వినలేదని దీప, కార్తీక్ దగ్గర జ్యోత్స్న వాపోతుంది. సూరజ్ ఫోన్ మాట్లాడుతూ వినలేదని చెప్తుంది. అయితే మళ్లీ ట్రై చేయమని కార్తీక్, దీప కలిసి జ్యోత్స్నకు చెప్తారు.

సూరజ్ పొగరు

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

సూరజ్ ను కావాలనుకుంటున్నందుకు నా మీద నాకే చిరాకు వస్తుంది. సూరజ్ కు అంత యాటిట్యూట్ ఎందుకు? నా ప్రేమ అర్థం కావడం లేదా? పార్టీ ఉంది రమ్మంటే ఎందుకు అంటాడు? నేను పంతం వదిలేశా. కానీ వాడు పొగరుగా మాట్లాడుతున్నాడని జ్యోత్స్న ఫీల్ అవుతుంది.

కార్తీక్ ధైర్యం

నా మనసులో మాట చెప్తానంటే ఛాన్స్ ఇవ్వడం లేదు. సూరజ్ వినాలనుకున్నప్పుడు మాత్రమే వింటాడు. నా మాటలను గోడలు వినడం తప్పా ఎవరికీ అవసరం లేదన్నట్లు ఉందని జ్యోత్స్న చెప్తుంది. నువ్వు ఫైటర్ వి. అందరి ముందు ధైర్యంగా నీ మాటలు చెప్పేసేయ్ అని కార్తీక్ ధైర్యం చెప్తాడు. కానీ మనసులో సూరజ్ ఉన్నాడని రుజువు అడిగితే ఏం చేయాలని జ్యోత్స్న వెళ్లిపోతుంది.

దాసు ఎంట్రీ

ఇంట్లో సూరజ్ సర్ ప్రైజ్ బర్త్ డే కేక్ కటింగ్ కోసం జ్యోత్స్న అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అప్పుడే దాసు ఎంట్రీ ఇస్తాడు. కార్తీక్ రప్పించాడని దాసు చెప్తాడు. మన ఇంట్లో మంచి విషయాలు జరుగుతున్నప్పుడు మనవాళ్లు ఉండాలి కదా, అందుకే కార్తీక్ పిలిపించాడని దశరథ చెప్తాడు. కానీ పారిజాతం ఏమో మంచి జరుగుతుందో లేదో అని అనుమానాలు వ్యక్తం చేస్తుంది.

సూరజ్ షాక్

నేను మనుషులను పుస్తకం చదివినట్లు చదవలేను. కానీ నీ గురించి నీకు తెలియకుండానే తెలుసుకున్నా. ఈ ఇంట్లో నన్ను గారంగా పెంచారు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందరిముందు నీకో మాట చెప్పాలి. సూరజ్ నువ్వంటే నాకిష్టం. మీ అందరికీ చెప్తున్నా సూరజ్ అంటే నాకిష్టం. సూరజ్ తో కలిసి జీవితాంతం బతకగలననే నమ్మకం నాకుందని జ్యోత్స్న మనసులో మాటను చెప్పేస్తుంది.

తాత నేను చెప్పాల్సింది చెప్పా. నేనంటే ఇష్టమో కాదో సూరజ్ చెప్పాలని జ్యోత్స్న అంటుంది. చెప్పు సూరజ్ అని శివ నారాయణ, దశరథతో పాటు కార్తీక్, దీప కూడా అడుగుతారు. మేమంతా నీ మంచి కోరుకునే మనుషులమే. కానీ నిన్ను బలవంతం చేయం. పెళ్లి అనేది ఇద్దరి ఇష్టం ప్రకారమే జరగాలన్నావ్ కదా. ఇప్పుడు జ్యోత్స్నకు ఇష్టమే అని దీప అంటుంది. నీ నిర్ణయం ఏదైనా సరే అంగీకరిస్తామని సుమిత్ర అంటుంది.

జ్యోత్స్నతో పెళ్లి

జ్యోత్స్న అంటే నాకూ ఇష్టమే అని సూరజ్ చెప్పేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడానికి నాకు ఏం అభ్యంతరం లేదు. నేను జ్యోత్స్న మనసులో ఉన్నానని నాకు అర్థమైంది. తన కళ్లను చూసి నేను నమ్ముతున్నా. ఈ రోజు మీ అందరి ముందూ జ్యోత్స్న మనసులో నేనున్నానని చెప్తున్నా. నేను మాత్రమే జ్యోత్స్న మనసులో ఉన్నానని నమ్ముతున్నానని సూరజ్ గుడ్ న్యూస్ చెప్తాడు. దీంతో సూరజ్ ను దక్కించుకోవాలనే పంతాన్ని జ్యో నెరవేర్చుకున్నట్లయింది.

అంతా కొత్తగా ఉన్నట్లు దాసు ఆశ్చర్యపోయి చూస్తాడు. కార్తీక్ చెప్పాడు కానీ ఇంతపెద్ద సర్ ప్రైజ్ ఇస్తాడని అనుకోలేదని దాసు అంటాడు. ఇప్పుడు నువ్వు నా మనవడివి అయిపోయావ్ సూరజ్. నా చిన్న మనవడి బర్త్ డే అంటే ఈ తాత బర్త్ డే అయినట్లే అని శివ నారాయణ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటాడు.

సూరజ్ కేక్ కట్ చేస్తాడు. ఫస్ట్ ముక్క జ్యోత్స్నకు తినిపించమని అందరూ చెప్తారు. జ్యోకు కేక్ పెడతాడు సూరజ్. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks