...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..దాసుకు షాక్ మీద షాక్‌-ప్రేమ నిజ‌మేనా? జ్యోత్స్న‌ను ఇంకా న‌మ్మ‌ని సూరజ్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 20 ఎపిసోడ్ లో జ్యోత్స్నలో మార్పు చూసి దాసు షాక్ అవుతాడు. అంతేకాకుండా నిజాలు బయటపెడతానని జ్యో చెప్పడంతో ఆశ్చర్యానికి గురవుతాడు. ఇక సూరజ్ వేలికి చిన్న గాయం కావడంతో జ్యోత్స్న విలవిలలాడిపోతుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

Published on: Aug 20, 2026, 07:10:53 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 20 ఎపిసోడ్ లో.. సూరజ్ తన బర్త్ డే కేక్ కట్ చేసి ఫస్ట్ జ్యోత్స్నకు తినిపిస్తాడు. జ్యోత్స్న సూరజ్ కు కేక్ పెడుతూ సిగ్గుపడుతుంది. పారిజాతాన్ని బయటకు తీసుకెళ్లి దాసు మాట్లాడతాడు.

దాసు ఆశ్చర్యం

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

అమ్మా, నేను చూసింది నిజమేనా? నా కూతురు మారిపోయిందా? అని దాసు ఆశ్చర్యపోతూ అడుగుతాడు. చాలా సంతోషంగా ఉందంటాడు. పారిజాతం ఏమో ఆస్తి గురించే మాట్లాడుతుంది. సూరజ్ తో జ్యోత్స్న పెళ్లి అవగానే ఆస్తి మొత్తం జ్యోత్స్నకు దక్కుతుందని వీలునామా రాయించారని చెప్తుంది.

అన్యాయం కదా అమ్మా. ఈ ఆస్తి దక్కాల్సింది జ్యోత్స్నకు కాదు దీపకు అని దాసు అంటాడు. వాళ్లే వద్దన్నారని పారు చెప్తుంది. అయితే దీప, కార్తీక్ ల కాళ్లు మొక్కాలి. వాళ్లకు దక్కాల్సిన ఆస్తిని కూడా నా కూతురికి త్యాగం చేసినందుకని దాసు అంటాడు.

దీపకు రాత లేదు

తినే రాత దీపకు లేదు. ఇప్పుడు కార్తీక్, దీప, సూరజ్, జ్యోత్స్న ఒక్కటయ్యారు. నీ కూతురికి జరుగుతున్న మంచిని చూపించేందుకు కార్తీక్ నిన్ను రమ్మన్నాడు. అంతే కానీ నువ్వు వెళ్లి శివ నారాయణకు జ్యోత్స్న మనవరాలు కాదని చెప్పకు. ఆ నిజం మనం చెప్తేనే తెలుస్తుంది. కార్తీక్, దీప ఎలాగో చెప్పరు. సూరజ్ ను జ్యోత్స్న ప్రేమించినందుకు ఆనందపడాలని పారు చెప్తుంది. చేసిన పాపం నీడలాంటిది, ఎప్పటికీ వదలదని చెప్పి దాసు వెళ్లిపోతాడు.

మార్చింది మీరే

అప్పుడు అవును అల్లుడు అని దాసు వస్తాడు. నాన్న అని జ్యోత్స్న ప్రేమగా పిలుస్తుంది. చివరిసారి కలిసినిప్పుడు నాన్న అని పిలవాలంటే అసహ్యంగా ఉందన్నావని దాసు గుర్తు చేస్తాడు. అసహ్యం పోయింది నాన్న. అప్పుడు నా కళ్లు మూసుకుపోయాయి అని జ్యోత్స్న చెప్తుంది. ఇలాగే నిన్ను చూడాలనుకున్నా. నా కూతురు కొత్తగా తయారైంది. మనసున్న మనిషిలా మారిందని దాసు అనగానే.. జ్యోత్స్న తన తండ్రిని హత్తుకుంటుంది.

నిజలను బయటపెడతా

నువ్వే నా తండ్రివి అని చెప్పే రోజు తొందర్లోనే వస్తుంది నాన్న. దీపే దశరథ, సుమిత్రల కూతురు. నేను కళ్యాణి, దాసు కూతురిని. కచ్చితంగా ఈ నిజాలను బయటపెడతానని జ్యోత్స్న చెప్పేసరికి దాసు షాక్ అవుతాడు. ఇలా మాట్లాడుతుంది నువ్వేనా? అని దాసు నమ్మశక్యం కానట్లు చూస్తాడు. వీళ్లే నన్ను మార్చారని కార్తీక్, దీప గురించి జ్యో చెప్తుంది.

దీప, కార్తీక్ కు దాసు థ్యాంక్స్ చెప్తాడు. నీకు నేను తల్లిదండ్రులను ఇచ్చా. నువ్వు నాకు కూతురిని ఇచ్చావని దీపకు మళ్లీ థ్యాంక్స్ చెప్తాడు దాసు. దీపకు ఎలాంటి అన్యాయం జరగకూడదు. నీ పెళ్లితో చాలా జీవితాలు మారిపోవాలని జ్యోత్స్నను రిక్వెస్ట్ చేస్తాడు దాసు. జ్యోత్స్న పెళ్లితో చాలా మంది జీవితాలు మారిపోతాయని దీప కూడా అంటుంది.

సూరజ్ ఆశ్చర్యం

మరోవైపు తన రూమ్ లో కూర్చుని జ్యోత్స్న మాటలను గుర్తు చేసుకుంటాడు సూరజ్. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. నన్ను అర్థం చేసుకొని, పెళ్లికి ఓకే చెప్పావ్ కదా థ్యాంక్స్ అని జ్యోత్స్న అంటుంది. నీ ప్రేమ నిజమేనా? అని సూరజ్ అడిగేసరికి జ్యోకు ఒక్కసారిగా కన్నీళ్లు వస్తాయి. రాతి విగ్రహంలా ఉండే నీ మనసు గాజు బొమ్మలా మారిపోయిందా? నీ మాటలతో, చేతలతో ఎంతోమందిని బాధపెట్టావ్. అలాంటి జ్యోత్స్న ఇలా మారిపోవడం ఆశ్చర్యంగా ఉందని సూరజ్ అంటాడు.

నీ ప్రేమకు బానిసను

నీ కోసం నాకు తెలియకుండా నేనే ఏడుస్తుంటే నాకెంత ఆశ్చర్యంగా ఉండాలి. నన్ను నువ్వే మార్చావు. ఎవరి వల్ల కానిది నీ వల్ల అయింది సూరజ్. నువ్వు నన్ను ప్రేమించచు అని అడిగినప్పుడు నిన్ను ప్రేమించలేదు. మారతావో లేదో అని వదిలేసినప్పుడు అచ్చమైన ఆడపిల్లగా మారాను. నీ మీద ఆశలు పెరిగాయి. రాతి విగ్రహంలా ఉన్న నన్ను గాజుబొమ్మను చేసేశాయని జ్యోత్స్న చెప్తుంది.

సూరజ్ కు గాయం

ఆ మాటలకు సూరజ్ ఫీల్ అవుతాడు. నీ ప్రేమకు నేను బానిసను అయిపోయా. ప్రేమంటే ఏంటో తెలిసింది నీ వల్లే. నాకు ఏం కావాలో తెలిసింది నీ వల్లే. నా మనసు నీ వశమైపోయింది. నేను నువ్వు అయిపోయా. నువ్వు లేనంటే నేనే లేను. నువ్వు కాస్త దూరమైనా తట్టుకోలేను. కానీ నువ్వు నాకు ఏంటి పరీక్షలు పెడుతున్నావని జ్యోత్స్న అడుగుతుంది.

అప్పుడే సూరజ్ వేలికి చిన్న గాయమై రక్తం వస్తుంది. అది చూసి జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. నీ ఒంట్లో నుంచి వచ్చే రక్తాన్ని నేను చూడలేను. వెంటనే ఆపాలని వేలికి కట్టు కడుతుంది జ్యో. గాయం చిన్నదే జ్యోత్స్న. నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం లేదని సూరజ్ చెప్పినా జ్యోత్స్న వినదు.

ఈ జన్మంతా నువ్వు నాతో ఉండాలని కోరుకునే ప్రేమ ఇది అని జ్యోత్స్న అంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe