...
...
Next Story

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీప‌కు అమ్మానాన్న ఉన్నారు.. నిజం తెలియాల‌న్న ద‌శ‌ర‌థ‌.. జ్యోకు దిమ్మ‌తిరిగే షాక్‌

కార్తీక దీపం 2 టుడే ఫిబ్రవరి 25 ఎపిసోడ్ లో దీప అనాథ కాదు, దీపకు అమ్మానాన్న ఉన్నారని దశరథ అంటాడు. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నిజం చెప్పేస్తానని దశరథ అంటే, కార్తీక్ అడ్డుకుంటాడు. తండ్రికి నిజం తెలిసిందని జ్యోత్స్న అనుకుంటుంది.

Published on: Feb 25, 2026, 07:18:38 IST
Advertisement

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 25 ఎపిసోడ్ లో.. డాడీ ఎలా నీ కూతురు కాంచన ఇంటి కోడలు అయింది? అని దశరథను జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. దశరథ కూతురు దీప అయితేనే ఇది సాధ్యమవుతుందని అనసూయ చెప్తుంది. బంధాలు, మాటలు మారిపోనప్పుడు నువ్వెందుకు డాడీ అలా మాట్లాడాలి. అమ్మానాన్న చచ్చిన ఈ అనాథ మెడలో బావ తాళి కట్టాడని జ్యోత్స్న అంటుంది.

దీప అనాథ కాదు

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

దీప అనాథ కాదు. దీపకు అమ్మానాన్న ఉన్నారు. దీప అమ్మానాన్న బతికే ఉన్నారు. వాళ్లెవరో చెప్పడానికి ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. నా చెల్లి నా దగ్గర తీసుకున్న మాట ఎలా నెరవేరిందని అడిగావు కదా జ్యోత్స్న అని దశరథ అంటాడు. దానికి సమాధానం నేనే చెప్పాలి మామయ్య. ఎందుకంటే నా భార్య గురించి జ్యోత్స్న మాట్లాడుతుంది. నా పెళ్లి మీ అమ్మానాన్న చేతుల మీదుగా జరిగింది కదా. అప్పుడు మీ నాన్న దీపకు తండ్రి అవుతాడని కార్తీక్ చెప్తాడు.

నెరవేరిన కాంచన మాట

తండ్రి స్థానంలో మామయ్య, తల్లి స్థానంలో అత్త ఉండి కన్యాదానం చేశారు. అంటే వాళ్ల కూతురిని చెల్లి ఇంటికి కోడలిగా ఇచ్చారు. మా అమ్మ కోరిక అదే కదా. మా అమ్మ కోరిక నీ కూతురిని ఇంటి కోడలు చేయమని కానీ జ్యోత్స్నను చేయమని కాదు. దీపను మామయ్య కూతురు అనుకున్నాడు కాబట్టే మాట నెరవేరిందని కార్తీక్ కౌంటర్ ఇస్తాడు.

ఏంటి దీప బావ చాలా తెలివిగా మాట్లాడుతున్నాడని జ్యోత్స్న అడుగుతుంది. ఉన్నది ఉన్నట్లు చెప్పాడని దీప అంటుంది. మీ అమ్మానాన్న బతికే ఉన్నారని మా డాడీ అన్నాడు. ఎక్కడున్నారు? అసలు ఎవరు మీ అమ్మానాన్న అని దీపను జ్యోత్స్న అడుగుతుంది.

ఇంట్లోనే కాశీ

దీప అమ్మానాన్న ఎవరు అంటే ఈ రోజు నీ ముందు నిలబెట్టలేకపోవచ్చు. కానీ ఎక్కడో ఒక చోట ఉన్నారని దీప నమ్ముతుంది. మేం నమ్ముతున్నామని జ్యోత్స్నతో దశరథ అంటాడు. నా తమ్ముడు ఒక రోజు కబురు పెట్టాడు. వెళ్లి చూసేసరికి చిన్న బిడ్డ ఉంది. ఈ బిడ్డను ఎవరో బస్టాండ్ లో వదిలివేశారంటా. బిడ్డ ఏడుపు విని ఆ పాపను చేతుల్లోకి తీసుకున్నాడు. దొరికిన బిడ్డను అపురూపంగా భార్యకు చూపించాడు. దీప అని పేరు పెట్టి నా తమ్ముడి భార్య చనిపోయింది. దీప అంటే నా తమ్ముడికి ఆరో ప్రాణం అని దశరథతో అనసూయ చెప్తుంది.

కుబేర దేవుడు

నా తమ్ముడు మళ్లీ పెళ్లి చేసుకోలేదు. దీప కోసమే బతికాడు. దీపను చూస్తూనే పోయాడని అనసూయ వివరిస్తుంది. దేవుడమ్మా నీ తమ్ముడు. తనకు పుట్టని బిడ్డ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన కుబేర దేవుడమ్మా. నీ తమ్ముడు బతికి ఉంటే కాళ్లు కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకునేవాణ్ని అని దశరథ ఎమోషనల్ అవుతాడు.

కుబేర ఆ రోజు దీపను బస్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయి ఉంటే మనకు దక్కేది కాదు కదా అని దశరథ ఏడుస్తాడు. దీప మహర్జాతకురాలు. పెద్ద కుటుంబంలో పుట్టి ఉంటుందని అనసూయ అంటుంది. నా కూతురు అని దశరథ చెప్పబోతుంటే కార్తీక్ ఆపుతాడు.

కన్న కూతురిని చూశాననే

దశరథలో మార్పు గురించి కాంచన, శివనారాయణ మాట్లాడుకుంటారు. నాన్న నిజం చెప్పకుండా కొన్ని రోజుల ఆపాలని దీప అనుకుంటుంది. మరోవైపు నా పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీకు తెలిసేదిరా. ఇన్నేళ్ల తర్వాత కన్నకూతురిని చూశాననే ఆనందం నన్ను నేను మర్చిపోయేలా చేస్తుంది. కుబేరకు చేతులు ఎత్తి నమస్కారం పెట్టడం తప్పా నేను ఏం చేయగలను చెప్పు అని కార్తీక్ తో దశరథ అంటాడు.

దీప మీద ఒట్టు వేసింది నేనే కాబట్టి మాట వెనక్కి తీసుకుంటా. దీప నా కూతురు అనే నిజం చెప్పేస్తా. కొన్ని చేతులు దీప తలరాతను మార్చాయి. దీపను పేదింటి ఇంటికి వెళ్లేలా చేశాయి. నేనే నా కూతురిని దూరం చేసుకున్నా. అందరిని గుడ్డిగా నమ్మి బయట చేతులు కట్టుకుని నిలబడ్డా. నా కూతురి జీవితానికి అన్యాయం జరిగింది. కుబేర చనిపోయాక నా కూతురి జీవితం రోడ్డు మీద పడింది. భర్త, అత్త మోసం చేశారని దశరథ ఎమోషనల్ అవుతాడు.

దీప ఎవరో అందరికి తెలియాలి. సుమిత్రకు ఏం కాదురా అని కార్తీక్ తో దశరథ అంటాడు. ఇప్పుడు మనం చేయాల్సింది అత్తను కాపాడటం. ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక అన్నీ చెబుదాం. జ్యోత్స్న అన్ని విషయాలు తెలిసే అలా అంటుందని కార్తీక్ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe