కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: తెగించిన జ్యోత్స్న- సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ ఉందనే నిజం- తల్లిని చంపాలని ప్లాన్
కార్తీక దీపం 2 టుడే జనవరి 9 ఎపిసోడ్ లో తన తల్లి గురించి కార్తీక్ తో మాట్లాడుతూ దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. శివ నారాయణ ఇంటికి కాంచనను తీసుకెళ్లేందుకు శ్రీధర్ వస్తాడు. మరోవైపు సుమిత్రకు నిజం చెప్పి చంపేయాలని జ్యోత్స్న కుట్ర పన్నుతుంది. ఇదంతా శివ నారాయణ, కార్తీక్, దీప, కాంచన చూస్తారు.
కార్తీక దీపం 2 టుడే జనవరి 9 ఎపిసోడ్ లో ఎవరు ఇంటి వారసురాలు? ఎవరు కాపాడుతారు? నేను మీ కూతురు అని నాన్నతో చెప్పగలనా? జ్యోత్స్న ఎవరు అంటే కథ మొదలైన చోటుకు వెళ్లాలి. అప్పుడు ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో. ఇప్పుడు జ్యోత్స్న కన్న కూతురు కాదు. ఈ విషయం వాళ్లంతట వాళ్లు బయటపెట్టరు. కానీ బయటపడక తప్పదని కార్తీక్ తో చెప్తూ దీప బాధపడుతుంది.

దీప కన్నీళ్లు
మా అమ్మ బతకాలి బావ. దాని కోసం నేను ఏమైనా చేస్తా. కన్న కూతురిని నేనే కాబట్టి ఈ విషయం అందరికీ చెప్పాలని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తకు వ్యాధి ఉన్న విషయమే అత్త తట్టుకోలేదు. అలాంటిది జ్యోత్స్న నీ కన్న కూతురు కాదని చెప్తానంటేవేంటీ? ముందు అత్తకు వ్యాధి గురించి చెప్పి ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత ఎలాగో తెలియాల్సిందే. తొందరపడితే అత్త ప్రాణాలు దక్కవు. జ్యోత్స్న ఇంట్లో నుంచి పారిపోవాలనుకుందని కార్తీక్ చెప్తాడు.
కార్తీక్ కు తెలుసు
ఏదో చేస్తానని చెప్పి చివరకు చేసేదే ఇదా? శివ నారాయణ మనవరాలు భయపడి ఇంట్లో నుంచి పారిపోవడమా? నేను కూడా వచ్చేసేదాన్ని కదా. కార్తీక్ గాడు మాయగాడు. కాపలా కాసి పట్టుకున్నాడు. నువ్వు అసలైన వారసురాలివి కాదని కార్తీక్ కు తెలుసు. ఇంట్లో రచ్చకు భయపడి నువ్వు పారిపోతావని ముందే గెస్ చేసి కాపలా ఉన్నాడని పారిజాతం అంటుంది. బావకు నిజం నువ్వు చెప్పావని అనుకుంటున్నానని జ్యో కంగారు పడుతుంది.
ఇంట్లోనే ఉండమని
నీకు సుమిత్ర మీద ప్రేమ లేదు కానీ కార్తీక్ కు ఉంది. నిన్ను వెతికి మరీ తీసుకొస్తాడని జ్యోతో పారు అంటుంది. బావను చూస్తుంటే నా అంతట నేనే ఇంటి వారసురాలిని కాదని చెప్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోందని జ్యో అనుకుంటుంది. ఉదయం శౌర్యపై అరిచేస్తుంది దీప. దీపను ఇంట్లోనే ఉండమంటాడు కార్తీక్. నేను మా అమ్మ దగ్గర జాగ్రత్తగా ఉంటాలే. మా అమ్మకు కష్టమొచ్చిందని తెలిసినప్పటి నుంచి తట్టుకోలేకపోతున్నా అని దీప అంటే, మీ అమ్మ ఎవరు? అని వచ్చి శౌర్య అడుగుతుంది.
కాంచన కోసం శ్రీధర్
ఈ రోజు నేను కూడా వస్తా. ఎలా మాట్లాడాలో నాకు తెలియదా? నీకు అత్త కాకముందే తను నాకు వదిన అని కాంచన అంటుంది. అత్తకు క్యాన్సర్ అని తెలిస్తే తట్టుకోగలదా? బాధతో నోరు జారతావేమో అని కార్తీక్ అంటాడు. మా నాన్న ఇంటికి తీసుకెళ్తారా అని నా భార్య మెసేజ్ పెట్టగానే ఇక్కడ వాలిపోయానని శ్రీధర్ సంతోషంతో వస్తాడు. కష్టాలకు, బాధలకు తల వంచకూడదు. మీ అమ్మకు ఏం కాదని దీపతో కార్తీక్ చెప్తాడు.
నిజం చెప్పేస్తానని జ్యో
ఎన్ని రకాలుగా ఆలోచించిన ఈ సమస్య నుంచి బయటపడలేమనిపిస్తోంది గ్రానీ. రూల్స్ బ్రేక్ చేయడం చాలా ఈజీ. నాకు ఈ ఆస్తి కావాలి. శివ నారాయణ మనవరాలిని కాదని తెలియాలంటే ఒక పని చేయాలి. నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందమ్మా, నువ్వు ఎన్నో ఏళ్లు బతకవని అమ్మతో చెప్తానని జ్యో అంటుంది. అలా చెప్తే సుమిత్ర చనిపోతుందేనని పారు అంటే, మనం సేఫ్ గా ఉంటాం కదా గ్రానీ అని జ్యో అంటుంది. పారు లాగిపెట్టి కొడుతుంది. ప్రాణాలు తీస్తావా? అని ప్రశ్నిస్తుంది.
నన్ను నేను కాపాడుకోవడానికి ఇంతకుమించిన దారి నాకు కనపడటం లేదు. నువ్వే నాకు సాయం చేయాలి. మాటలతో చంపేస్తున్నాం అంతే. సాక్ష్యం ఉండదు. భయంతో పోయిందని ఇంట్లో వాళ్లు అనుకుంటారు. నేనే భయాన్ని చంపేయాలని సుమిత్ర దగ్గరకు జ్యో వెళ్తుంది.
నిద్రలోకి సుమిత్ర
నాకు ఏమైందని టాబ్లెట్ వేసుకోవాలని సుమిత్ర అడుగుతుంది. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్లకు ఏమైనా అయితే తట్టుకోలేం. అలాంటిది మనిషే బతకడని తెలిస్తే అది ఓ నరకం. నేను అలాంటి బాధనే మోస్తున్నా. నీకు బ్లడ్ క్యాన్సర్ మమ్మీ. ఈ నిజం నీకు చెప్తే ఏమైపోతావని భయపడి ఎవరూ నిజం చెప్పట్లేదు. నీకొచ్చిన వ్యాధి ప్రాణాంతకమైనదైనా తట్టుకొని నిలబడతావని జ్యో చెప్తుంది. కానీ సుమిత్ర ఈ మాటలు వినకుండానే నిద్రపోతుంది.
బయట నుంచి శివ నారాయణ, కాంచన, కార్తీక్, దీప కోపంతో ఇదంతా చూస్తారు. సమాధానం చెప్పు. నీ ఆలోచనలు ఏంటో అర్థం కావడం లేదని శివ నారాయణ గట్టిగా అడుగుతాడు. దీనికేదో దెయ్యం పట్టింది. తల్లి మీద కొంచమైనా ప్రేమ ఉందా? అసలు నువ్వు మా వదిన కూతురివేనా? అని కాంచన అడగడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.














