Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూన్ 22 ఎపిసోడ్ లో ఫుడ్ ను సేల్ చేసేందుకు దీప, సూరజ్ కలిసి సూపర్ ప్లాన్ వేస్తారు. అవమానించేలా మాట్లాడిన జ్యోత్స్నకు దిమ్మతిరిగే షాక్ తగులుతుంది. ఇంకా కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
సూపర్ ఐడియా

వెయ్యి మంది కోసం రెడీ చేసిన భోజనాలు సేల్ చేయడానికి ఓ ఐడియా ఉందని శివ నారాయణకు దీప, సూరజ్ వివరిస్తారు. వంటలక్క స్పెషల్ ఫ్లాష్ సేల్ పేరుతో అన్ని రెస్టారెంట్లలో కలిపి 800 ప్లేట్స్ అమ్ముదామని, అనాథ శరణాలయంలో 200 ప్లేట్లు పంచుదామని చెప్తారు. లంచ్ టైమ్ అవుతుందని శివ నారాయణ సీరియస్ గానే మాట్లాడతాడు. మరి రెస్టారెంట్లలో ప్రిపేర్ చేసిన ఫుడ్ పరిస్థితి ఏంటని అడుగుతాడు.
గిఫ్ట్ గా గోల్డ్ కాయిన్స్
మన రెస్టారెంట్లకు జనాలను రప్పించాలి. బహుమతులుగా గోల్డ్ కాయిన్స్ పెట్టాలని దీప చెప్తుంది. అమ్మా, వంటలక్క ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంతో తెలుసా అని జ్యోత్స్న మధ్యలోకి దూరుతుంది. పెద్ద మేడం, ముందు వాళ్లు చెప్పేది వినమని కార్తీక్ కౌంటర్ ఇస్తాడు. భోజనాలు చేసే వాళ్ల పేర్లతో లక్కీ డ్రా తీస్తాం. మూడు గంటల్లో గంటకు ఒకరిని సెలక్ట్ చేస్తాం. వాళ్లకు గోల్డ్ కాయిన్లు ఇస్తాం. అలాగే ఒకరికి 10 రోజుల పాటు ఫ్రీ టిఫిన్ కూడా అందిస్తామని సూరజ్, దీప చెప్తారు.
జ్యోత్స్న నిందలు
అంటే కంపెనీని దివాళా తీయిస్తే కానీ నిద్రపోను అంటావ్. వన్డే సేల్ కు రెస్టారెంట్లలో ఆఫర్లు పెట్టడం ఏంటి? మీరు ప్రిపేర్ చేసిన ఫుడ్ ఎప్పుడు సేల్ అవ్వాలి? టైమ్ లేకపోవడమే ఇందులో ఉన్న పెద్ద మైనస్. మీరు ఆఫర్ పెట్టినా జనాలు ఎక్కువగా రారు. ఫుడ్ మిగలడమే కాదు ఈ గోల్డ్ కాయిన్లతో మరో 60 వేల వరకు లాస్. లాస్ అని తెలిసినా తమ ఫెయిల్యూర్ ను అన్ని బ్రాంచెస్ కు షేర్ చేసి తప్పించుకోవాలనుకుంటున్నారని జ్యోత్స్న లేని పోని నిందలు వేస్తుంది.
దీపకు అవమానం
{{/usCountry}}అంటే కంపెనీని దివాళా తీయిస్తే కానీ నిద్రపోను అంటావ్. వన్డే సేల్ కు రెస్టారెంట్లలో ఆఫర్లు పెట్టడం ఏంటి? మీరు ప్రిపేర్ చేసిన ఫుడ్ ఎప్పుడు సేల్ అవ్వాలి? టైమ్ లేకపోవడమే ఇందులో ఉన్న పెద్ద మైనస్. మీరు ఆఫర్ పెట్టినా జనాలు ఎక్కువగా రారు. ఫుడ్ మిగలడమే కాదు ఈ గోల్డ్ కాయిన్లతో మరో 60 వేల వరకు లాస్. లాస్ అని తెలిసినా తమ ఫెయిల్యూర్ ను అన్ని బ్రాంచెస్ కు షేర్ చేసి తప్పించుకోవాలనుకుంటున్నారని జ్యోత్స్న లేని పోని నిందలు వేస్తుంది.
దీపకు అవమానం
{{/usCountry}}బండ్ల మీద ఇడ్లీలు అమ్ముకునేవాళ్లకు కార్పొరేట్ బిజినెస్ గురించి ఎంత ఐడియా ఉంటుందో దీపను చూస్తే అర్థమవుతోందని జ్యో అవమానిస్తూ మాట్లాడుతుంది. మనుషులను అంచనా వేయడంలో దీప ఫెయిల్, ఆ బ్రాంచ్ కోలుకోవడానికి మరో నాలుగేళ్లు పడుతుందని జ్యో అంటుంది. దీపది ఎప్పుడూ సక్సెస్ ఫుల్ హ్యాండే అని కార్తీక్ అంటారు. ఈ ప్లాన్ గురించి దీప, జ్యోత్స్న గొడవ పడతారు.
ఇలాగే అరుస్తూ టైమ్ వేస్ట్ చేస్తారా? అని శివ నారాయణ అరుస్తాడు. నా బ్రాంచ్ కు భోజనాలు పంపించడానికి వీల్లేదని జ్యో అంటే.. శివ నారాయణ ఒప్పుకోడు. సాయంత్రం లోపు సేల్ అయిపోవాలి. కంపెనీకి నష్టం వచ్చినా, ఫుడ్ వేస్ట్ అయినా నేను తీసుకోబోయే నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని శివ నారాయణ మరోసారి గట్టిగా చెప్తాడు. ఏ నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది అని దీప చెప్తుంది.
ఎగిరిపడ్డ జ్యో
దీప, సూరజ్, కార్తీక్ రంగంలోకి దిగుతారు. అన్ని బ్రాంచెస్ కు కాల్స్ చేస్తారు. మరోవైపు వీళ్ల ప్లాన్ సక్సెస్ కాదని జ్యోత్స్నకు మేనేజర్ వంశీ చెప్తాడు. జ్యూస్ తాగుతూ కార్తీక్, దీప పడుతున్న కంగారును జ్యో ఎంజాయ్ చేస్తోంది. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా, అలాగే ఓడిపోయే బ్యాచ్ కు మాటలు ఎక్కువ అని జ్యో కౌంటర్లు వేస్తుంది.
దీప టెన్షన్
అప్పుడే ఓ రెస్టారెంట్ బ్రాంచ్ మేనేజర్ దీపకు కాల్ చేసి కస్టమర్లు ఎవరూ రావట్లేదని చెప్తారు. దీంతో దీప టెన్షన్ పడుతుంది. సూరజ్ మరో బ్రాంచ్ కు కాల్ చేసినా అదే పరిస్థితి ఉంటుంది. వంశీ, ఈవ్ నింగ్ సీఈఓ గా నేను బాధ్యతలు తీసుకోబోతున్నా. ఆల్మండ్ కేక్, ఫ్లవర్ బొకే ఆర్డర్ చేయ్ అని జ్యోత్స్న చెప్తుంది. పారిజాతానికి కాల్ చేసి సాయంత్రం మంచి ముహూర్తం చూడమని చెప్తుంది. కార్తీక్ ను అక్కడి నుంచి తీసుకెళ్తుంది జ్యో.
సోషల్ మీడియాలో వీడియో
మరోవైపు శివ నారాయణ దగ్గరకు జ్యో వెళ్తుంది. వంటలక్క స్పెషల్ తాళి తినడానికి ఎవరూ రావట్లేదంటా అని జ్యో చెప్పగానే శివ నారాయణ షాక్ అవుతాడు. అప్పుడే సోషల్ మీడియాలో ఓ వీడియో చూశానంటూ వంశీ పరుగెత్తుకుంటూ వస్తాడు. ఫుడ్ సేల్స్ పెరగడానికి ఆఫీస్ బాయ్ నానితో సూరజ్ చేయించిన వీడియో అది. దీన్ని ఫేక్ పబ్లిసిటీ అని జ్యో అంటే, సూరజ్ వచ్చే ప్రాక్టికల్ పబ్లిసిటీ అని అంటాడు.
ఎవరైనా ఏదైనా గెలిస్తే చూసేవాళ్లకు ఆశ కలుగుతుంది. నానికి గెటప్ వేయించి ఆ వీడియో తీశా. సోషల్ మీడియాలో షేర్ చేయమన్నా. కచ్చితంగా జనం వస్తారని సూరజ్ ఎక్స్ ప్లెయిన్ చేస్తాడు. ఇది చీటింగ్ అని జ్యో అంటే, దీన్ని స్ట్రాటెజీ అని కార్తీక్ కౌంటర్ ఇస్తాడు. ఇందులో ఏ మోసం లేదని, దీన్ని తెలివి తేటలు అంటారని శివ నారాయణ కూడా చెప్పడంతో ఈ సారి జ్యో షాక్ అవుతుంది.
ప్లాన్ సక్సెస్
అప్పుడే రెస్టారెంట్ మేనేజర్ నుంచి దీపకు కాల్ వస్తుంది. జనాలు రెస్టారెంట్ కు ఎగబడుతున్నారు మేడం. మీరు పంపిన భోజనాలన్నీ అయిపోయాయని చెప్తాడు. దీంతో దీప ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కార్తీక్, సూరజ్ లకు కూడా ఇతర బ్రాంచ్ ల నుంచి ఇదే విధంగా కాల్స్ వస్తాయి. దీంతో జ్యోత్స్న ముఖం మాడిపోతుంది. గోల్డ్ కాయిన్ ప్రజెంటేషన్ మన ఆఫీస్ లోనే, దానికి ఏర్పాట్లు చేసుకో వంశీ. చీఫ్ గెస్ట్ పెద్ద మేడమే అని కార్తీక్ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.