...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: దీపే నా కన్నకూతురు.. బాంబ్ పేల్చిన దశరథ..అందరూ షాక్..దీపను గన్ తో షూట్ చేసిన జ్యోత్స్న

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే మార్చి 12 ఎపిసోడ్ లో అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. దీపకు, ఆమె కడుపులో బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ చెప్తుంది. దీంతో అసలు నిజం నేనే చెప్తానని దశరథ కుండ బద్ధలు కొడతాడు. దీపే నా సొంత కూతురని, దాసు కూతురు జ్యోత్స్న అనే నిజాన్ని బయటపెడతాడు.

Published on: Mar 12, 2026, 07:22:27 IST
Advertisement

కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 12 ఎపిసోడ్ లో.. మరో హాస్పిటల్లో దీపకు టెస్టులు చేయిస్తారు. అన్ని టెస్టులు చేశానని, రిపోర్ట్స్ రాగానే పంపిస్తానని డాక్టర్ చెప్తుంది. నా ఫోన్ నంబర్ కు పంపించమని జ్యోత్స్న చెప్తుంది. హాస్పిటల్ కు వెళ్దామని దీపతో కార్తీక్ అంటాడు. రిపోర్ట్స్ వచ్చేంతవరకూ అందరం ఇంట్లోనే ఉందామని జ్యోత్స్న, శివనారాయణ చెప్తారు.

కోడలు కాదు మేనకోడలు

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

స్వప్న దగ్గరకు దాసు వస్తాడు. నేను కోడలి కోసం వచ్చానని దాసు అంటాడు. మామయ్య నేను మేనకోడలు అవుతా, అలాగే పిలవమని స్వప్న అంటుంది. స్వప్నకు దాసు ప్రసాదం ఇచ్చి బొట్టు పెట్టుకోమంటాడు. స్వప్న పాపిట్లో కూడా బొట్టు పెట్టుకుంటుంది. ఒక్క క్షణం ఆగిపోయి ఆలోచిస్తుంది. నువ్వేం తప్పు చేయలేదమ్మా, నువ్వు ముత్తయిదువు కదా అని దాసు అంటాడు.

పెళ్లి రోజు

ఈ రోజు మీ భార్యాభర్తల పేరు మీద అర్చన చేయించా. ఈ రోజు మీ మొదటి పెళ్లి రోజు. సరిగ్గా సంవత్సరం క్రితం పెద్దలను ఎదిరించి భార్యాభర్తలుగా ఒకటైన రోజు. కానీ ఈ రోజు మీరు విడిపోయిన దంపతులు. అందుకే మొదటి పెళ్లి రోజు గుర్తు లేకుండా పోయింది. నాలాంటి వాడు గుర్తు చేస్తేనే కానీ గుర్తు లేనంత గొప్ప ప్రేమికులు మీరు. మీలాంటి జంటలను చూసే ప్రేమ పెళ్లిళ్లంటే పెద్దవాళ్లు భయపడేది. మీలో ఒక్కరికైనా మీ పెళ్లి రోజు గుర్తుందా అని కాశీ, స్వప్నను దాసు అడుగుతాడు.

ఇంటికి కార్తీక్, దీప

కార్తీక్, దీప ఇంటికి రావడంతో దశరథ కంగారు పడతాడు. దీపను తీసుకుని ఇంటికి ఎందుకు వచ్చావని దశరథ అడుగుతాడు. అప్పుడే వచ్చిన కాంచన, మేమంతా కలిసి హాస్పిటల్ కు వెళ్లామని చెప్తుంది. బిడ్డ విషయంలో కార్తీక్, దీప అబద్ధం ఆడుతున్నారని జ్యోత్స్న అంటుంది. పుట్టబోయే బిడ్డ విషయంలో వీడు బాధపడుతుంటే మీరంతా వీడి మీద ఎంక్వైరీ చేస్తున్నారా అని కార్తీక్ గురించి దశరథ అంటాడు. నిజం ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉందని శివ నారాయణ చెప్తాడు.

డాక్టర్ రిపోర్ట్స్

తండ్రిని రెచ్చగొట్టి నిజాలు బయటపెట్టేలా చేసేందుకు జ్యోత్స్న ట్రై చేస్తుంది. అప్పుడే జ్యోత్స్నకు డాక్టర్ కాల్ చేస్తుంది. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల దీపకు ప్రమాదం ఉందనేది అబద్ధం. ఎవరో రాంగ్ రిపోర్ట్ ఇచ్చి భయపెట్టారు. తల్లీబిడ్డ ఇద్దరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ బాంబ్ పేలుస్తుంది.

అబద్ధం ఎందుకు?

బిడ్డ విషయంలో ఎందుకు అబద్ధం చెప్పారని కార్తీక్, దీపను అందరు ప్రశ్నిస్తారు. నువ్వు ఈ రోజు అందరికీ సమాధానం చెప్పాల్సిందే బావ అని జ్యోత్స్న అడుగుతుంది. దీప స్థానంలో నీ కూతురు ఉంటే అప్పుడు నీకు ఈ బాధ తెలిసేదని దశరథతో శివ నారాయణ అంటాడు. అసలు కార్తీక్ చెప్తున్న అబద్ధాలు ఎవరి కోసం? ఈ రోజు నిజం తెలియాల్సిందేనని శివ నారాయణ గట్టిగా అడుగుతాడు. కార్తీక్ తో దీపే అబద్ధం చెప్పించినట్లు ఉందని పారిజాతం అంటుంది.

నిజం చెప్పేసిన దశరథ

అందరు కార్తీక్ ను గుచ్చి గుచ్చి అడిగే సరికి నేను చెప్తానని దశరథ అంటాడు. వీళ్లు నిజమే చెప్పారు. నేను అందరికీ ఈ రోజు నిజం చెప్పే తీరుతాను. దీప కడుపులో బిడ్డకు ప్రమాదం ఉందనేది నిజమే. దీప కడుపులో బిడ్డకు ప్రమాదం నా భార్య వల్ల అని దశరథ చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. వదిన కారణమేంటీ అని కాంచన అడుగుతుంది. మీ వదిన ప్రాణాలతో ఉండాలంటే దీప బిడ్డను త్యాగం చేయాలమ్మా. అదే విధి రాత అని దశరథ అంటాడు.

సుమిత్ర కన్న కూతురు

దీప ఎవరో కాదు సుమిత్ర కన్న కూతురు అని అసలు నిజాన్ని దశరథ చెప్పేస్తాడు. నాకు, సుమిత్రకు పుట్టిన ఒక్కగానొక్క కూతురు ఈ దీపే నాన్న అని దశరథ అంటాడు. మరి జ్యోత్స్న ఎవరు అని శివ నారాయణ అడిగితే, దాసు కూతురని దశరథ చెప్తాడు. పుట్టగానే హాస్పిటల్లో బిడ్డలను పారిజాతం పిన్ని మార్చేసింది. మన ఇంటి వారసురాలిని అనాథను చేసింది. తన మనవరాలిని ఈ ఇంటి వారసురాలిని చేసింది. ఇదంతా నీ మీద పగతో చేసింది నాన్న అని దశరథ కుంబ బద్ధలు కొడతాడు.

గన్ తో జ్యోత్స్న

ఇప్పుడు నా భార్య సుమిత్రను కాపాడేది నా కన్న కూతురు దీపే. తను డోనర్ గా ఉంటే కడుపులో బిడ్డను బతికించడం కష్టమన్నారు. అయినా సరే కన్న తల్లి కోసం బిడ్డను వదులుకునేందుకు సిద్ధమైంది. దీపే ఈ ఇంటి వారసురాలు. జ్యోత్స్న దాసు కూతురు. ఈ రోజు నుంచి దీప ఈ ఇంటి వారసురాలిగా ఉంటుంది. జ్యోత్స్న తన తండ్రి దగ్గరకు వెళ్లిపోతుందని దశరథ అంటాడు. నీ మనసులో మాట బయటకు చెప్పించాలని ఇలా చేశా డాడీ. ఈ ఇంటికి ఒక్కరే వారసురాలు ఉండాలని దీపను గన్ తో జ్యోత్స్న షూట్ చేస్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks