...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: శౌర్య కిడ్నాప్-జ్యోత్స్నకు కార్తీక్ మాస్ వార్నింగ్-సుమిత్ర ఆపరేషన్ వేళ ఊహించని ట్విస్ట్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 18 ఎపిసోడ్ లో అసలు గుట్టు ఎక్కడ తెలుస్తుందోనని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. దీప, కార్తీక్ ను హాస్పిటల్ నుంచి బయటకు రప్పించేందుకు శౌర్యను కిడ్నాప్ చేయిస్తుంది. ఈ విషయం తెలిసి కార్తీక్, దీప కంగారు పడతారు. మరోవైపు దశరథ హోమం చేస్తాడు.

Published on: Mar 18, 2026, 07:16:46 IST
Advertisement

కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 18 ఎపిసోడ్ లో.. చేస్తున్న పాపాలు ఇక్కడితో ఆపేయమని జ్యోత్స్నను దాసు అడుగుతాడు. నువ్వు ఊహించిన దానికంటే నా చేతలు భయంకరంగా ఉంటాయి. నువ్వు ఏం చేయలేవ్? నేను దశరథ కూతురిని అని చెప్పి జ్యోత్స్న వెళ్లిపోతుంది.

జ్యోత్స్న టెన్షన్

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

మరోవైపు ఇంట్లో.. సుమిత్ర కూతురివి నువ్వే కాబట్టి నువ్వే కాపాడాలి. నీకు సపోర్ట్ చేస్తున్నానని, నువ్వు చెప్పేవన్ని ఎలా నమ్మను? అని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. లోపల ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? అని జ్యోత్స్న అంటుంది. ఎందుకమ్మా అంత టెన్షన్? అంటూ దశరథ వస్తాడు. ఈ రోజుతో అంతా అయిపోతుంది కదా. ఏ సమస్య గురించి ఇన్ని రోజులు బాధపడ్డావో ఆ సమస్య ఈ రోజుతో తీరిపోతుందమ్మా అని దశరథ అంటాడు.

సుమిత్ర ఎమోషనల్

మనమంతా కోరుకునేది మమ్మీ గురించే కదా. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. మమ్మీ క్షేమంగానే తిరిగొస్తుంది డాడీ అని జ్యోత్స్న అంటుంది. మళ్లీ మీ అందరిని నేను చూస్తానో లేదో? నా కూతురు నన్ను కాపాడుతుంది. భగవంతుడు ఇచ్చిన ఆయుష్షు ఎన్నాళ్లుందో మనకు తెలియదు కదా. రుణానుబంధం తీరిపోయాక ఊపిరి వదిలేయాల్సిందేనని సుమిత్ర అంటుంది.

పారు సాయం

నీ కూతురితో ఉన్న రుణానుబంధం తీరిపోయేది కాదు. ఈ ఆపరేషన్ తర్వాతే నీకు నీ కూతురితో అసలైన బంధం ఏర్పడుతుంది. ఆ బంధం కలకాలం నీ కళ్ల ముందే ఉంటుందని సుమిత్రతో దశరథ అంటాడు. సుమిత్రను తీసుకొని హాస్పిటల్ కు బయల్దేరుతారు. కానీ పారును ఆపిన జ్యోత్స్న.. నాకో సాయం చేయాలని అడుగుతుంది. నువ్వు అమ్మను తీసుకొని హాస్పిటల్ కు వెళ్లు అని జ్యోత్స్నతో దశరథ చెప్తాడు. నాకు చిన్న పని ఉంది. అది చూసుకుని వస్తానని హోమం గురించి దశరథ ఆలోచిస్తాడు.

డాక్టర్ కంగారు

కార్తీక్ కు శ్రీధర్ కాల్ చేసిన శౌర్య కనిపించడం లేదని చెప్తాడు. శౌర్య స్కూల్ బస్ ఎక్కలేదు. స్కూల్ బ్యాగ్ గేటు పక్కన పడేసి ఉంది. శౌర్యను ఎవరో ఎత్తుకెళ్లారని శ్రీధర్ ఆందోళనగా చెప్తాడు. జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఇదేనా? నా కూతురు నాకు కావాలి మాస్టారు అని కార్తీక్ చెప్తాడు. ఎందుకు బావ ఇంత టెన్షన్ పడుతున్నావని దీప అడుగుతుంది. శౌర్యను బలవంతంగా స్కూలుకు పంపించారంటా. వెళ్లి శౌర్యతో మాట్లాడి వస్తానని దీపకు అబద్ధం చెప్పి కార్తీక్ బయటకు వెళ్తాడు.

కార్తీక్ వార్నింగ్

శౌర్య కనిపించకుండా పోవడానికి జ్యోత్స్న కారణమని కార్తీక్ అనుకుంటాడు. హడావుడిగా వెళ్తున్న కార్తీక్ కు సుమిత్ర వాళ్లు ఎదురుపడతారు. బావకు శౌర్య మిస్సింగ్ గురించి తెలిసినట్లుందని జ్యోత్స్న అనుకుంటుంది. బావ టెన్షన్ లో ఉన్నాడని జ్యోత్స్న అంటుంది. ఈ టెన్షన్ ఎందుకు పడుతున్నానో కూడా తెలిసే ఉంటుంది కదా అని కార్తీక్ అంటాడు.

తప్పులు చేసింది ఎవరైనా సరే వెంటనే సరిచేసుకోవాలి. లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. మీరు తప్పులు చేయరు పారు. కానీ కొంతమంది తప్పులు చేస్తున్నామనుకుని పాపాలు చేస్తారు. నేను బరిలోకి దిగితే వాళ్ల పాపాలకు పాడె కట్టినట్లేనని జ్యోత్స్నకు పరోక్షంగా కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. అత్త నీకు ఏ భయం లేదు, ఏం జరిగిన సరే నీ కూతురే నిన్ను కాపాడుతుందని సుమిత్రకు చెప్పి కార్తీక్ బయటకు వెళ్తాడు.

దశరథ హోమం

మరోవైపు గుడిలో దశరథతో పండితులు హోమం చేయించేందుకు ఏర్పాట్లు చేస్తారు. సుమిత్ర బతకాలంటే దీప బోన్ మ్యారో ఇవ్వాలి. దీపకు ఆపరేషన్ చేస్తే బిడ్డ ప్రాణాలు వదులుకోవాలని అంటున్నారు. ఎవరికీ ఏం కాకూడదు. నేను కోరుకున్న శుభవార్త వినాలనుకుని దశరథ హోమం మొదలుపెడతాడు.

దీప బయటకు వెళ్లేలా

ఇటు హాస్పిటల్లో ఉన్న దీప దగ్గరకు పారిజాతం వస్తుంది. కార్తీక్ నీతో నిజం చెప్పలేదు. శౌర్య కనిపించడం లేదటా. పిల్లలను ఎత్తుకుపోయే ముఠా తిరుగుతుందని న్యూస్ లో చూశా. వాళ్లే పిల్లలను ఎత్తుకుపోయి ఉంటారని పారిజాతం చెప్పడంతో దీప కంగారు పడుతుంది. వెళ్లి నీ బిడ్డను వెతుక్కో దీప అని పారిజాతం అనడంతో దీప బయటకు వస్తుంది. అప్పుడే డాక్టర్ వచ్చి ఈ సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్లకూడదని దీపతో చెప్తుంది.

సుమిత్రను ఆపరేషన్ కు రెడీ చేయడానికి, దీప ఇక్కడ ఉండటానికి సంబంధం ఏంటి డాక్టర్ అని పారిజాతం అడగడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks