...
...
Next Story

Karthika Deepam 2 Today Episode:పారిజాతానికి దాసు మైండ్ బ్లోయింగ్ షాక్-ఆపరేషన్ కంప్లీట్- థియేటర్లో దీపను చూసిన జ్యోత్స్న

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 20 ఎపిసోడ్ లో కీలకమైన మలుపు చోటు చేసుకుంటుంది. పారిజాతాన్ని బయటకు రప్పించడం కోసం దాసు అబద్దం చెప్తాడు. సుమిత్రకు ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఆపరేషన్ థియేటర్లో దీపను జ్యోత్స్న చూస్తుంది.

Published on: Mar 20, 2026, 06:56:54 IST
Advertisement

కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 20 ఎపిసోడ్ లో.. నేను అన్ని ప్లాన్ చేశానని టెన్షన్ పడుతున్నడాక్టర్ కు కార్తీక్ చెప్తాడు. అప్పుడే పారిజాతానికి దాసు ఫోన్ చేస్తాడు. నువ్వు దూరం చేసిన నీ మనవరాలు దొరికిందమ్మా అని పారుకు దాసు అబద్దం చెప్తాడు. హాస్పిటల్ బయటే ఉన్నా అమ్మ అని దాసు చెప్పగానే, పారు వెళ్లిపోతుంది.

మనవరాలు దొరికిందని

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

పారు బయటకు వెళ్లిపోవడంతో ఆపరేషన్ కోసం దీపను డాక్టర్ హారిక తీసుకెళ్తుంది. శౌర్య ఇచ్చిన బొమ్మను చూస్తూ దీప ఫీల్ అవుతుంది. ఇది వీడ్కోలు కాదు దీప, అత్తకు ఆహ్వానం అని దీపను పంపిస్తాడు కార్తీక్. మరోవైపు పారిజాతం పరిగెడుతూ శివ నారాయణను ఢీ కొడుతుంది. ఎందుకు ఇంత ఆనందం? అని శివ నారాయణ అడిగితే, నా మనవరాలు దొరికిందని పారు చెప్తుంది.

మాట మార్చిన పారు

అయ్యో, నోరు జారిందే అని పారు మళ్లీ కవర్ చేస్తుంది. మనవరాలు దొరికింది అన్నావ్ కదా అదేంటో చెప్పు అని శివ నారాయణ గట్టిగానే అడుగుతాడు. జ్యోత్స్న ఆపరేషన్ కు కంగారు పడుతుంది కదా. మీ అమ్మ రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అని చెప్పా. అదే అనుకుంటూ వచ్చా. నా మనవరాలికి అవకాశం దొరికింది అని చెప్పాలనుకున్నానని పారు మాట మారుస్తుంది.

దీపను చూసిన జ్యోత్స్న

మరోవైపు మత్తులో నుంచి బయటకు వచ్చిన జ్యోత్స్న ఏమో దీప అని కలువరిస్తుంది. జ్యోత్స్న నన్ను చూసిందని దీప అంటుంది. అసలు ఛాన్స్ లేదు, ఒకవేళ చూసినా గుర్తు పట్టదని డాక్టర్ చెప్తుంది. దీపను బెడ్ పై పడుకోబెడతారు. ఇక దాసు అంటూ ఫుల్ స్పీడ్ లో కొడుకు దగ్గరకు పారు వస్తుంది. ఎక్కడ్రా నా మనవరాలు అని పారు అడుగుతుంది. ఎవరో తెలిసిందని చెప్పా కానీ తీసుకొచ్చానని అన్నానా అని దాసు అంటాడు.

పారుకు మత్తు ట్యాబ్లెట్

అటు ఆపరేషన్ థియేటర్లో సుమిత్రకు ఆపరేషన్ జరుగుతుంది. ఇటు గుడిలో దశరథ హోమం పూర్తి చేస్తాడు. అక్కడ ఆపరేషన్ పూర్తి అవుతుంది. పడుకున్న దీప కడుపుపై చేయి వేసి కార్తీక్ ఫీల్ అవుతాడు. కన్నీళ్లను కంట్రోల్ చేసుకుని బయటకు వెళ్లిపోతాడు. జ్యోత్స్న మత్తులో నుంచి బయటకు వస్తుంది. మా మమ్మీ ఎక్కడా? దీప ఎక్కడా? నేను దీపను ఆపరేషన్ థియేటర్లో చూసినట్లే అనిపించిందని డాక్టర్ ను జ్యోత్స్న అడుగుతుంది.

జ్యోత్న్స బోన్ మ్యారో

ఏం మాట్లాడుతున్నావ్? ఈ రోజే దీపకు చిన్న ఆపరేషన్ జరిగింది. అది కూడా వేరే ఆపరేషన్ థియేటర్లో అని డాక్టర్ చెప్తుంది. జ్యోత్స్న లేచేందుకు ప్రయత్నిస్తుంది. మీకు ఇప్పుడే కదా ఆపరేషన్ జరిగింది. మీ బోన్ మ్యారో తీశామని డాక్టర్ చెప్తుంది. మరోవైపు పారిజాతం మత్తులో నుంచి బయటకు వస్తుంది. నువ్వు కళ్లు తిరిగి పడిపోతే బెడ్ మీద వేశామని శివ నారాయణ అంటాడు.

దాసు ఫోన్ చేశాడని, తాగడానికి వాటర్ ఇచ్చాడని పారు చెప్తుంది. నేను ఎందుకు ఫోన్ చేశాను? నేను వాటర్ ఇవ్వడం ఏంటీ? అని దాసు ట్విస్ట్ ఇస్తాడు. నీకేదో మతి భ్రమించిందని శివ నారాయణ అంటాడు. పారును కార్తీక్ మరింత కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆపరేషన్ ఎప్పుడో అయిపోయిందని కార్తీక్ చెప్తాడు.

కార్తీక్ కౌంటర్

దీప ఎక్కడుంది? అని పారిజాతం లేచి వెళ్తుంది. దీప దగ్గరకు వెళ్లి పిలుస్తుంది. దీప నెమ్మదిగా కళ్లు తెరుస్తుంది. నువ్వు ఇక్కడే ఉన్నావా? అని పారు అడుగుతుంది. నీ కళ్లు కాకులు ఎత్తుకెళ్లాయా పారు? దీప ఇక్కడే ఉంది కదా. లేకపోతే నీకు లేజర్ లో చూపిస్తున్నారా? అని కార్తీక్ కౌంటర్ వేస్తాడు. దీపకు ఆపరేషన్ అయింది కదా. ఇది కలో నిజమో చెప్పు అని పారును కార్తీక్ మళ్లీ కన్ఫ్యూజ్ చేస్తాడు.

నన్ను గిచ్చు అని కార్తీక్ ను పారిజాతం అడుగుతుంది. కార్తీక్ గట్టిగా గిల్లుతాడు. ఈ మనిషి ఇక్కడ ఉందో లేదో అని కన్ఫామ్ చేసుకుంటున్నానని పారిజాతం మళ్లీ నోరు జారుతుంది. చేసిన తప్పులు, పాపాలు ఎక్కడ బయటపడతాయోనని కొందరు గజగజ వణుకుతున్నారు. వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే.. వెంటనే లగేజీ సర్దేయండని కార్తీక్ చెప్తాడు. పారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks