కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో.. మన ఇద్దరి జీవితాల్లో ఒక తుపాను ఇంటి గుమ్మం దాకా వచ్చి వెళ్లిపోయింది వదిన అని సుమిత్రతో కాంచన మాట్లాడుతుంది. పక్కనే శ్రీధర్ కూడా ఉంటాడు. నేను ఒకటి బలంగా నమ్ముతున్నా అన్నయ్య. ఇక్కడ ఇద్దరు తల్లులకు బలమైన కోరికలున్నాయి. తీరే అవకాశాలు తక్కువైనా తీరాయి. నేను బతికేశానని శ్రీధర్ తో సుమిత్ర అంటుంది.
జ్యోత్స్నకు పెళ్లి

నా కూతురు పెళ్లి చూడాలని నేను. కొడుకు బిడ్డను చూడాలని వదిన. నా కోరిక తీరకుండానే పోతానేమో అనుకున్నా. కానీ మన కోరికలు ఎంత బలమైనవో చూశావా వదిన అని కాంచనతో సుమిత్ర అంటుంది. మరోవైపు జ్యోత్స్నకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని దశరథకు దీప చెప్తుంది. అక్కడ నీ కూతురు రాత్రుళ్లు నిద్ర పోవడం లేదని దీప గురించి దశరథకు కార్తీక్ చెప్తాడు.
పెంచిన ప్రేమ
జ్యోత్స్న ఎవరిని ఏం చేయకూడదంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపాలి మామయ్య అని కార్తీక్ అంటాడు. కన్న ప్రేమ గొప్పదా? పెంచిన ప్రేమ గొప్పదా? అని కార్తీక్ ను దశరథ అడుగుతాడు. కన్నప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పది. మనల్ని పెంచినవాళ్లు మన రక్తం కాదు. అయినా కూడా వాళ్ల మీద అంతకంటే ఎక్కువ ప్రేమ పెంచుకుంటాం. నా కూతురు శౌర్య అంటే నాకు ప్రాణమని కార్తీక్ చెప్తాడు.
దాసును చంపాలని
నా కన్నకూతురు అనుకున్న జ్యోత్స్న కన్నకూతురు కాదని ఇప్పుడు తెలిసింది. జ్యోత్స్న మంచి కూతురు కాకపోవచ్చు కానీ నేను మాత్రం మంచి తండ్రినే. దాసును చంపాలనుకుందని తెలిసిన తర్వాత కూడా జ్యోత్స్నపై ప్రేమ అలాగే ఉందని దశరథ అంటాడు. తను ఇంటి వారసురాలు కాదని తెలిస్తే ఎక్కడ తన స్థానం పోతుందేమోనని జ్యోత్స్న ఇలా మారిపోయిందని కార్తీక్ చెప్తాడు.
సుమిత్రకు నిజం
{{/usCountry}}నా కన్నకూతురు అనుకున్న జ్యోత్స్న కన్నకూతురు కాదని ఇప్పుడు తెలిసింది. జ్యోత్స్న మంచి కూతురు కాకపోవచ్చు కానీ నేను మాత్రం మంచి తండ్రినే. దాసును చంపాలనుకుందని తెలిసిన తర్వాత కూడా జ్యోత్స్నపై ప్రేమ అలాగే ఉందని దశరథ అంటాడు. తను ఇంటి వారసురాలు కాదని తెలిస్తే ఎక్కడ తన స్థానం పోతుందేమోనని జ్యోత్స్న ఇలా మారిపోయిందని కార్తీక్ చెప్తాడు.
సుమిత్రకు నిజం
{{/usCountry}}జ్యోత్స్న కూతురు కాదన్న విషయం ఎప్పటికైనా సుమిత్రకు తెలియాల్సిందే కదా. ముందే ఆమెను మానసికంగా రెడీ చేద్దామని కార్తీక్ తో దశరథ అంటాడు. మెంటల్లీ, ఫిజికల్లీ మీ అత్త పూర్తి ఆరోగ్యంతో ఉందని డాక్టర్ చెప్పిందని సుమిత్రకు కార్తీక్ చెప్తాడు. బిడ్డ క్షేమంగా ఉందన్న శుభవార్త వదిన చెప్పింది. నువ్వు, కార్తీక్ పిల్లాపాపలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దీపతో సుమిత్ర అంటుంది.
దశరథ నిర్ణయం
జ్యోత్స్న పెళ్లి జరిగి, పిల్లాపాపలతో నట్టింట్లో తిరిగితే ఎంతో సంతోషంగా ఉంటుంది. అన్నింటికంటే ముందు జ్యోత్స్న ఒప్పుకోవాలి కదా. ఇప్పట్లో పెళ్లి చేసుకోనని మాతో చెప్పింది. నీకు త్వరలో బిడ్డ పుడుతుంది. మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది. కానీ మా ఇంటికి అదృష్టం లేదని సుమిత్ర ఫీల్ అవుతుంది.
జ్యోత్స్న పెళ్లి జరిగేంతవరకూ మీరు కోరుకున్నట్లు నేను ఉండలేనని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నా. నువ్వు సపోర్ట్ గా నిలబడాలని దశరథ బయటకు వెళ్తాడు. కొన్ని సార్లు కఠినమైన నిర్ణయం తీసుకోవాలని కార్తీక్ కు దశరథ చెప్తాడు.
వీలునామాతో షాక్
శివ నారాయణ ఇంటికి లాయర్ వస్తాడు. నేనే పిలిచానని దశరథ చెప్తాడు. వీలునామా మార్చి రాయించానని దశరథ షాక్ ఇస్తాడు. లాయర్ వీలునామా చదువుతాడు. ఈ వీలునామా ప్రకారం దశరథకు తండ్రి నుంచి సంక్రమించిన యావదాస్తి తన రక్తం పంచుకుని పుట్టిన కూతురు వారసుల పేరున రాశారు. దీనికి 15 నెలల గడువు ఉందని లాయర్ చెప్పడంతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు.
మేనల్లుడి కుటుంబానికి
15 నెలల లోపు కూతురికి పెళ్లి కాకపోయినా, పెళ్లి అయి పిల్లలు పుట్టకపోయినా ఈ ఆస్తి మొత్తం తన మేనల్లుడి కుటుంబానికి చెందుతుందని లాయర్ చెప్తాడు. ఆస్తి శివ నారాయణది. అంటే నీ తండ్రిది. కూతురి మీద కోపంతో ఆస్తి మొత్తం నీ పేరు మీద రాశారు. ప్రేమతో కూతురికి రాయాలి. కానీ కూతురి పిల్లల పేరు మీద రాయడం ఏంటీ? అని పారిజాతం ప్రశ్నిస్తుంది.
ఇది మోసం
ఓ కూతురికి కన్నతండ్రి చేస్తున్న మోసం ఇది అని జ్యోత్స్న అంటుంది. శివ నారాయణ కూడా అదే మాట అంటాడు. ఆస్తి నువ్వు అనుభవించడానికి అధికారం ఇచ్చా కానీ ఇదేంటీ అని శివ నారాయణ ప్రశ్నిస్తాడు. నువ్వు నా కూతురివి కాదా అని జ్యోత్స్నను దశరథ అడుగుతాడు. నీ కూతురినే అని జ్యోత్స్న బదులిస్తుంది.
కాంచనపై నిందలు
నేనైతో బాగా అర్థం చేసుకున్నా డాడీ. ఏం బావ ఇప్పుడు నీకు హ్యాపీనా? అంతా నువ్వు అనుకున్నట్లే జరిగిందా? 15 నెలల లోపు పిల్లలు పుట్టకపోతే ఆస్తి మొత్తం నీకే దక్కుతుంది కదా అని జ్యోత్స్న అంటుంది. మామయ్య వీలునామా మారుస్తాడని నాకు తెలియదని కార్తీక్ అంటాడు. మీరు వచ్చింది ఆస్తి ఎగరేసుకుపోవడానికి అని కాంచనపై జ్యోత్స్న సీరియస్ అవుతుంది.
దీపకు బిడ్డ పుడితే శౌర్య అడ్డంగా ఉంటుందని అనాథ ఆశ్రమంలో చేర్పించమన్నావ్ కదా మర్చిపోయాననుకున్నావా అని పారిజాతంపై కాంచన ఫైర్ అవుతుంది. ఇప్పుడే వీలునామాను మార్చి రాయాలని జ్యోత్స్న అంటుంది. నువ్వు నా కూతురివి కాదని చెప్పు ఇప్పుడే వీలునామా మారుస్తానని దశరథ అనడంతో జ్యో కంగారు పడుతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.