...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: మారని జ్యోత్స్న.. దీపను చంపేందుకు ప్లాన్.. గెట్ టుగెద‌ర్ పార్టీ.. దీప‌పై పారిజాతం ప్రేమ

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 31 ఎపిసోడ్ లో దీప, శౌర్యపై పారిజాతం ఎనలేని ప్రేమ చూపిస్తుంది. దీపనే తన మనవరాలు అనుకుంటూ మురిసిపోతుంది. మరోవైపు దీపను చంపాలని జ్యో ప్లాన్ చేస్తుంది. గెట్ టుగెదర్ పార్టీ ఇస్తానని చెప్తుంది.

Published on: Mar 31, 2026, 07:03:53 IST
Advertisement

కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 31 ఎపిసోడ్ లో.. దీపను ప్రేమగా మనవరాలా అంటూ పారిజాతం మురిసిపోతుంది. కార్తీక్ ప్లాన్ ప్రకారమే దీపనే సొంత మనవరాలు అని పారిజాతానికి దాసు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఈ విషయాన్ని కార్తీక్ కు చెప్పకుండా పారు కవర్ చేస్తుంది. దీప నీకు మనవరాలు లాంటిది, ఎందుకు ఆడిపోసుకుంటావని నా అంతరాత్మ నన్ను తిట్టిందని పారు అంటుంది.

పారు ప్రేమ

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

నా బంగారు తల్లి దీప కోసం వచ్చానని పారిజాతం ఎనలేని ప్రేమ కురిపిస్తుంది. శౌర్యను మరింత గట్టిగా హత్తుకుంటుంది. శౌర్య వదలమని గింజుకుంటుంది. ఇన్నాళ్లు నిజం తెలియక మిమ్మల్ని ఎంత దూరం పెట్టానని పారు అంటుంది. నేను బాగానే ఉన్నా. నువ్వు నా కూతురివి కాంచన. కార్తీక్ నా మనవడు. దీప నా మనవరాలు. శౌర్య నా ముని మనవరాలు అని పారు వరసలన్నీ చెప్పేస్తుంది.

కొత్త పారిజాతం

ఫొటోలోని కుబేర వంక చూస్తూ అతని గురించి మాటల్లో వర్ణించలేనని పారిజాతం ఫీల్ అవుతుంది. ఇడ్లీ లాంటి తెల్లని కుబేర మనసు చూశా. పొరపాటున బస్టాండ్ పాలైన నా మనవరాలు అని అనబోయి పారిజాతం ఆగిపోతుంది. ఎవరో బిడ్డను కుబేర పెంచాడని అంటుంది. అతనికి చిన్నగుడి కడతా. నాలో కొత్త పారిజాతం ఉదయించిందని పారు తెగ ఫీల్ అయిపోతుంది.

దీపకు నిజం

వెంటనే ఇంటికి వెళ్లు, లేదంటే పెద్ద సారుకు ఫోన్ చేస్తానని కార్తీక్ అనడంతో దీపకు జాగ్రత్తలు చెప్పి పారిజాతం వెళ్లిపోతుంది. ఒరేయ్ పిన్నికి ఏమైందిరా, అంత హుషారుగా ఉందేంటీ? అని కార్తీక్ ను కాంచన అడుగుతుంది. పారు నిన్ను, నన్ను ఉదయం తిట్టింది కదా, అందుకే నువ్వే దాసు మామయ్య కూతురు అని మామయ్యతో అబద్ధం చెప్పించానని దీపకు కార్తీక్ అసలు విషయం చెప్తాడు.

జ్యోత్స్న పార్టీ

మన రెండు ఫ్యామిలీలు, కొంతమంది క్లోజ్ రిలేటివ్స్ ను పిలిస్తే చాలు. మమ్మీ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిన సందర్భంగా అందరికీ పార్టీ ఇవ్వాలని అనుకుంటున్నా. దీంతో చిన్న చిన్న సమస్యలు తొలిగిపోతాయని జ్యోత్స్న అంటుంది. పెళ్లి గురించి కూడా రేపే చెప్తానంటుంది. మమ్మీ నీకో సర్ ప్రైజ్ ఉందని కూడా జ్యో అంటుంది. నీ కూతురు (దీప) చావే అని మనసులో జ్యో అనుకుంటుంది.

కార్తీక్ ఫిటింగ్

అప్పుడే గాల్లో గెంతులు వేసుకుంటూ పారిజాతం వస్తుంది. ఇప్పటివరకూ ఎక్కడికి వెళ్లావని శివ నారాయణ అడిగాడు. వాకింగ్ కు వెళ్లానని పారు ఏదో ఒకటి చెప్పేస్తుంది. దీప, శౌర్యను పారు హత్తుకున్న వీడియోను శివ నారాయణ చూపించి షాక్ ఇస్తాడు. ఈ వీడియో ఎవరు పంపించారో తెలుసు కదా అని శివ నారాయణ అనగానే కార్తీక్ వెనకాలే వస్తాడు. నీకా ఇంటికి వెళ్లాల్సిన పనేంటి గ్రానీ అని జ్యోత్స్న అడుగుతుంది.

వెళ్లే హక్కు ఉందని

ఊరికే, చూడాలనిపించి వెళ్లానని పారు చెప్తుంది. మరి ఈ వీడియోలో నువ్వు దీప, శౌర్యను పట్టుకుని తెగ ఫీలైపోయావని శివ నారాయణ అడుగుతాడు. జ్యోత్స్న అందరినీ అవమానించింది. కాంచనను మాటలు అన్నది. వాళ్లను ఓదార్చడానికి వెళ్లానని పారు చెప్తుంది. నిజం చెప్పమని శివ నారాయణ అడుగుతాడు. వెళ్లే హక్కు ఉంది కాబట్టి వెళ్లానని చెప్పి పారు లోపలికి వెళ్లిపోతుంది.

ఏదో ప్లాన్ చేసిందని

రేపు మా ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉంది. మీరంతా సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తున్నా. పార్టీకి అందరూ రావాలి. ముఖ్యంగా దీప రావాలి. దీప రాకపోతే పార్టీ ఆగిపోతుంది బావ. దీప కచ్చితంగా రావాలని కార్తీక్ కు జ్యోత్స్న చెప్తుంది. మరదలు ఏదో ప్లాన్ చేసిందని కార్తీక్ అనుకుంటాడు.

ఎన్నిసార్లయినా వెళ్తా

లోపలికి వెళ్లిన తర్వాత పారిజాతంపై జ్యోత్స్న ఫైర్ అవుతుంది. నా మనవరాలు అని జ్యోత్స్నకు విషయం చెప్పకుండా పారిజాతం ఆగిపోతుంది. దీప దగ్గరకు ఎందుకు వెళ్లానంటే, అది నా ఇష్టం. అసలు పారిజాతం అంటే ఏమనుకుంటున్నారు? అన్నీ మారాయి. ఇక నేను ఏడవాల్సిన అవసరం లేదు. నా ఆశలు ఫలించాయి. నా పొలంలో మొలకలు వచ్చాయి. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని పారు తెగేసి చెప్తుంది.

ఎన్ని సార్లయినా దీప దగ్గరకు వెళ్తా. నాకు కావాల్సిన వాళ్ల దగ్గరకు వెళ్తాను అని పారు గట్టిగా చెప్తుంది. అసలు గ్రానీకి ఏమైందని జ్యోత్స్న ఆలోచిస్తుంది. దీప మాత్రం పార్టీకి రావాలని జ్యోత్స్న అనుకుంటుంది.

మరోవైపు మళ్లీ ఏ గొడవ చేయడానికి పిలుస్తున్నారో అని కార్తీక్ తో పార్టీ గురించి కాంచన అంటుంది. పార్టీ జ్యోత్స్న ఇస్తుంది. అది రాకాసిలాగా మారిందని కాంచన అంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks