Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో సీఈఓ పోస్టును తిరిగి దక్కించుకోవడం కోసం జ్యోత్స్న పావులు కదుపుతుంది. అయితే జ్యోను సీఈఓ కాదు కదా కనీసం ఆఫీస్ క్లర్క్ కూడా కానివ్వనని కార్తీక్ ఛాలెంజ్ చేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 7 ఎపిసోడ్ లో చూసేయండి.
సూరజ్ ను దెబ్బకొట్టాలని

క్యాబ్ బుకింగ్ క్యాన్సిల్ అవడంతో చిరాకుతో రోడ్డు మీద వెయిట్ చేస్తుంటాడు సూరజ్. అప్పుడే జ్యోత్స్న కార్లో అటు వైపు వెళ్తూ, సూరజ్ ను చూసి ఆగుతుంది. షాప్ లో నాతో ఊరికే గొడవ పెట్టుకున్నాడు, వీడి ఈగో మీద చావు దెబ్బ కొట్టాలని జ్యో అనుకుంటుంది. సూరజ్ దగ్గరకు వెళ్తుంది. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారని జ్యో అడుగుతుంది. అర్జెంట్ గా ఇంటికి వెళ్లాలని సూరజ్ చెప్తాడు.
క్యాబ్ అనుకొని
సూరజ్ ను డ్రాప్ చేస్తానని జ్యో చెప్తుంది. కానీ సూరజ్ ఒప్పుకోడు. నాకెందుకు హెల్ప్ చేయాలని అడుగుతాడు. తెలిసిన మనిషి అని అనుకోవచ్చని జ్యో అంటే, అలా అనుకోనని సూరజ్ అంటాడు. క్యాబ్ అనుకొని డబ్బులు తీసుకుంటా అంటేనే వస్తానని సూరజ్ కారు ఎక్కుతాడు.
ఇంటికి వెళ్లొద్దని
మరోవైపు కార్తీక్, దీపతో కాంచన, శ్రీధర్ మాట్లాడతారు. నెల రోజుల్లో పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న చెప్పింది. అంటే నీ అగ్రిమెంట్ కు నెల రోజులే మిగిలింది. ఆ తర్వాత నీకు విడుదలే కదా. మరి నీ భార్యకు విడుదల ఎప్పుడు? అని కార్తీక్ ను కాంచన అడుగుతుంది. రేపటి నుంచి నువ్వు ఆ ఇంటికి వెళ్లొద్దని దీపకు కాంచన చెప్తుంది. బావ షరతులు నాక్కూడా వర్తిస్తాయి. నేనూ వెళ్తానని దీప అంటుంది.
కడుపుతో ఉన్నా యుద్ధం
దీప ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముందని శ్రీధర్ కూడా అడుగుతాడు. కడుపుతో ఉన్నా యుద్ధం చేయొచ్చని కార్తీక్ గొప్పగా చెప్తాడు. ఈ యుద్ధం ఎవరి కోసమని కాంచన అడుగుతుంది. ఫ్యామిలీ కోసమని కార్తీక్ చెప్తాడు. ఇప్పుడు సీఈఓ సమస్య కూడా వచ్చిందని కాంచన అంటుంది. అది వాళ్ల సమస్య, జ్యోను సీఈఓ చేస్తారో లేదో వాళ్ల ఇష్టమని కాంచన వేరు చేసి మాట్లాడుతుంది.
ఒట్టు వేసిన దీప, కార్తీక్
{{/usCountry}}దీప ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముందని శ్రీధర్ కూడా అడుగుతాడు. కడుపుతో ఉన్నా యుద్ధం చేయొచ్చని కార్తీక్ గొప్పగా చెప్తాడు. ఈ యుద్ధం ఎవరి కోసమని కాంచన అడుగుతుంది. ఫ్యామిలీ కోసమని కార్తీక్ చెప్తాడు. ఇప్పుడు సీఈఓ సమస్య కూడా వచ్చిందని కాంచన అంటుంది. అది వాళ్ల సమస్య, జ్యోను సీఈఓ చేస్తారో లేదో వాళ్ల ఇష్టమని కాంచన వేరు చేసి మాట్లాడుతుంది.
ఒట్టు వేసిన దీప, కార్తీక్
{{/usCountry}}ఆ ఇంటికి, నీకు ఏంటి సంబంధం? ఎందుకు నువ్వు మాటలు పడాలి? అని దీప వైపు తన మాటల తూటాలను కాంచన ఎక్కుపెడుతుంది. ఏం దాచట్లేదని చెప్పాలంటే ఏం చేయాలని దీప అడుగుతుంది. నెల రోజుల్లో జ్యోత్స్న పెళ్లి అయినా, కాకపోయినా ఆ ఇంటికి వెళ్లమని కాంచనకు ఒట్టు వేయాలని శ్రీధర్ అనడంతో కార్తీక్, దీప షాక్ అవుతారు. తన మనసులోని మాట కూడా అదేనని కాంచన చేయి ముందుకు చాపుతుంది.
ఒట్టు వేసి దీప ట్విస్ట్ ఇస్తుంది. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. దీప చెప్పేసరికి కార్తీక్ కూడా ఒట్టు వేస్తాడు. ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని కాంచన చెప్తుంది. నా కొడుకు మాట తప్పడని శ్రీధర్ అంటాడు.
జ్యో ప్లాన్
సీన్ జ్యోత్స్న కార్లోకి మారుతుంది. అడక్కుండానే హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని సూరజ్ చెప్తాడు. సూరజ్, జ్యోత్స్న ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. వీడి ఈగో మామూలుగా లేదు, పొగరు దించుతానని కారును మరో దారిలోకి తిప్పుతుంది జ్యోత్స్న. ఈ రూట్లో మణికొండ ఎలా వెళ్తారని సూరజ్ అడుగుతాడు. సారీ అండీ, ఎల్బీ నగర్ అన్నట్లు వినపడితే డ్రాప్ చేస్తానన్నా అని జ్యో కారు ఆపుతుంది.
సూరజ్ దెబ్బ
మెయిన్ రోడ్డు వరకు సూరజ్ డ్రాప్ చేయమన్నా జ్యో నో చెప్తుంది. నడుచుకుంటూ వెళ్లిపొమ్మంటుంది. కొందరికి మాటల కంటే చేతలే మంచి గుణపాఠం నేర్పిస్తాయని సూరజ్ నడుచుకుంటూ వెళ్లిపోతాడు. జ్యో కారు స్టార్ట్ చేద్దామని చూస్తే కారు కీస్, ఫోన్ కనిపించవు. దీంతో సూరజ్ కోసం వెతుకుతుంది జ్యోత్స్న. కానీ కనిపించడు. సూరజ్ ఏం దెబ్బ కొట్టావ్ రా అని జ్యో అనుకుంటుంది.
జ్యో పెళ్లి
మరోవైపు అమ్మకు ఎందుకు మాటిచ్చావని దీపను కార్తీక్ అడుగుతాడు. అత్త కోసం ఆలోచించనా? కానీ జ్యో పెళ్లి ఎవరితో జరుగుతుందోనని దీప అంటుంది. జ్యోత్స్న చిన్న పిల్ల కాదు. నీతో మెడలో మూడు ముళ్లు వేయించుకుంటుంది బావ అని దీప డౌట్ పడ్తుంది. నేనేమైనా చిన్న పిల్లాడినా? ఈ తిక్కల దానికి ఓ తిక్కల వాడే జతగా దొరుకుతాడని కార్తీక్ చెప్తాడు.
ఆటలో జ్యోత్స్న
ఇటు సూరజ్ ను తిట్టుకుంటూ జ్యో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడే ఓ ఆటో వస్తుంది. అందులో సూరజ్ ఉంటాడు. డ్రైవర్ వీడిని దించేయ్, నన్ను డ్రాప్ చేస్తే రూ.10 వేలు ఇస్తానని జ్యో చెప్తుంది. కానీ సార్ నాకు తెలిసిన మనిషి కూడా అని ఆ పని చేయనని డ్రైవర్ అంటాడు. తప్పక జ్యోత్స్న ఆ ఆటో ఎక్కుతుంది.
మరోవైపు జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందోనని సుమిత్ర కంగారు పడుతుంది. శివ నారాయణ, దశరథ ఎంత చెప్పినా సుమిత్ర వినదు. కార్తీక్ కు దశరథ కాల్ చేసి జ్యోత్న్స అక్కడికి వచ్చిందా? అని అడుగుతాడు. రాలేదని కార్తీక్ చెప్తాడు. ఈ మతిలేని మనిషి మా అమ్మానాన్నలను ప్రశాంతంగా ఉండనివ్వదని దీప అంటుంది. ముందు జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవాలని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.