...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. జ్యోత్స్న రిజైన్ చేయాల్సిందే-ఆవేశంతో ఊగిపోయిన సూరజ్-నిజం చెప్పని జ్యో!

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 10 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇంపార్టెంట్ మీటింగ్ కు జ్యోత్స్న రాదు. ఆమె ఫైల్ ఎక్కడ పెట్టిందో తెలియక క్లయింట్ ముందు సూరజ్ జీరోలా నిలబడతాడు. దీంతో జ్యోత్స్నను రిజైన్ చేయాలని సూరజ్ ఆవేశంతో ఊగిపోతాడు.

Published on: Nov 10, 2026, 07:12:17 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. టిఫిన్ బండి దగ్గర శివ నారాయణ టిఫిన్ వడ్డిస్తుంటాడు. ఇటు పారిజాతం ఏమో సైలెంట్ గా గల్లా పెట్టెలో నుంచి డబ్బు కొట్టేస్తుంది. కార్తీక్ వచ్చి తన చేతిని పట్టుకోవడంతో పారిజాతం షాక్ అవుతుంది.

పారు దొంగతనం

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

శివ నారాయణ వచ్చి ఏం జరిగిందని అడిగితే.. పారు దొంగతనం చేస్తుంటే లైవ్ లో పట్టుకున్నానని కార్తీక్ చెప్తాడు. సాయంగా ఉంటావనుకుంటే చేతి వాటం చూపిస్తావా అని శివ నారాయణ ఫైర్ అవుతాడు. అందరూ నన్ను మోసం చేశారు. చివరకు నువ్వు కూడా మోసం చేస్తావా అని సీరియస్ అవుతాడు.

నమ్మిన వాళ్ల చేతిలో మోసపోవడం అలవాటు అయిందని కార్తీక్ ను ఉద్దేశించి శివ నారాయణ కౌంటర్ వేస్తాడు. బాగైందా అని పారు అంటుంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుందని కార్తీక్ చెప్పి వెళ్లిపోతాడు.

కనిపించని జ్యోత్స్న

ఇటు ఆఫీసులో క్లయింట్ తో సూరజ్ మాట్లాడుతుంటాడు. మేం అందరం టీమ్ గా కలిసి పని చేస్తామని సూరజ్ చెప్తాడు. కానీ అక్కడ జ్యోత్స్న కనిపించదు. డీల్ క్లోజ్ చేద్దామని సూరజ్ అడుగుతాడు. ముందు ప్రజెంటేషన్ ఇవ్వమని క్లయింట్ అడుగుతాడు. ఫైల్ లో పేపర్లు ఆర్డర్లో ఉండవు, బయట ఉన్న జ్యోత్స్నను పిలవమని సూరజ్ చెప్తే.. జ్యో అక్కడ ఉండదు.

డీల్ క్యాన్సిల్

మీరు పీఏ మీద ఎంత డిపెండ్ అయ్యారో మాకు అర్థమవుతుంది. ఇంత పెద్ద మీటింగ్ పీఏ లేకపోవడంతో ఆగిపోయిందంటే ఇది ఛైర్మన్ చేతగానితనమే. డీల్ క్యాన్సిల్ అని క్లయింట్ చెప్తాడు. ఫైల్ మా చేతిలో పెట్టి ప్రజెంటేషన్ ఇవ్వండని క్లయింట్ అడుగుతాడు. వన్ డే టైమ్ ఇవ్వండని సూరజ్ రిక్వెస్ట్ చేస్తాడు. దీంతో ఆ క్లయింట్ ఒప్పుకొంటాడు. మీకు పర్సనల్ కమిట్మెంట్స్ ఏమున్నాయో తెలియదు కానీ మీ పీఏ బిహేవియర్ బాలేదని చెప్పి ఆ క్లయింట్ వెళ్లిపోతాడు.

సూరజ్ కోపం

దొరికిందే ఛాన్స్ అని జ్యోత్స్నపైకి సూరజ్ ను మాలిని రెచ్చగొడుతుంది. జ్యోను క్షమించకూడదని అంటుంది. జ్యోత్స్నకు ఏదైనా చెప్పుకోలేని సమస్య ఉందేమోనని కార్తీక్ చెప్తాడు. కానీ కోపంతో సూరజ్ ఫైల్ విసిరేస్తాడు. జ్యోకు కాల్ చేస్తే తను లిఫ్ట్ చేయదు. జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందో ఎవరికైనా చెప్పిందా అని సూరజ్ అరుస్తాడు. కోపంతో ఫైల్స్ అన్నీ విసిరేస్తాడు.

ఎక్కడికి వెళ్లావ్ జ్యోత్స్న?

అప్పుడే మెల్లగా నడుచుకుంటూ జ్యోత్స్న వస్తుంది. ఎక్కడికి వెళ్లావ్? నీ మీద వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టంగా ఉంది. నువ్వు ఇలాంటి తెలివిలేని పని చేస్తావని ముందే అన్ని జాగ్రత్తలు చెప్పానని సూరజ్ అంటాడు. ఫైల్ మీ టేబుల్ మీద పెట్టానని జ్యోత్స్న చెప్తుంది. అది నాకు ఎలా తెలుస్తుంది? ఇది ఎంత పెద్ద డీలో నీకు తెలుసా? ఆ క్లయింట్ సంతకం పెట్టనన్నాడని సూరజ్ చిందులు తొక్కుతాడు.

అప్పుడే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన క్లయింట్ పద్ధతి గురించి జ్యో గుర్తు చేసుకుంటుంది. నీ లాంటి పీఏను పెట్టుకున్నందుకు జరగాల్సిందే జరిగింది. వాళ్ల ముందు జీరోలా నిలబెట్టావ్. ఆ బిజినెస్ హెడ్ నిన్ను ఏదో అడిగితే తలపొగురుగా సమాధానం చెప్పావంటా. ఎందుకు నీకంత పొగరు? వాళ్లు అడిగిన దానికి అందంగా సమాధానం చెప్పడం కూడా చేతకాదా? అని సూరజ్ అరుస్తూనే ఉంటాడు.

జ్యోత్స్న ఏడ్చావా?

మీటింగ్ కు రాకుండా ఎక్కడికి వెళ్లావో అడుగురా అని సూరజ్ ను మాలిని మరింత రెచ్చగొడుతుంది. ఎక్కడికి వెళ్లావ్ జ్యోత్స్న? ఏడ్చినట్లు కళ్లు ఎందుకు ఎర్రగా ఉన్నాయ్? అని సూరజ్ అడుగుతాడు. కానీ జ్యోత్స్న మాత్రం జరిగిన విషయం చెప్పదు. కావాలని ఆడుతున్న నాటకం ఇది అని మాలిని అంటుంది.

మాలినికి దీప కౌంటర్ వేస్తుంది. జ్యోత్స్నను దీప, కార్తీక్ కూడా అడుగుతారు. కానీ జ్యో సైలెంట్ గానే ఉంటుంది. ఇదంతా ప్లాన్ ప్రకారమే నడుస్తుంది. ఈ కంపెనీ ఇంకా శివ నారాయణదే అనే భ్రమలో ఉన్నారని మాలిని అంటుంది. జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందో, ఎందుకు వెళ్లిందోనని లిఖితపూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలి. లేదంటే పీఏ పోస్టుకు రిజైన్ చేయాలని లెటర్ ను దీప చేతిలో పెడతాడు సూరజ్.

పీఏ పోస్టుకు రిజైన్

ఇక్కడ ఉండలేక బయటకు వెళ్లా. నేను తప్పు చేశా. సారీ చెప్తున్నా కదా సార్ వదిలేయండని జ్యోత్స్న అడుగుతుంది. రీజన్ చెప్తావా? రిజైన్ చేస్తావా? అని సూరజ్ గట్టిగా అడుగుతాడు. రేపటి వరకే నీకు టైమ్. నువ్వు సంజాయిషీతో రిజైన్ చేసి వెళ్లడానికి రావాలని సూరజ్ అంటాడు. రేపటితో ఈ పీడ విరగడవుతుందని మాలిని అనుకుంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks