...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-బ్లడ్ కు 25 లక్షలు-చావుబతుకుల్లోనే సూరజ్-జ్యోను ఇరికించేలా మాలిని నాటకం!

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 24 ఎపిసోడ్ లో సూరజ్ కు బ్లడ్ ఇచ్చేందుకు డోనర్ రూ.25 లక్షలు డిమాండ్ చేస్తాడు. సూరజ్ కు ఆపరేషన్ జరిగినా 12 గంటల వరకూ ఏం చెప్పలేమని డాక్టర్ చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న మాలిని.. జ్యోత్స్నను ఇరికించేలా కొత్త నాటకం ఆడుతుంది.

Published on: Nov 24, 2026, 06:56:10 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. బుల్లెట్ తగిలి చావు బతుకుల్లో ఉన్న సూరజ్ కోసం బ్లడ్ ఇచ్చేందుకు ఒక వ్యక్తి హాస్పిటల్ కు వస్తాడు. కానీ తనది రేర్ బ్లడ్ గ్రూప్ అని, రేటు ఓకే అనుకుంటూనే బ్లడ్ ఇస్తానని ఆ వ్యక్తి షాక్ ఇస్తాడు. రూ.25 లక్షలు ఇస్తేనే బ్లడ్ ఇస్తానని ఆ పర్సన్ డిమాండ్ చేస్తాడు.

బ్లడ్ కోసం డబ్బు

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

గతంలో దీప ప్రాణాల కోసం హాస్పిటల్లో పోరాడుతున్న సమయంలో కార్తీక్ తో పేపర్లపై సంతకం పెట్టించుకున్న విషయాన్ని జ్యోత్స్న గుర్తు చేసుకుంటుంది. కార్తీక్, దీప ఎంత చెప్పినా కూడా ఆ వ్యక్తి బ్లడ్ ఇవ్వడానికి డబ్బు ఇవ్వాల్సిందేనంటాడు. అతని మాటలు జ్యోత్స్నకు ఇండైరెక్ట్ గా తగులుతాయి. డబ్బు ఇస్తేనే రక్తం ఇస్తాను, లేదంటే వెళ్లిపోతానని ఆ వ్యక్తి చెప్తాడు.

రూ.25 లక్షల చెక్

డబ్బు ఇస్తానని జ్యోత్స్న అంటుంది. మాలిని అత్త తన అకౌంట్లో వేసిన రూ.2 కోట్లు ఉన్నాయి కదా అని గుర్తు చేస్తుంది. వెంటనే రూ.25 లక్షల చెక్ రాసి ఇస్తుంది. అప్పుడు డోనర్ ను తీసుకొని లోపలికి వెళ్తారు. కర్మ సిద్ధాంతం ఎలా ఉందో చూశావా? నిన్ను చెడ్డదాన్ని చేయడానికి మాలిని పిన్ని ఇచ్చిన డబ్బులే ఇప్పుడు ఆమె కొడుకును కాపాడుతున్నాయి. ఇంకెం బాధపడకు అని జ్యోత్స్నతో కార్తీక్ చెప్తాడు.

కాసేపట్లోనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని డాక్టర్ వచ్చి చెప్తాడు. అసలు ఇలా ఎందుకు జరిగిందని కార్తీక్ ఆలోచిస్తాడు. అప్పుడే మాలిని బాడీగార్డు విజయ్ సీక్రెట్ గా హాస్పిటల్ లోకి వెళ్తాడు. మాలిని అత్త ఫోన్ స్విచ్ఛాప్, తాత కాల్ లిఫ్ట్ చేయడం లేదని దీప ఫీల్ అవుతుంది.

జ్యోత్స్నను షూట్ చేస్తారని తెలుసు

ఇటు హాస్పిటల్లో సూరజ్ ను చూసి విజయ్ కు మైండ్ బ్లాక్ అవుతుంది. అంటే రౌడీలు షూట్ చేసింది సూరజ్ నా? ఈ విషయం తెలిస్తే మాలిని తనను బతకనివ్వదని విజయ్ వెళ్లిపోతాడు. ఇక జ్యోత్స్న ఏమో ఏడుస్తూ కూర్చుంటుంది.

దీపకు అనుమానం

ఇది మాలిని అత్త పనేమోనని డౌట్ గా ఉంది బావ. అత్త ఊరు వెళ్లేముందు బాడీగార్డుతో మాట్లాడింది. ఏం మాట్లాడిందో వినలేదు కానీ ఆమెనే చేయించేదేమోనని అనుమానంగా ఉందని కార్తీక్ కు దీప చెప్తుంది. ఇది మాలిని పిన్ని పని అయి ఉండదు. షూట్ చేసిన తర్వాత జ్యోత్స్నకు బుల్లెట్ తగల్లేదని రౌడీలు చెప్పి ఉంటే పిన్ని ఆరా తీసేది. ఇలా ఫోన్ స్విచ్ఛాప్ చేసేది కాదని కార్తీక్ అంటాడు.

విజయ్ కాల్ చేసినా మాలిని ఫోన్ స్విచ్ఛాప్ వస్తుంది. ఇప్పుడు ఎలా చెప్పాలి? దేవుడా సూరజ్ ను బతికించు అని విజయ్ వేడుకుంటాడు.

12 గంటలు గడిస్తేనే

బుల్లెట్ అయితే తీశామని డాక్టర్ బయటకు వచ్చి చెప్తాడు. కానీ 12 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేం. పేషెంట్ త్వరగా స్పృహ‌లోకి రావాలని కోరుకోండి. లేదంటే అతనిపై ఆశలు వదులుకోండని డాక్టర్ అంటాడు. ఈ మాటలతో జ్యోత్స్న మరింత కుంగిపోతుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది.

నాలోని దుర్మార్గురాలు

దీప చావుబతుకుల్లో ఉన్నప్పుడు నువ్వెంత తల్లడిల్లావో నాకు తెలుసు బావ. రక్తం ఇవ్వాలంటే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలన్నాను. ఆ రోజు నాలో ఉన్న దుర్మార్గురాలిని ఈ రోజు ఆ డోనర్ లో చూశా. వాడు చెడ్డ మనిషి కాదు, నాలాంటి మనిషి. అవకాశవాది. నేను మారాను. వాడూ మారాలి. అంతే తేడా అని గతాన్ని జ్యోత్స్న గుర్తు చేసుకుంటుంది.

కాలం అన్నింటిని మారస్తుంది. మాలిని పిన్నిని తప్పా అని కార్తీక్ అంటాడు. అత్తకు సూరజ్ గురించి ఎలా చెప్పాలని దీప ఆలోచిస్తుంది. మరోవైపు దక్షిణామూర్తి ఫోన్ కు మాలిని బాడీగార్డు కాల్ చేస్తాడు. సూరజ్ కు బుల్లెట్ తగిలింది. బాబు చావు బతుకుల్లో ఉన్నాడని బాడీగార్డు చెప్పడంతో మాలినికి మైండ్ బ్లాక్ అవుతుంది.

బతుకుతాడనే గ్యారెంటీ లేదని

హాస్పిటల్లో పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడే వచ్చిన మాలిని అక్కడ రచ్చ రచ్చ చేస్తుంది. ఆపరేషన్ చేశాం. కళ్లు తెరిస్తే తప్పా ఏం చెప్పలేం. ఇప్పటికీ అతను బతుకుతాడనే గ్యారెంటీ లేదని డాక్టర్ చెప్తాడు. సూరజ్ ను చూసేందుకు జ్యోత్స్న వెళ్తుంది. మాలిని ఆమెను బయటకు లాక్కెళ్తుంది. నా కొడుకును ఏం చేశావో చెప్పవే అంటూ జ్యోను మాలిని నిలదీస్తుంది.

జ్యోత్స్నపై నిందలు

జ్యోత్స్ననే ఏదో చేసిందని మీకెలా తెలుసు అని మాలినిని ఎస్ఐ అడుగుతాడు. ఇది ఇక్కడ ఉందంటే ఏదో చేసిందనే అర్థం అని మాలిని నిందలు వేస్తుంది. నీకు ఇప్పుడు గుర్తొచ్చాడా నీ కొడుకు? రాత్రి నుంచి ఫోన్ చేస్తుంటే స్విచ్ఛాఫ్. తాత ఏమో లిఫ్ట్ చేయడు అని కార్తీక్ సీరియస్ అవుతాడు.

ఏదో ప్లాన్ చేసిందని

జ్యోత్స్న లేకుంటే నీ కొడుకు బుల్లెట్ తగిలిన చోటే ప్రాణాలు వదిలేసేవాడని దీప చెప్తుంది. అసలు సూరజ్ కు బుల్లెట్ తగిలినప్పుడు జ్యోత్స్న అక్కడ ఎందుకు ఉందని మాలిని ప్రశ్నిస్తుంది. నీ వల్ల క్యారెక్టర్ లేని మనిషిని అయ్యా. నా గురించి చెప్పుకునేందుకు రమ్మన్నానని జ్యోత్స్న చెప్తుంది.

అయితే నువ్వే ఏదో ప్లాన్ చేశావని జ్యోత్స్న మీదకు నెట్టేస్తుంది మాలిని. అంటే సూరజ్ ను జ్యోత్స్ననే చంపించాలనుకుందనేలా ఇరికించేందుకు మాలిని కొత్త నాటకం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks