Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ఇడ్లీ బండి వ్యాపారంలో వచ్చిన డబ్బులను లెక్కపెడుతూ శివ నారాయణ మురిసిపోతాడు. డబ్బుకు మించిన పేరు సాధించా. అదే శాశ్వతం అనుకున్నా. కానీ డబ్బే శాశ్వతం అని శివ నారాయణ అంటాడు.
కార్తీక్ కు థ్యాంక్స్

నా చేతిలో ఈ డబ్బు ఉండటానికి కారణం నువ్వే కార్తీక్. అందుకు థ్యాంక్స్ అని శివ నారాయణ చెప్తాడు. నువ్వు వాడి తాతవి కాబట్టి నీకు సహాయం చేయడం వాడి బాధ్యత అని కాంచన అంటుంది. కార్తీక్ అందరికీ సహాయం చేస్తాడు. అలా చేసే ఈ శివ నారాయణను చిల్లర లెక్కపెట్టుకునే శివ నారాయణగా మార్చాడని శివ నారాయణ కౌంటర్ వేస్తాడు.
జ్యోత్స్న కోసం టెన్షన్
దశరథ, సుమిత్ర కూడా కార్తీక్ ను టార్గెట్ చేసి మాట్లాడతారు. ఇక జ్యోత్స్న రాలేదని సుమిత్ర కంగారు పడుతుంది. 24 గంటలు దాటినా జ్యోత్స్న రాలేదు. ఫోన్ లేదు, మెసేజ్ లేదు. మాకు ఏడవడం తప్పా ఇంకో మార్గం లేదని సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందనేది తమకు తెలియదని దీప అంటుంది. కావాలంటే తన కడుపులోని బిడ్డపై ప్రమాణం వేస్తానంటుంది.
జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందో తెలీదు మామయ్య. జ్యోత్స్న నా అత్త కూతురు. ఎక్కడుందో తెలియడం లేదని కార్తీక్ కూడా చెప్తాడు. మా నాన్న టిఫిన్ బండి దగ్గరకు వచ్చినప్పుడు జ్యోత్స్న గురించి ఏదో చెప్పబోయాడు. కానీ మాట మార్చాడు. జ్యోత్స్న గురించి మా నాన్నకు ఏదైనా తెలిసి ఉండొచ్చా అని సుమిత్ర కంగారు పడుతుంది. కానీ శివ నారాయణ మాత్రం దక్షిణామూర్తికి ఏం తెలియదని అంటాడు. కోడలిని కంగారు పడకమని చెప్తాడు.
సూరజ్ ప్రశ్నలు
మరోవైపు టిఫిన్ బండి విషయంలో కార్తీక్ కొట్టిన దెబ్బ గురించి మాలిని ఆలోచిస్తుంటుంది. అప్పుడే సూరజ్ నీళ్లు తాగమని ఇస్తాడు. నీ గుండె అగ్నిపర్వతంలా మండిపోతుందమ్మా అని సూరజ్ కాస్త వెటకారంగానే అంటాడు. నీ తల్లిని కార్తీక్, దీప అవమానించారని మాలిని అంటుంది. నువ్వు ఎందుకు వెళ్లావని సూరజ్ రివర్స్ లో అడుగుతాడు. జ్యోత్స్న జాబ్ విషయం చెప్పొద్దని తాత చెప్పాడు. కానీ నువ్వు చెప్పాలని చూశావని సూరజ్ అంటాడు.
మాలిని ఎమోషనల్ డ్రామా
{{/usCountry}}మరోవైపు టిఫిన్ బండి విషయంలో కార్తీక్ కొట్టిన దెబ్బ గురించి మాలిని ఆలోచిస్తుంటుంది. అప్పుడే సూరజ్ నీళ్లు తాగమని ఇస్తాడు. నీ గుండె అగ్నిపర్వతంలా మండిపోతుందమ్మా అని సూరజ్ కాస్త వెటకారంగానే అంటాడు. నీ తల్లిని కార్తీక్, దీప అవమానించారని మాలిని అంటుంది. నువ్వు ఎందుకు వెళ్లావని సూరజ్ రివర్స్ లో అడుగుతాడు. జ్యోత్స్న జాబ్ విషయం చెప్పొద్దని తాత చెప్పాడు. కానీ నువ్వు చెప్పాలని చూశావని సూరజ్ అంటాడు.
మాలిని ఎమోషనల్ డ్రామా
{{/usCountry}}తాత చెప్పిన మాటల్లో నీకు నచ్చిందే చేస్తావన్నమాట అని తల్లిని సూరజ్ ప్రశ్నిస్తాడు. నువ్వురా కొడుకు అంటే. నేను ఎవరూ లేని ఒంటరిని అయిపోయానని ఇప్పుడు అనిపిస్తుందని మాలిని ఎమోషనల్ డ్రామా స్టార్ట్ చేస్తుంది. శివ నారాయణ తన కుటుంబం వైపు ఉన్నాడు. ఈ ఇంటి ఆడపడుచు తన కుటుంబం వైపు నిలబడుతుంది. కాంచన, కార్తీక్, దీప, శ్రీధర్ కూడా ఆ కుటుంబం గురించే ఆలోచిస్తున్నారు. మరి నా గురించి ఆలోచించేది ఎవరని మాలిని అడుగుతుంది.
మాలిని కొడుకు కాదు
నువ్వు ఇప్పుడు నా కొడుకులా ఉన్నావా? అని మాలిని గుచ్చిగుచ్చి అడుగుతుంది. సూరజ్ అంటే ఇప్పుడు మాలిని కొడుకు కాదు. జ్యోత్స్న ప్రేమించిన అబ్బాయి. నువ్వు ఇప్పుడు వాళ్ల ఫ్యామిలీ గురించే ఆలోచిస్తున్నావు. అందుకే నేను చేసే పనులు నచ్చడం లేదు. నీ బెడ్ రూమ్ లో పిల్లో కింద ఉన్న జ్యోత్స్న ఫొటో చూశా. అది నీ మనసు. నా కొడుకు చేయి దాటి పోయాడని జ్యోత్స్న చెప్పిన మాటను నిజం చేశావని మాలిని నిందలు వేస్తుంది.
తల్లీకొడుకుల ఛాలెంజ్
నీకు నా మీద నమ్మకం లేదు అమ్మ. నమ్మకం ఉంటే నీ బాడీగార్డును నన్ను ఫాలో అవమని చెప్పేదానివే కాదు అని సూరజ్ అనడంతో మాలిని షాక్ అవుతుంది. నీకు ఎప్పటినుంచో నా మీద అనుమానం ఉందమ్మా అని సూరజ్ అంటాడు. నీ మీద అనుమానం రావడానికి నా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి. అవి తప్పు అని నిరూపిస్తావా? అని కొడుక్కే మాలిని ఛాలెంజ్ విసురుతుంది.
నీది అనుమానమే, అది నిజం కాదని ఇప్పుడే నిరూపిస్తానని సూరజ్ అంటాడు. దీప, కార్తీక్ లు ఫస్ట్ ఆఫీసులోకి వచ్చారు. ఆ తర్వాత జ్యోత్స్నను తీసుకొచ్చారు. ఇంకా ఎలా నిరూపిస్తావు చెప్పు అని మాలిని అడుగుతుంది. జ్యోత్స్న ఆఫీసుకు రాకపోతే నీ అనుమానం పోతుందని నాకు తెలుసని సూరజ్ చెప్తాడు. ఇక జ్యోత్స్న నీకు ఆఫీసులో కనబడదని సూరజ్ చెప్తాడు.
కాంచన ఇంటికి సూరజ్
కాంచన ఇంటికి సూరజ్ వెళ్తాడు. కార్తీక్ అన్నయ్య, దీప వదిన కోసం వచ్చానని సూరజ్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఏమున్నా అందరి ముందే మాట్లాడమని కార్తీక్ చెప్తాడు. కానీ సూరజ్ మాత్రం వాళ్లనే బయటకు రమ్మంటాడు. జ్యోత్స్న ఏదీ? తాను కూడా వస్తే ముగ్గురితో కలిసి మాట్లాడతానని సూరజ్ అంటాడు. కానీ జ్యోత్స్న గురించి కార్తీక్ ఏం చెప్పడు.
ప్రాణాలు తిరిగి రావు
నా తల్లి చెప్పిందని పాత పగ తీర్చుకున్నా. గొడవలన్నీ ఇక్కడితో ఆగిపోవాలని సూరజ్ అంటాడు. మా తాత నుంచి లాక్కున్న ఆస్తులన్నీ ఇచ్చేస్తే వదిలేస్తానని కార్తీక్ చెప్తాడు. నా తండ్రి ప్రాణాలను తిరిగిస్తే మీ తాత ఆస్తులను తిరిగిస్తానని సూరజ్ కౌంటర్ వేస్తాడు. ప్రాణాలు తిరిగి రావు, ఆస్తులూ తిరిగి రావు. మీరు ఆఫీసుకు రాకండి, జ్యోత్స్నను కూడా రావొద్దని చెప్పండని సూరజ్ కండీషన్ పెడతాడు.
కార్తీక్ వార్నింగ్
రూ.15 కోట్ల చెక్ ను దీప చేతుల్లో పెట్టి సూరజ్ ఆఫర్ ఇస్తాడు. నాకు తిరిగి తీసుకోవడం అలవాటు. మా తాత ఆస్తులను కూడా తీసుకుంటానని చెక్ రిటర్న్ చేస్తాడు కార్తీక్. నేను మీ దగ్గర నుంచి అన్ని అధికారాలు లాక్కుంటా. నాకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీకు పట్టపగలే ఆకాశంలో చుక్కలు కనిపిస్తాయి. ఇక జ్యోత్స్నను నువ్వు అసలే ఆపలేవని కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు.
నా మాట కూడా విను. మా అమ్మ చేసే పనులను నేను ఆపలేను. మీరు చాలా బాధపడతారని సూరజ్ కూడా కౌంటర్ వేస్తాడు. నువ్వు జూనియర్ తమ్ముడు, నా ముందు నిలబడలేవని కార్తీక్ గట్టిగానే చెప్తాడు. పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పి సూరజ్ వెళ్లిపోతాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.