Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. భోజనం టైమ్ లో కాల్ చేసిన సూరజ్ తో జ్యోత్స్న చిరాగ్గా మాట్లాడుతుంది. భోజనం ప్లేట్ ముందు కూర్చోగానే మీ అమ్మ, తాత వచ్చారు. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. అయినా నువ్వు ఎందుకు రాలేదు? పంపించింది నువ్వే కదా అని జ్యోత్స్న కోప్పడుతుంది.
ఎందుకు కాల్ చేశావ్ సూరజ్

సూరజ్ కూడా గట్టిగానే కౌంటర్లు వేస్తాడు. ఎందుకు కాల్ చేశావ్ సూరజ్? ఏం వినడానికి అని జ్యోత్స్న గట్టిగా అడుగుతుంది. ఫోన్లో కాదు డైరెక్ట్ గా కలవాలని సూరజ్ అడుగుతాడు. ముందు ఆ తిండి ఆపు అని అంటాడు. ఏంటీ ఏదో పెళ్లాన్ని బెదిరించినట్లు బెదిరిస్తన్నావ్. నా తిండి నా ఇష్టం అని జ్యోత్స్న తింటూనే ఉంటుంది.
చెప్పరా సూరజ్
నేను బయటకు రాను అని జ్యోత్స్న అంటుంది. నీకు దమ్ముంటే మా ఇంటికి రా అని ఛాలెంజ్ విసురుతుంది. కానీ సూరజ్ రిక్వెస్ట్ చేయడంతో స్కూటీ తీసుకొని బయటకు వెళ్లి కలుస్తుంది. సూరజ్ ను సార్ అని పిలుస్తుంది. సార్ వద్దు, ఫ్రెండ్స్ లా ఉందామని సూరజ్ అంటాడు. అయితే వెంటనే జ్యోత్స్న ఏమో చెప్పరా, ఎందుకు వచ్చావ్ రా అని పిలుస్తుంది. దీంతో సూరజ్ షాక్ అవుతాడు. సార్ అనే పిలవమంటాడు.
జ్యో చేయి పట్టుకొని
పిలవగానే ఎందుకు వచ్చావని జ్యోత్స్నను సూరజ్ అడుగుతాడు. సరే పోతాలే అని జ్యోత్స్న ఓ అడుగు వేస్తుంది. వెంటనే జ్యో చేయి పట్టుకుంటాడు సూరజ్. నీ మీద ఉదయం ఆఫీసులో పేపర్లు విసిరేశాను కదా. నీ మీద కోపంతోనే విసిరేశా కదా అని సూరజ్ అంటాడు. నేను అది అప్పుడే మర్చిపోయానని జ్యో చెప్తుంది. జరిగిన దానికి అంటూ సూరజ్ సాగదీస్తాడు. సారీ చెప్పాలని వచ్చారా అని జ్యోత్స్న అడగ్గానే సూరజ్ మాట మారుస్తాడు.
బలుపు తగ్గించుకోవాలని
సారీ చెప్పడానికి రాలేదు. నీ బలుపు తగ్గించుకోకపోతే ఈ సారి ఏది దొరికితో అది విసురుతానని చెప్పడానికి వచ్చా. బేసిక్ గా నీకు పని రాదు. నీలాంటి రికమండేషన్ క్యాండిడేట్ ను ఇలాగే చూస్తానని సూరజ్ అంటాడు. దీంతో జ్యోత్స్న ఏడుస్తూ డ్రామా చేస్తుంది. రేపు ఉదయం 9 గంటలకల్లా నా వన్ వీక్ షెడ్యూల్ ప్లానింగ్ రెడీ చేసి నా చేతుల్లో పెట్టాలని సూరజ్ సీరియస్ గా చెప్తాడు.
నా అత్త కొడుకు
{{/usCountry}}సారీ చెప్పడానికి రాలేదు. నీ బలుపు తగ్గించుకోకపోతే ఈ సారి ఏది దొరికితో అది విసురుతానని చెప్పడానికి వచ్చా. బేసిక్ గా నీకు పని రాదు. నీలాంటి రికమండేషన్ క్యాండిడేట్ ను ఇలాగే చూస్తానని సూరజ్ అంటాడు. దీంతో జ్యోత్స్న ఏడుస్తూ డ్రామా చేస్తుంది. రేపు ఉదయం 9 గంటలకల్లా నా వన్ వీక్ షెడ్యూల్ ప్లానింగ్ రెడీ చేసి నా చేతుల్లో పెట్టాలని సూరజ్ సీరియస్ గా చెప్తాడు.
నా అత్త కొడుకు
{{/usCountry}}నాకో అత్త కొడుకు ఉన్నాడు. వాడి పేరు సూరజ్. వాడు కూడా అచ్చం నీలాగే మాట్లాడతాడు సార్. వాడు ఇంతే సార్. వయసులో ఉండగానే చాదస్తం వచ్చిందని సూరజ్ కు ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేస్తుంది జ్యోత్స్న. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. లేకపోతే మీ అమ్మ మీ తాతను తీసుకొని మా ఇంటికి వస్తుంది. తన కొడుకు కనిపించలేదని మాపై నిందలు వేస్తుందని జ్యో సెటైర్ వేసి వెళ్లిపోతుంది. ఇలాంటి పొగరుబోతుగా సారీ చెప్పకూడదు, ఇలాగే పనిష్మెంట్ ఇవ్వాలనుకొని సూరజ్ వెళ్లిపోతాడు.
జ్యోను తిట్టిన కార్తీక్, దీప
ఇంటికి వెళ్లిన జ్యోత్స్నను కార్తీక్, దీప తిడతారు. సూరజ్ కాల్ చేయగానే ఎందుకు వెళ్లావ్? మీరిద్దరు కలవడం అమ్మ చూస్తే ఏమైపోతుందో తెలుసా? ఈ విషయం తాతకు తెలిస్తే నీ ముఖం కూడా చూడడని దీప సీరియస్ గా మాట్లాడుతుంది. సారీ చెప్పడానికి సూరజ్ పిలిచాడు. కానీ నేను ఆ అవకాశం ఇవ్వలేదు. పేపర్లు విసిరేసినందుకే సారీ చెప్తే.. పెళ్లిని ఆపేసినందుకు ఎన్ని సారీలు చెప్పాలని జ్యోత్స్న అడుగుతుంది.
ఇలా సూరజ్ ను కలవడం తప్పే. సూరజ్ చేసిన తప్పులన్నీ సరిదిద్దుకునేంతవరకూ తప్పులు చేస్తూనే ఉంటానని జ్యోత్స్న చెప్తుంది. నా దారికి అడ్డు రావొద్దు బావ. నాకు చాలా పని ఉందని జ్యో లోపలికి వెళ్లిపోతుంది. జ్యోత్స్న, సూరజ్ ల పెళ్లితోనే ఈ సమస్యకు పరిష్కారం అని దీపతో కార్తీక్ అంటాడు.
మాలిని ఇంటికి జ్యోత్స్న
మరోవైపు రాత్రి రూమ్ లో లైట్స్ చాలా సేపు వెలిగాయి. కానీ రూమ్ లో లేవు. ఏ ఫ్రెండ్ ను కలవడానికి వెళ్లావని సూరజ్ ను మాలిని అడుగుతుంది. అనుమానం ఎందుకని దక్షిణామూర్తి అడుగుతాడు. కూతుళ్లను కాదు కొడుకులను కూడా కాపాడుకోవాలని మాలిని చెప్తుంది. సూరజ్ టిఫిన్ తినబోతుండగా జ్యోత్స్న వచ్చి ప్లానింగ్ ను సూరజ్ చేతుల్లో పెడుతుంది.
సార్ రాత్రి కలిశారు
నువ్వు ఇంటికి వచ్చావేంటీ అని మాలిని, సూరజ్ అడుగుతారు. సార్ రాత్రి నన్ను కలిసినప్పుడు అని జ్యో అనగానే.. మాలినికి ఫ్యూజులు ఔట్ అవుతాయి. నిన్న ప్లానింగ్ సరిగ్గా చేయలేదని పేపర్స్ నా ముఖం మీద విసిరికొట్టాడు తాత. వన్ వీక్ షెడ్యూల్ ప్లానింగ్ ను మార్నింగ్ 9 గంటలకల్లా తన చేతుల్లో ఉండాలన్నాడు. అందుకే నైట్ అంతా మేల్కోని ప్రిపేర్ చేశా. ఆఫీసుకు సార్ రాలేదు. ఇంటికి వచ్చేసరికి 10 నిమిషాలు లేట్ అయింది. అందుకే సారీ చెప్పానని జ్యోత్స్న అంటుంది.
డబుల్ యాక్షన్
నిన్న మీ ఇంటికి వచ్చి అంత గొడవ చేశాక మళ్లీ మా ఇంటికి ఎందుకు వచ్చావని జ్యోత్స్నను మాలిని అడుగుతుంది. మా ఇంటికి ఎప్పుడు వచ్చారని జ్యోత్స్న షాకిస్తుంది. సుమిత్రకు ఒకరే కూతురు. కానీ డబుల్ యాక్షన్. దీనికేదో స్ల్పిట్ పర్సనాలిటీ ఉన్నట్లుంది. ఒకేసారి రెండు జీవితాల్లో బతికేస్తుందని మాలిని అంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.