...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. తాళి కట్టు- సూరజ్ పిచ్చిలో జ్యోత్స్న- తాత ఎమోషనల్- దీప, కార్తీక్ సారీ

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 2 ఎపిసోడ్ లో జ్యోత్స్న పూర్తిగా సూరజ్ పిచ్చిలో మునిగిపోతుంది. లేని సూరజ్ ను ఊహించుకొని తాళి కట్టమంటుంది. అది చూసి శివ నారాయణ కన్నీళ్లు పెట్టుకుంటాడు. మరోవైపు జ్యోత్స్నకు దీప, కార్తీక్ సారీ చెప్తారు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Published on: Sep 2, 2026, 06:57:12 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. దీపను తన కూతురు అని చెప్పలేనేమో అని దశరథ షాకిస్తాడు. ఈ నిజం బయటపడ్డ రోజు సుమిత్ర బాధ పడుతుంది. అంత ప్రేమగా చూసుకున్న కూతురికి నువ్వే అన్యాయం చేశావని తెలిస్తే తను తట్టుకోగలదా? అప్పుడు నా భార్య శాశ్వతంగా దూరమవుతుందని దశరథ అంటాడు.

దీప ఎమోషనల్

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

అలా మాట్లాడొద్దు నాన్న. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలనే అనుకున్నానని దీప అంటుంది. కానీ దశరథ మాట్లాడకుండా వెళ్లిపోతాడు. మరోవైపు చేతిలో తాళి పట్టుకుని జ్యోత్స్న బాధపడుతుంది. అప్పుడే సూరజ్ తన గదిలోకి వచ్చినట్లు జ్యోత్స్న ఊహించుకుంటుంది.

సూరజ్ పిచ్చిలో జ్యోత్స్న

సూరజ్ నా కోసం వచ్చావా? నా కోసం వస్తావని తెలుసు. నీ ప్రేమ నన్ను మార్చినప్పుడు, నా ప్రేమ నిన్నెందుకు మార్చదని జ్యోత్స్న అంటుంది. నన్ను మర్చిపోమ్మని చెప్పడానికి వచ్చానని సూరజ్ అంటాడు. నువ్వు ఇలా బాధపడటం నాకు ఇష్టం లేదని సూరజ్ అన్నట్లు జ్యోత్స్న ఊహించుకుంటుంది.

అంతరాత్మ ఏం చెప్తుంది?

నా ప్రేమ నిజమని ఎలా నమ్ముతున్నావ్? నీ మెడలో తాళి కట్టకుండా వెళ్లిపోయా. నీ అంతరాత్మ నీతో ఏం చెప్తుంది? మాలిని సూరజ్ కొడుకు. పగ తీర్చుకోవడానికి వచ్చాడు. నీతో ఆడుకున్నాడు. ఆట అయిపోయింది కాబట్టి వెళ్లిపోయాడని చెప్పట్లేదా? అని సూరజ్ అడుగుతాడు. నా కోసం జ్ణాపకాలు వదిలేసి పోయావ్. నా అంతరాత్మ మాటలు వినకూడదని చెవులు మూసుకున్నావ్. నా రూపం కనపడకూడదని కళ్లు మూసుకున్నావని జ్యోత్స్న అంటుంది.

ప్రేమలో ఎమోషన్ మారదు

నీ మనసులో నేను లేనని నా మీద ఒట్టేసి చెప్పమని సూరజ్ చేయిని తలపై పెట్టుకుంటుంది. కానీ సూరజ్ చేయి తీసేస్తాడు. ఒట్టు వేసి అబద్ధం చెప్తే నేను పోతాననా? నేను పోతే నీకేంటీ? నువ్వు నన్ను ప్రేమించావ్. నీ ప్రేమ నిజం అని జ్యోత్స్న అంటుంది. కాదని చెప్పలేనని సూరజ్ అంటాడు.

తాళి కట్టు సూరజ్

వెంటనే తాళి తీసి తన మెడలో కట్టమంటుంది జ్యోత్స్న. నువ్వు లేకుండా బతకలేను. నాకు నువ్వు కావాలి. తాళి కట్టరా సూరజ్ అని జ్యోత్స్న అంటుంది. అప్పుడు జ్యోత్స్న అని ఆమె ముందు ఉన్న శివ నారాయణ, పారిజాతం షాక్ అవుతారు. దీంతో సూరజ్ ను ఊహించుకున్నట్లు జ్యోత్స్నకు అర్థమవుతుంది.

శివ నారాయణ కన్నీరు

జ్యోత్స్న ఎవరితో మాట్లాడుతున్నావ్? ఆ తాళి ఏంటీ? అని ఏడుస్తూ శివ నారాయణ అడుగుతాడు. నాకేం కాలేదు తాతా. నేను బాగానే ఉన్నానని జ్యోత్స్న పడుకుంటుంది. శివ నారాయణ బయటకు పోయి ఎమోషనల్ అవుతాడు. సూరజ్ ను మర్చిపోమ్మని జ్యోత్స్నకు చెప్పలేం. ఈ విషయంలో పాపం ఎవరిదైనా ఉందంటే అది కార్తీక్, దీపలదే. అంతా వాళ్లే చేశారు. దాని జీవితాన్ని నాశనం చేశారని శివ నారాయణ ఏడుస్తాడు.

కర్మ కాదమ్మా

మరోవైపు తల్లి కాళ్లపై తల పెట్టుకుని కార్తీక్ ఫీల్ అవుతాడు. అనుకోకుండా యాక్సిడెంట్ అయి నీకు ఇలా అయితే కర్మ అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇది కర్మ కాదమ్మా. నీలో ఇంత బాధ దాచుకున్నావ్ అమ్మా. అంత తేలిగ్గా ఎలా క్షమించగలిగావ్ అని కాంచనను కార్తీక్ అడుగుతాడు. మా అన్నయ్యను చూసి బాధ మర్చిపోయా. నువ్వు వదిలేయ్ అని కాంచన అంటుంది.

జ్యోత్స్నకు న్యాయం

సూరజ్ మనల్ని ఎంత మోసం చేశాడు? చేయని తప్పునకు మాటలు పడ్డారు. అందరికంటే ఎక్కువ బాధ జ్యోత్స్నకే ఉంది. దాని మనసు గాయపడింది. ఈ పెళ్లికి పెద్దలు మీరిద్దరు కాబట్టి బాధకు కారణం మీరే. జ్యోత్న్స అడిగిన దానికి న్యాయం చేయాల్సిందే. జ్యోత్స్న మళ్లీ మామూలు మనిషి అవాలి. జ్యోత్స్నతో మాట్లాడండి అని కార్తీక్, దీపకు కాంచన చెప్తుంది.

సారీ జ్యోత్స్న

ఇన్నాళ్లు సూరజ్ ఉన్న ఔట్ హౌస్ కు ఉదయం జ్యోత్స్న వెళ్తుంది. అక్కడ సూరజ్ జ్ణాపకాలను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే దీప, కార్తీక్ వస్తారు. దీప చేతులు పట్టుకొని జ్యోత్స్న ఏడ్చేస్తుంది. మేమే సారీ చెప్పాలి జ్యోత్స్న. మీ తాత, నాన్న, అమ్మకు బాధ కలిగింది. మరి నీకెంత బాధ కలగాలి? అని కార్తీక్ అంటాడు.

సూరజ్ విషయంలో మా ప్రమేయం లేకుండా ఏం జరగలేదు. నీ బాధకు నేనే కారణం. సారీ జ్యోత్స్న అని కార్తీక్ చెప్తాడు. మా పెళ్లి చేయమని నేనే అడిగాను కదా. నేనే సూరజ్ ను ప్రేమించా. వాడు నాకు దక్కడేమో అనే భయంతో మీ సాయం అడిగా. మాలిని కొడుకే సూరజ్ అని మనకు తెలియదు. ఆ విషయంలో మోసపోయాం. కానీ ప్రేమ విషయంలో మోసపోలేదని జ్యోత్స్న చెప్తుంది.

నేనే ప్రేమించా

నేను వాడిని ప్రేమించా. సూరజ్ నన్ను రిజెక్ట్ చేసినా ప్రేమించా. మారమని అడిగినప్పుడు ప్రేమించా. నా ప్రేమ నిజమని నాకు అర్థమైనప్పుడు సూరజ్ తాళి కట్టకుండా వెళ్లిపోతే ఆ ప్రేమ చచ్చిపోతుందా అని జ్యోత్స్న అడుగుతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe