...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-ఎవరంటూ తాతకే షాకిచ్చిన జ్యోత్స్న-మాలిని కన్నీటి డ్రామా-జ్యో ఇంటికి సూరజ్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 8 ఎపిసోడ్ లో స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. దక్షిణామూర్తిని ఎవరు అని జ్యోత్స్న అడుగుతుంది. ఆ మాటలకు తాత ఫీల్ అవుతాడు. మాలిని ఎమోషనల్ డ్రామా ఆడుతుంది. జ్యో కూడా దీప, కార్తీక్ ను నిందిస్తుంది. సూరజ్ తెలియకుండానే జ్యో ఇంటికి వస్తాడు.

Published on: Sep 8, 2026, 07:09:54 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తాత దక్షిణామూర్తిని తీసుకొని పార్కుకు వాకింగ్ కు వెళ్తాడు సూరజ్. మనసు డస్ట్ బిన్ లాంటిదాని, అందరూ చెత్త వేయాలని చూస్తారని సూరజ్ చెప్తాడు. తన మనసు ఖాళీగా ఉంటుందని చెప్తూ అక్కడే బెంచీ మీద కూర్చున్న జ్యోత్స్నను చూసి ఆగిపోతాడు.

మీరు ఎవరు?

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

జాగింగ్ చేస్తానని సూరజ్ వెళ్లిపోతాడు. దక్షిణామూర్తి వెళ్లి జ్యోత్స్నతో మాట్లాడతాడు. అమ్మ ఎలా ఉంది? అని జ్యోత్స్నను అడుగుతాడు దక్షిణామూర్తి. మీరు ఎవరు? అని జ్యో షాక్ ఇస్తుంది. మీ అమ్మకు తండ్రిని అవుతానని దక్షిణామూర్తి పరిచయం చేసుకుంటాడు. జీవితంలో చనిపోయినా మర్చిపోలేని గాయం చేశారని జ్యో అంటుంది.

మనవరాలి జీవితం

అప్పుడే జ్యోత్స్నను సూరజ్ పెళ్లి చేసుకొని వస్తే వెనుకాలే సుమిత్ర వస్తుందనే తన ప్లాన్ ను దక్షిణామూర్తి గుర్తుచేసుకుంటాడు. ఇక దక్షిణామూర్తిని జ్యోత్స్న సార్ అని పిలుస్తుంది. నీ కొడుకు చావుకు ప్రతీకారం నీ కూతురి మీద తీర్చుకున్నావ్. నీ మనవడితో నీ మనవరాలి జీవితాన్ని నవ్వులపాలు చేశావని జ్యోత్స్న చెప్తుంది.

సూరజ్ మంచివాడు

నా అంచనాలు తప్పాయి. నువ్వు కూడా మీ తాత శివ నారాయణను అంచనా వేయడంలో తప్పావని దక్షిణామూర్తి అంటాడు. పైకి తేనేలాగా కనిపిస్తున్న విషం నిండిన మాటలు తాత నీవి. మనవడిని అడ్డుపెట్టుకుని పగ సాధించావని జ్యో ఫైర్ అవుతుంది. పగ సాధించాడు కాబట్టి నా మనవడు నీకు చెడ్డవాడు. నిజానికి వాడు చాలా మంచివాడని దక్షిణామూర్తి చెప్తాడు.

మీరు చెప్పిన కథలే

అప్పుడు సూరజ్, జ్యోత్స్న ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. నా తండ్రి ఫొటోకు కూడా దండ ఉండేది. నా అత్త కాళ్లు పోయాయని జ్యో అంటే.. నా తండ్రి చనిపోయాడని సూరజ్ చెప్తాడు. నేను పోగొట్టుకున్న మనసును వెతుక్కోవడానికి వచ్చానని జ్యోత్స్న అంటుంది. అది ఎప్పటికీ దొరకదని దక్షిణామూర్తి ట్విస్ట్ ఇస్తాడు. మనం సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని సూరజ్ కఠినంగా మాట్లాడేసరికి జ్యో తట్టుకోలేకపోతుంది.

ఉద్యోగుల భయం

మరోవైపు ఆఫీస్ దగ్గర కార్తీక్, దీపతో ఎంప్లాయిస్ మాట్లాడతారు. పెద్దవాళ్లు మీరే మోసపోయారు. మా పరిస్థితి ఏంటి అని ఆ ఉద్యోగులు భయపడతారు. మీకేం భయం లేదని కార్తీక్ ధైర్యం చెప్తాడు. అప్పుడే శివ నారాయణ, దశరథ వస్తారు. మీ ఉద్యోగాలకు ఏ భయం లేదు. మీకు ఏమైనా అవసరం ఉంటే డైరెక్ట్ గా నాతోనే మాట్లాడండని ఉద్యోగులకు శివ నారాయణ చెప్తాడు.

ఆఫీస్ లో కూర్చున్న జ్యోత్స్న.. సూరజ్ జ్ణాపకాలను గుర్తుచేసుకుంటుంది. ఆఫీస్ బాయ్ ను పిలిచి సూరజ్ చైర్, టేబుల్ ను తీయించేస్తుంది. సూరజ్ ను ఎందుకు తలుచుకోవడం జ్యోత్స్న? అని దీప అడుగుతుంది. నాకు ఆ జ్ణాపకాల నుంచి బయటకు రావాలనే ఉంది. అందుకే ఆఫీస్ కు వచ్చా. కానీ ఆ జ్ణాపకాలు నన్ను వదలట్లేదని జ్యోత్స్న చెప్తుంది.

సూరజ్ ను మర్చిపో

సూరజ్ గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. వీలైతే మర్చిపో అని కార్తీక్ సలహా ఇస్తాడు. మర్చిపోవడానికి ఓ జీవితం సరిపోదు. మనసిచ్చిన మనిషిని మర్చిపోవడం అంటే మనిషిగా చచ్చిపోవడమే. సూరజ్ లేకపోయినా నాకు కనిపిస్తున్నాడు. నా బాధలో మీ తప్పు లేదా బావ? ఇదంతా నా ఇష్ట ప్రకారమే జరిగింది. కానీ నేను సూరజ్ ను ప్రేమించేలా చేసింది మీరే కదా అని కార్తీక్, దీపను జ్యో కూడా నిందిస్తుంది.

ఎవరు మీ వైపు వేలు ఎత్తి చూపించకుండా చేయండి. నాకు ఏదైనా వర్క్ ఇవ్వు దీప అని జ్యోత్స్న అడుగుతుంది. జ్యోను ఇంటికి వెళ్లమంటుంది దీప.

మాలిని ప్రశ్నలు

మరోవైపు ఇంట్లో సూరజ్ తో మాట్లాడుతూ జ్యోత్స్న కళ్లలో బాధ కనపడుతుందని దక్షిణామూర్తి ఫీల్ అవుతాడు. నా మనవరాలు ఇలా బాధపడుతుంటే నా గుండె బాధపడుతుంది. మనం అనుకున్నదానికంటే పెద్ద నష్టమే జరిగిందని దక్షిణామూర్తి అంటాడు. అప్పుడే వచ్చిన మాలిని మీకు నష్టం జరగలేదా? నాకు, నా కొడుక్కి నష్టం జరగలేదా? అక్కడ ఉన్న మీ కొడుకు ఫొటో కనిపించడం లేదా? అని అడుగుతుంది.

ఒక ప్రాణం పోవడం కంటే పెళ్లి ఆగిపోవడం పెద్ద విషయమా? కొడుకు పోవడం కంటే కూతురు కన్నీళ్లు పెట్టుకోవడం పెద్ద విషయమా? నా భర్తను చంపేశారనే కోపం తగ్గదు. కానీ నేను తప్పు చేశానేమో. మీరు బాధపడుతున్నారు. మీ సంతోషాన్నే కోరుకుంటున్నా. మీ మనసు సుమిత్ర ఇంటి దగ్గరే ఉందని మాలిని ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది.

జ్యోత్స్న ఇంటికి

వెంటనే సూరజ్ కార్లో తనకు తెలియకుండానే జ్యోత్స్న ఇంటికి వెళ్తాడు. మాలిని కొడుకు అనేది తప్పా ఇంకేమీ అబద్ధం చెప్పలేదని సూరజ్ చెప్తాడు. విత్తనాలు విసరకపోతే మొక్కలు మొలకెత్తవంటూ తన ఫీలింగ్స్ చెప్తుంది జ్యోత్స్న. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe