ఇటీవల బాలీవుడ్ జంటలు వరుసగా తల్లిదండ్రులుగా మారుతున్నారు. ఇటీవల ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ పరిణీతి చోప్రా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరోయిన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.
క్రేజీయెస్ట్ కపుల్స్‌లో

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తాజాగా ఇవాళ (నవంబర్ 7) అధికారికంగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. బాలీవుడ్‌లో అత్యంత క్రేజీయెస్ట్ కపుల్స్‌లో ఒకరిగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ జంట నిలిచింది.
కత్రినా కైఫ్ బేబీ బంప్ ఫొటోలు
ఈ ఏడాది సెప్టెంబర్‌లో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. ఇది చాలా మంది అభిమానులకు సంతోషాన్ని పంచింది. అలాగే కత్రినా కైఫ్ బేబీ బంప్ ఫొటోలు కూడా పోస్ట్ చేసి తన సంతోషాన్ని పంచుకుంది. అయితే, కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అయిందని అంతకుముందు పుకార్లు రావడంతో బేబి బంప్ ఫొటోలతో క్లారిటీ ఇచ్చారు.
పండంటి మగ బిడ్డను
ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు తాము పండంటి మగ బిడ్డను కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు కత్రినా, విక్కీ జంట సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈరోజు ఉదయం విక్కీ కౌశల్ తన అధికారిక సోషల్ హ్యాండిల్‌లో పోస్ట్‌తో గుడ్ న్యూస్ తెలిపాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అపారమైన ప్రేమ, కృతజ్ఞతతో
ఈ పోస్ట్‌లోనే కత్రినా కైఫ్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొన్నాడు విక్కీ కౌశల్. "అపారమైన ప్రేమ, కృతజ్ఞతతో మా ఆనందాల సమూహం వచ్చేసింది. మేము మా మగ బిడ్డను స్వాగితిస్తున్నాం. నవంబర్ 7, 2025. కత్రినా అండ్ విక్కీ" అని విక్కీ కౌశల్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
ఇండస్ట్రీలో సంతోషం
{{/usCountry}}ఈ పోస్ట్‌లోనే కత్రినా కైఫ్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొన్నాడు విక్కీ కౌశల్. "అపారమైన ప్రేమ, కృతజ్ఞతతో మా ఆనందాల సమూహం వచ్చేసింది. మేము మా మగ బిడ్డను స్వాగితిస్తున్నాం. నవంబర్ 7, 2025. కత్రినా అండ్ విక్కీ" అని విక్కీ కౌశల్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
ఇండస్ట్రీలో సంతోషం
{{/usCountry}}ఈ పోస్ట్‌నే కత్రినా కైఫ్ కూడా షేర్ చేసింది. కత్రినా కైఫ్ తల్లిగా మారిన విషయం ఇండస్ట్రీలో సంతోషాన్ని పంచుతోంది. ఇక కత్రినా, విక్కీ జంటకు అభిమానులతోపాటు నెటిజన్స్, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కత్రినా కైఫ్ తెలుగు సినిమాలు
ఇదిలా ఉంటే, కత్రినా కైఫ్ తెలుగులో కూడా హీరోయిన్‌గా మెప్పించింది. విక్టరీ వెంకటేష్ మల్లీశ్వరి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కత్రినా కైఫ్ ఆ తర్వాత బాలకృష్ణతో అల్లరి పిడుగు మూవీ చేసింది.