Keerthy Suresh OTT: దాదాపు రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో కీర్తి సురేష్ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘అక్క’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. మహిళల చేతుల్లో నడిచే ‘పెర్నూరు’ అనే పట్టణం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. నేర సామ్రాజ్యాన్ని శాసించే ముగ్గురు సోదరీమణుల్లో ఒకరైన 'భవానీ' అనే పవర్‌ఫుల్ అక్క పాత్రలో కీర్తి కనిపించనున్నారు.
భవానీ క్యారెక్టర్

అక్క వెబ్ సిరీస్ లో తన పాత్ర గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ.. "సాధారణంగా గ్యాంగ్‌స్టర్ అనగానే మనకు ఒక మాస్ ఇమేజ్, రక్తపాతం గుర్తొస్తాయి. కానీ ఈ సిరీస్‌లో భవానీ క్యారెక్టర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. హత్యలు చేయడం కంటే.. ఒక నాయకత్వ లక్షణంతో రాజసం ఉట్టిపడేలా నా పాత్ర సాగుతుంది. ఈ వైవిధ్యమైన ఎనర్జీని అర్థం చేసుకోవడం నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది" అని చెప్పుకొచ్చారు.
భాష ముఖ్యం కాదు
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న కీర్తి సురేష్.. ఇప్పుడు హిందీ ప్రాజెక్టులపై కూడా దృష్టి పెట్టారు. అయితే భాష అనేది తనకు అడ్డంకి కాదని ఆమె స్పష్టం చేశారు. "నేను హిందీలో ఏం చేశాను, ఏం చేయలేదు అని ఆలోచించట్లేదు. ఒక ప్రాజెక్ట్ నాకు ఎంత ఆసక్తిని కలిగిస్తుంది అనేదే ముఖ్యం.
నాకు నచ్చిన కథ తెలుగులో వచ్చినా, తమిళంలో వచ్చినా కచ్చితంగా చేస్తాను. ఇక్కడ భాష అనేది రెండో అంశం మాత్రమే. నేను మునుపెన్నడూ చేయని విభిన్నమైన పాత్రలను ప్రయత్నించాలని మాత్రమే కోరుకుంటున్నాను" అని కీర్తి వివరించారు.
ఓటీటీ ఎందుకన్నారు!
ఓటీటీలో నటించడంపై తనకెదురైన అనుభవాలను కూడా 34 ఏళ్ల కీర్తి సురేష్ పంచుకున్నారు. "నేను కేవలం థియేట్రికల్ స్టార్‌నని, ఓటీటీ షోలు చేయొద్దని చాలా మంది చెప్పారు. కానీ నేను వారి మాటలు పట్టించుకోలేదు" అని నవ్వుతూ కీర్తి సమాధానమిచ్చారు.
{{/usCountry}}ఓటీటీలో నటించడంపై తనకెదురైన అనుభవాలను కూడా 34 ఏళ్ల కీర్తి సురేష్ పంచుకున్నారు. "నేను కేవలం థియేట్రికల్ స్టార్‌నని, ఓటీటీ షోలు చేయొద్దని చాలా మంది చెప్పారు. కానీ నేను వారి మాటలు పట్టించుకోలేదు" అని నవ్వుతూ కీర్తి సమాధానమిచ్చారు.
{{/usCountry}}కోవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, సినిమాకు వెబ్ సిరీస్‌లు ఏమాత్రం తీసిపోవని ఆమె అభిప్రాయపడ్డారు. థియేటర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు రెండు పడవల ప్రయాణంలాంటివేనని.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ, నటిగా అన్ని రకాల ప్రాజెక్టులు చేయడం తనకు ఇష్టమని కీర్తి స్పష్టం చేశారు.
నెట్‌ఫ్లిక్స్‌లో ‘అక్క’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వైష్ణవ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘అక్క’ సిరీస్‌లో కీర్తి సురేష్‌తో పాటు టాలెంటెడ్ నటి రాధికా ఆప్టే మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు తన్వి అజ్మీ, మహేష్ మంజ్రేకర్, అన్షుమాన్ పుష్కర్, మోనికా పన్వార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్, నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ వెబ్ సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.