Keerthy Suresh About Interfaith Marriage Struggles: 'మహానటి' చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా మెప్పించిన కీర్తి సురేష్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుదీర్ఘకాలం పాటు రహస్యంగా సాగిన తన ప్రేమాయణం, పెళ్లి దిశగా సాగిన ప్రయాణంలో ఎదురైన సవాళ్ల గురించి మాట్లాడారు. వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌తో జరిగిన భిన్న మతాంతర వివాహం (Interfaith Marriage) వెనుక ఉన్న కష్టాలను ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విశ్లేషించారు.
డైరీ చదివి పట్టుకున్న తల్లి

తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో ఎలా బయటపడిందో కీర్తి సురేష్ గుర్తు చేసుకున్నారు. "ప్లస్ టు పూర్తి చేసిన వెంటనే మా ప్రేమ ప్రయాణం మొదలైంది. నేను కాలేజీలో ఉన్నప్పుడు నా పర్సనల్ డైరీని మా అమ్మ (సీనియర్ నటి మేనక) చదివేసింది. అందులో మా ప్రేమ గురించిన ప్రతి వివరమూ ఉంది. తల్లిగా నీ డైరీ చదివే హక్కు నాకు ఉందంటూ అమ్మ ఆ ఆంతరంగిక విషయాలను చూసేసింది" అని కీర్తి తెలిపారు.
ఆ సంఘటన తర్వాత తాను డైరీ రాయడమే శాశ్వతంగా ఆపేసినట్లు కీర్తి సురేష్ చెప్పారు. "నాకు డైరీ రాయడం అంటే ఎంతో ఇష్టం. కానీ ఆ రోజు తర్వాత ఆ డైరీ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. బహుశా అమ్మ దాన్ని తగలేసి ఉంటుందని భావిస్తున్నాను. ఆ డైరీ మళ్లీ నాకు దొరికితే బాగుణ్ణు అనిపిస్తుంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మతాంతర వివాహం.. ఇంట్లో పెద్ద ఎత్తున సమస్యలు
హిందూ కుటుంబానికి చెందిన కీర్తి సురేష్, క్రైస్తవ మతానికి చెందిన ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకోవడం అంత సులువుగా జరగలేదు. 2009 డిసెంబర్‌లో మొదటిసారి కలిసిన వీరు, 2010 జనవరి నుంచి డేటింగ్ ప్రారంభించారు. ఆ సమయానికి కీర్తి వయసు 17 ఏళ్లు మాత్రమే. ఆంటోనీ ఆమె కంటే ఏడేళ్లు పెద్దవారు కావడం, ఖతార్‌లో ఉద్యోగం చేస్తుండటంతో దాదాపు ఆరేళ్ల పాటు దూరంగా ఉంటూనే (Long distance relationship) తమ బంధాన్ని కొనసాగించారు.
"ఆంటోనీ క్రిస్టియన్ కావడం వల్ల మా ఇంట్లో పెద్ద ఎత్తున సమస్యలు ఎదురయ్యాయి. కుటుంబ సభ్యులను ఒప్పించడానికి నాకు చాలా సమయం పట్టింది" అని కీర్తిసురేష్ వివరించారు. తాను సినీ రంగానికి రాకముందే ఆయనకు తెలుసని, ఇద్దరం కలిసి ఎదుగుతూ ఒకరినొకరు అర్థం చేసుకున్నామని పేర్కొన్నారు.
{{/usCountry}}"ఆంటోనీ క్రిస్టియన్ కావడం వల్ల మా ఇంట్లో పెద్ద ఎత్తున సమస్యలు ఎదురయ్యాయి. కుటుంబ సభ్యులను ఒప్పించడానికి నాకు చాలా సమయం పట్టింది" అని కీర్తిసురేష్ వివరించారు. తాను సినీ రంగానికి రాకముందే ఆయనకు తెలుసని, ఇద్దరం కలిసి ఎదుగుతూ ఒకరినొకరు అర్థం చేసుకున్నామని పేర్కొన్నారు.
{{/usCountry}}టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారినా కూడా ఈ ప్రేమ వ్యవహారాన్ని 15 ఏళ్ల పాటు సినీ ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా ఉంచడం విశేషం. 2024 నవంబర్‌లో దీపావళి సందర్భంగా సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేస్తూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
గోవాలో గ్రాండ్ వెడ్డింగ్..
చివరకు ఇరు కుటుంబాల సమ్మతితో 2024 డిసెంబర్ 12న గోవా వేదికగా కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్ దంపతులు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తమిళ హిందూ, మలయాళ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం ఈ వివాహ వేడుకలు కన్నులపండువగా జరిగాయి. అత్యంత సన్నిహితులు, సినీ రంగానికి చెందిన కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.
ఓటీటీలో సందడి
ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌పై కూడా తన ముద్ర వేస్తున్నారు. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయిన 'అక్క' (Akka) సిరీస్‌లో రాధికా ఆప్టేతో కలిసి నటించారు. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో కీర్తి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కిన ఈ లేడీ ఓరియంటెడ్ సిరీస్‌తో డిజిటల్ మాధ్యమంలోనూ కీర్తి తన సత్తా చాటుతున్నారు.