బాలీవుడ్ క్యూట్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా గతేడాది తల్లిదండ్రులుగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 2025 జూలైలో వీరికి 'సారాయ మల్హోత్రా' జన్మించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అద్వానీ.. అమ్మనయ్యాక తనలో కలిగిన మార్పుల గురించి ఎంతో హృద్యంగా మాట్లాడారు.
మాతృత్వం తర్వాత కియారా కొత్త రూపం!

పిల్లలు పుట్టిన తర్వాత ఏ తల్లికైనా ప్రపంచం మారిపోతుంది. కియారా విషయంలోనూ అదే జరిగింది. "అమ్మనయ్యాక నాలో ఒక ఆడపులి (Tigress) మేల్కొన్నట్లు అనిపిస్తోంది. ఇప్పుడు నా జీవితాన్ని చూసే కోణమే మారిపోయింది. ఒకవైపు ఏదీ ముఖ్యం కాదనిపిస్తూనే, మరోవైపు ప్రతి చిన్న విషయం కూడా చాలా ముఖ్యం అనిపిస్తోంది. నా లోపల ఆ చిన్నారి నిరంతరం ఉంటూనే ఉంది" అని కియారా అద్వానీ తన భావాలను పంచుకున్నారు.
సిద్ధార్థ్‌తో పెళ్లి తర్వాత బంధం గురించి మాట్లాడుతూ.. "పెళ్లికి ముందు మా మధ్య ఉన్న సరదా కబుర్లు, కలిసి ప్రయాణాలు చేయడం.. ఇవేవీ మారలేదు. ఇప్పటికీ మేమిద్దరం కలిసి సినిమాలు చూస్తాం. నటీనటులుగా, సినిమా ప్రేమికులుగా ఆ చిత్రాల గురించి చర్చించుకోవడం మాకు చాలా ఇష్టం" అని కియారా అద్వానీ పేర్కొన్నారు.
షెర్షా సెట్స్ నుంచి సారాయ దాకా..
'షెర్షా' సినిమా షూటింగ్ సమయంలో మొదలైన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పరిచయం ప్రేమగా మారి 2023లో పెళ్లి పీటల దాకా వెళ్లింది. గతేడాది ఫిబ్రవరిలో గర్భవతిని అని ప్రకటించిన కియారా, జూలైలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ నెలలో తమ ముద్దుల కూతురికి 'సారాయ' అని పేరు పెట్టినట్లు ఈ జంట ప్రకటించింది.
యశ్ ‘టాక్సిక్’లో కియారా సందడి!
ఇక సినిమాల విషయానికి వస్తే.. కియారా అద్వానీ తదుపరి చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic) విడుదలకు సిద్ధమవుతోంది. కన్నడ స్టార్ హీరో యశ్ సరసన కియారా నటిస్తున్న ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, తార సుతారియా వంటి ముద్దుగుమ్మలు కూడా నటిస్తున్నారు.
{{/usCountry}}ఇక సినిమాల విషయానికి వస్తే.. కియారా అద్వానీ తదుపరి చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic) విడుదలకు సిద్ధమవుతోంది. కన్నడ స్టార్ హీరో యశ్ సరసన కియారా నటిస్తున్న ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, తార సుతారియా వంటి ముద్దుగుమ్మలు కూడా నటిస్తున్నారు.
{{/usCountry}}అయితే, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా యశ్ సినిమా విడుదల తేది మారింది. తొలుత మార్చి 19న 'ధురంధర్: ది రివెంజ్'తో పాటు విడుదల కావాల్సిన యశ్ మూవీని ఇప్పుడు జూన్ 4వ తేదీకి వాయిదా వేశారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాతో యశ్ దాదాపు నాలుగేళ్ల తర్వాత వెండితెరపై అలరించనున్నాడు.