బుల్లితెర స్టార్ సీరియల్ గుప్పెడంత మనసు నటి జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా "కిల్లర్". చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
పూర్వజ్ దర్శకత్వంలో కిల్లర్

జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా చేసిన కిల్లర్ సినిమాను థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్‌పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కిల్లర్ మూవీకి పూర్వజ్ దర్శకత్వం వహించారు.
కిల్లర్ ఫైర్ అండ్ ఐస్ సాంగ్ లాంచ్
త్వరలో కిల్లర్ మూవీని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల కిల్లర్ మూవీ నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ జ్యోతి పూర్వజ్‌పై యాక్షన్ కొరియోగ్రాఫర్ రాజ్ కుమార ప్రశంసలు కురిపించారు.
యాక్షన్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు
యాక్షన్ కొరియోగ్రాఫర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. "జ్యోతి గారు తనకు యాక్షన్ తెలియదు అనేవారు. కానీ, మేము 15 మందితో అటాక్ చేసే ఒక యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశాం. ఆ సీక్వెన్స్ రెడీ చేయడానికి మాకు 3 గంటలు టైమ్ పట్టింది. కానీ, జ్యోతి గారు వచ్చి అరగంటలో మొత్తం యాక్షన్ పార్ట్ చేశారు. మేము షాక్ అయ్యాం. ఈ సినిమాలో జ్యోతి గారు చేసిన యాక్షన్ సీక్వెన్సులకు మంచి రెస్పాన్స్ వస్తుంది" అని ప్రశంసించారు.
జ్యోతి కోసమైనా సినిమాను చూడాలి
ఇదే ఈవెంట్‌లో యాక్టర్ విశాల్ రాజ్ మాట్లాడుతూ.. "కిల్లర్ సినిమాలో జ్యోతి పూర్వజ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఆమె ఈ చిత్రంలో బాగా పర్ఫార్మ్ చేశారు. తన కోసమైనా ఈ సినిమాను మీరు చూడాలి" అని అన్నారు.
మనకెంతో ఫ్రీడమ్ ఇస్తారు
{{/usCountry}}ఇదే ఈవెంట్‌లో యాక్టర్ విశాల్ రాజ్ మాట్లాడుతూ.. "కిల్లర్ సినిమాలో జ్యోతి పూర్వజ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఆమె ఈ చిత్రంలో బాగా పర్ఫార్మ్ చేశారు. తన కోసమైనా ఈ సినిమాను మీరు చూడాలి" అని అన్నారు.
మనకెంతో ఫ్రీడమ్ ఇస్తారు
{{/usCountry}}"డైరెక్టర్ పూర్వజ్‌తో వర్క్ చేయడం ఏ నటుడికైనా సులువు. మనకెంతో ఫ్రీడమ్ ఇస్తారు. మీతో పాటే నేను ఈ సాంగ్ చూస్తున్నా. డైరెక్టర్ పూర్వజ్ ఇంకా పెద్ద మూవీస్ చేయాలని కోరుకుంటున్నా" అని నటుడు విశాల్ రాజ్ తెలిపారు.
నటుడు కావాలనేది అమ్మ డ్రీమ్
నటుడు గౌతమ్ చక్రధర్ మాట్లాడుతూ.. "నేను యాక్టర్ కావాలనేది మా అమ్మ డ్రీమ్. ఈ సినిమాతో నన్ను తెరపై చూసుకోబోతున్నా. ఈ చిత్రంలో బ్యూటిఫుల్ విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ పార్ట్స్ ఉంటాయి. వాటి కోసం టీమ్ ఎంత కష్టపడ్డారో మీరు ఊహించుకోవచ్చు. డైరెక్టర్ పూర్వజ్ మనందరికీ నచ్చేలా ఈ సినిమాను రూపొందించారు" అని తెలిపారు.