...
...
Next Story

Latheesh: ఉప్పు దొంగతనం చేసి తిన్న రోజులున్నాయి, నిర్మాత కూడా నన్నే డబ్బులు అడిగాడు: తిమ్మరాజుపల్లి టీవీ విలన్ లతీష్

Thimmarajupalli TV Actor Latheesh About His Career Struggles: హీరో కిరణ్ అబ్బవరంగా నిర్మాతగా మారి నిర్మించిన లేటెస్ట్ మూవీ తిమ్మరాజుపల్లి టీవీ. ఈ సినిమాలో విలన్‌గా చేసిన లతీష్ తన కెరీర్‌లో పడిన ఇబ్బందులు, కష్టాల గురించి తాజాగా చెప్పుకొచ్చారు. మరి ఆ విశేషాలు చూద్దాం.

Published on: May 3, 2026, 12:49:41 IST
Advertisement

Thimmarajupalli TV Villain Latheesh About His Career Struggles: తెలుగులో రూరల్ కామెడీ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ చిత్రానికి మంచి విజయం దక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో నిర్మాతగా మారిన హీరో కిరణ్ అబ్బవరం దాదాపుగా 50 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తెలుగు వెండితెరకు పరిచయం చేశారు.

దక్కిన మొదటి విజయంపై లతీష్

ఉప్పు దొంగతనం చేసి తిన్న రోజులున్నాయి, నిర్మాత కూడా నన్నే డబ్బులు అడిగాడు: తిమ్మరాజుపల్లి టీవీ విలన్ లతీష్
ఉప్పు దొంగతనం చేసి తిన్న రోజులున్నాయి, నిర్మాత కూడా నన్నే డబ్బులు అడిగాడు: తిమ్మరాజుపల్లి టీవీ విలన్ లతీష్

ఈ సినిమాలో విలన్ పాత్రలో సిద్ధయ్యగా నటించిన యాక్టర్ లతీష్ మంచి పేరుని సంపాదించుకున్నారు. తనకు దక్కిన ఈ మొదటి విజయం గురించి చెబుతూ తన సంతోషాన్ని పంచుకున్నారు. తిమ్మరాజుపల్లి టీవీ విలన్ పాత్ర చేసిన లతీష్ చెప్పిన విశేషాలపై లుక్కేద్దాం.

మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి?

నగరిలో మాది వ్యవసాయ ఆధారిత నిరుపేద కుటుంబం. ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజులున్నాయి. మమ్మల్ని మా అమ్మనాన్న, అన్నయ్య కష్టపడి చదివించారు. నేను సినిమాల్లోకి వచ్చానని మా అన్నయ్య నాతో మాట్లాడటం మానేశాడు. కానీ ఈ సినిమా చూసి, అందులో నా పర్ఫామెన్స్ చూసి మాట్లాడాడు. ఈ ప్రయాణంలో నాకు ఎప్పుడూ కూడా అండగా నిలబడిన వారిలో అక్క చాముండేశ్వరి, మామ కోటేశ్వరరావు ముందుంటారు.

మీ సినిమా ప్రయాణం గురించి చెప్పండి?

బెంగళూరులో కొన్ని రోజులు ఉద్యోగం చేశాను. 2017లో హైదరాబాద్‌కి వచ్చాను. అప్పటి నుంచే సినిమాల్లో నటించాలని ప్రయత్నించాను. అందరూ నా యాక్టింగ్ బాగానే ఉందని చెప్పారు. కానీ, ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. మహిపాల్ గారి వద్ద కొన్ని రోజులు అసిస్టెంట్‌గా పని చేశాను. ఆ తరువాత కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. ఆ టైంలో యూట్యూబ్‌లోనే ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి యాక్ట్ చేశాను. మళ్లీ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేశాను.

ఈ జర్నీలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి?

బీ స్టూడియోలో యాక్టింగ్ కోర్స్ కోసం లక్ష రూపాయలు అడిగారు. డబ్బులున్న వాళ్లకేనా ఈ యాక్టింగ్ అని నేను ధీనంగా అడిగాను. వెంటనే నా దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా నా కమిట్‌మెంట్‌ని చూసి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడే నేను పదుల సంఖ్యలో నాటకాలు వేశాను. ఆ నాటకాలు వేస్తున్నప్పుడే ‘తిమ్మరాజు పల్లి టీవీ’ అసోసియేట్ డైరెక్టర్స్ చూశారు. అక్కడే మా అందరినీ చూసి ఆడిషన్స్ తీసుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe