ప్రపంచమంతా కొత్త ఏడాది వేడుకల్లో, పార్టీల్లో మునిగితేలుతుంటే.. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి మాత్రం ప్రశాంతతను కోరుకున్నారు. ఆర్భాటాలకు దూరంగా, తమ ముద్దుల కూతురు 'ఇవారా' (Evaarah) తో కలిసి సముద్రపు అలల సాక్షిగా 2026కి స్వాగతం పలికారు.
ప్రేమతో నిండిన 2026

ఈ బీచ్ వెకేషన్‌కు సంబంధించిన కొన్ని అందమైన ఫోటోలను అతియా శెట్టి గురువారం (జనవరి 1) ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "2026.. మా హృదయాలు నీకోసం వేచి చూస్తున్నాయి" అనే అర్థం వచ్చేలా అతియా శెట్టి పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నెటిజన్ల మనసు గెలుచుకున్న దృశ్యం
సముద్రపు నీటి అంచున నిలబడి ఉన్న ఈ జంట, తమ చిన్నారిని ఎత్తుకుని ప్రకృతిని ఆస్వాదిస్తున్న దృశ్యం నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఇదిలా ఉంటే, ఒక ఫోటోలో కేఎల్ రాహుల్ క్యాజువల్ టీ-షర్ట్, షార్ట్స్‌లో కనిపిస్తుండగా, అతియా శెట్టి తన కూతురిని గుండెలకు హత్తుకుని ఉంది.
ఫ్యాన్స్ ఫిదా
మరో వీడియోలో రాహుల్ చేతిని పట్టుకుని అతియా శెట్టి బీచ్ వెంబడి నడుస్తున్న దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది. చాలా కాలం తర్వాత ఈ క్రేజీ కపుల్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి తమ చిన్నారితో కలిసి కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
అత్యంత క్యూట్ ఫొటో ఇదే
"ఇంటర్నెట్‌లో ఈరోజే చూసిన అత్యంత క్యూట్ ఫోటో ఇదే", "మీ ముగ్గురికీ ఎప్పుడూ ఆనందం కలగాలి" అంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. కాగా, బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయిన అతియా శెట్టి, కేఎల్ రాహుల్‌ను 2023 జనవరిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
దేవుడు ఇచ్చిన వరం ‘ఇవారా’
ఖండాలాలోని సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో కేఎల్ రాహుల్, అతియా శెట్టి వివాహం అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా జరిగింది. అనంతరం 2024 నవంబర్‌లో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. అనంతరం 2025 మార్చిలో ఇవారాకు ఈ దంపతులు జన్మనిచ్చారు. 'ఇవారా' అంటే 'దేవుడు ఇచ్చిన వరం' అని అర్థం వస్తుంది.
{{/usCountry}}ఖండాలాలోని సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో కేఎల్ రాహుల్, అతియా శెట్టి వివాహం అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా జరిగింది. అనంతరం 2024 నవంబర్‌లో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. అనంతరం 2025 మార్చిలో ఇవారాకు ఈ దంపతులు జన్మనిచ్చారు. 'ఇవారా' అంటే 'దేవుడు ఇచ్చిన వరం' అని అర్థం వస్తుంది.
{{/usCountry}}అతియా శెట్టి సినిమాలు
సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న అతియా, ప్రస్తుతం తన కుటుంబంతో గడుపుతున్న మధుర క్షణాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉంటే సునీల్ శెట్టి కుమార్తెగా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెట్టింది అతియా శెట్టి. హీరో, మోతిచూర్ చక్నాచూర్, ముబారకన్, నవాబ్‌జాదే వంటి హిందీ చిత్రాల్లో నటించింది.