...
...
Next Story

ఈ కుర్రాడు నానిని క్రాస్ చేయగలడు..పెద్ద స్టార్ అయిపో పని ఉందని త్రివిక్రమ్ అంటున్నాడు..యంగ్ హీరోపై కోన వెంకట్ కామెంట్లు

టాలీవుడ్ నేచురల్ స్టార్ నానికి ఫ్యాన్స్ లో అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ నాని స్టార్ డమ్ పెంచుకుంటున్నాడు. అలాంటి నానిని దాటేసే సత్తా ఓ యంగ్ హీరోకు ఉందంటూ మాటల రచయిత, నిర్మాత కోన వెంకట్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

Published on: Feb 14, 2026, 17:28:04 IST
Advertisement

ఓ యంగ్ హీరోపై పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ ప్రశంసలు కురిపించేశాడు. ఆ కుర్రాడు నేచురల్ స్టార్ నానినే దాటేస్తాడని పేర్కొన్నాడు. కథా రచయిత, ప్రొడ్యూసర్ కోన వెంకట్ ఇంతలా పొగిడేసిన ఆ యువ హీరో ఏవరో కాదు.. అతనే హర్ష్ రోషన్. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న ‘బ్యాండ్ మేళం’ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్లో కోన వెంకట్ ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

కోన వెంకట్ కామెంట్లు

కోన వెంకట్
కోన వెంకట్

వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న బ్యాండ్ మేళం మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో కోన వెంకట్ కామెంట్లు వైరల్ గా మారాయి. ‘‘ఇది మీకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ గ్లింప్స్ ను ఫస్ట్ డైరెక్టర్ బాబీకి చూపించా. అతను మరోసారి ప్లే చేయమన్నాడు. ‘ఏం ఆర్టిస్ట్ సార్ ఇతను, రోషన్ మరో నాని అవుతాడు’ అని నాకు బాబీ చెప్పాడు’’ అని కోన వెంకట్ అన్నాడు.

నానిని దాటేసి

‘‘అతను (హర్ష్ రోషన్) తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో నాని అని చెప్పడంలో సందేహం లేదు. అతను సైలెంట్ గా నాని కూడా క్రాస్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. క్రాస్ కూడా చేయగలడు. త్రివిక్రమ్ ఇంతకుముందే మాట్లాడాడు. ‘నువ్వు త్వరగా పెద్ద స్టార్ అయిపోవాలి, పని ఉంది నీతోని’ అని రోషన్ గురించి త్రివిక్రమ్ అంటున్నాడు. నిన్ను కోరి సినిమాలాగా బ్యాండ్ మేళం కూడా సూపర్ హిట్ అవుతుంది’’ అని కోన వెంకట్ తెలిపాడు.

బ్యాండ్ మేళం మూవీ

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన హర్ష్ రోషన్ ఇప్పుడు హీరోగా మారాడు. కోర్ట్ సినిమాతో తన క్రేజ్ మరింత పెంచుకున్నాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్, అర్ధ శతాబ్దం, మిషన్ ఇంపాజిబుల్, మిస్ పర్ఫెక్ట్, సరిపోదా శనివారం, సలార్ తదితర సినిమాల్లో హర్ష్ రోషన్ నటించాడు. ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చిన ఏఐఆర్ సిరీస్ లోనూ లీడ్ రోల్ ప్లే చేశాడు. ఇప్పుడు బ్యాండ్ మేళం మూవీతో థియేటర్లకు రాబోతున్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks