కాంగ్రెస్ అగ్రనతే సోనియా గాంధీపై బయోపిక్ తీస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గతంలోనే ప్రకటించారు. సోనియా గాంధీ ఆత్మకథ Belonging: A Journey of Love పుస్తకంలోని ప్రధాన అంశాలను తీసుకుని సినిమా నిర్మించేందుకు జగ్గారెడ్డి తీసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రాంతి మాధవ్‌ను ఎంపిక చేసినట్లు జగ్గారెడ్డి వెల్లడించారు.

గతంలో ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రాంతి మాధవ్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను తీసేందుకు సోనియా గాంధీ అనుమతి తీసుకునేందుకు డిసెంబర్ 10వ తేదీన జగ్గారెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. సినిమా నిర్మాణానికి సంబంధించి సోనియా గాంధీని స్వయంగా కలిసి, ఆమె అనుమతి తీసుకోనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. గాంధీ కుటుంబ ప్రేమ, త్యాగాలు, దేశ సేవే ప్రధాన కథాంశం మూవీ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో ప్రధానంగా సోనియా గాంధీ–రాజీవ్ గాంధీల ప్రేమకథ చూపిస్తారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల మరణం, గాంధీ కుటుంబం దేశానికి చేసిన త్యాగాలు, సేవలు మెయిన్ ప్లాట్‌గా తీసుకుంటారు. అంతేకాదు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల అనంతరం సోనియా గాంధీ దేశం కోసం చేసిన సేవలను ప్రత్యేకంగా చూపిస్తారు. ప్రజల కోసం సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యం, ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన నిర్ణయాన్ని చెప్పనున్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం సోనియా గాంధీ తీసుకున్న సంచలన నిర్ణయాలు.. ఇవన్నీ సినిమాలో స్పష్టంగా ఆవిష్కరించనున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు.
ఆత్మకథలోని భావాలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ బయోపిక్ తీయనున్నట్టుగా జగ్గారెడ్డి తెలిపారు. సోనియా గాంధీ గారు రచించిన Belonging: A Journey of Love ఆత్మకథలోని ప్రధాన అంశాలు, ఆమె జీవిత ప్రయాణం దేశ, విదేశీ ప్రజలకు మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మిస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు.
{{/usCountry}}ఆత్మకథలోని భావాలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ బయోపిక్ తీయనున్నట్టుగా జగ్గారెడ్డి తెలిపారు. సోనియా గాంధీ గారు రచించిన Belonging: A Journey of Love ఆత్మకథలోని ప్రధాన అంశాలు, ఆమె జీవిత ప్రయాణం దేశ, విదేశీ ప్రజలకు మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మిస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు.
{{/usCountry}}'ఎలాంటి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఆశించకుండా సినిమా నిర్మాణం చేస్తాం. ఎవరి నుంచీ ఒక్క పైసా కూడా తీసుకోకుండా, సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన 50 మంది కార్యకర్తలతో ఫైనాన్స్ కమిటీ ఏర్పాటు చేసి సొంత నిధులతోనే ఈ సినిమాను నిర్మిస్తాం. గాంధీ కుటుంబ త్యాగాలను, సోనియా గాంధీ జీవిత ప్రయాణాన్ని భావితరాలకు అందించే ఒక గొప్ప ప్రయత్నం ఇది.' అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్లో సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని జగ్గారెడ్డి గతంలోనే పిలుపునిచ్చారు. ఆయన పిలుపుకు స్పందించిన నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ జూలకంటి ఆంజనేయులు, సినిమా నిర్మాణం కోసం అప్పుడే రూ. 2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు 50 మంది సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి సూచించారు. గాంధీ భవన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్ఓ) హరిప్రసాద్ ఈ కమిటీ బాధ్యతలను పర్యవేక్షిస్తారు.
'ఎన్నికల సమయంలో మీరు ఖర్చు చేస్తారు కదా? ఇది కూడా అలాంటి ఒక ముఖ్యమైన ఖర్చుగానే అనుకోండి. అందరం కలిసి బడ్జెట్ సమకూర్చుకుందాం.. ఒక మంచి దర్శకుడిని ఎంపిక చేద్దాం.' అని జగ్గారెడ్డి గతంలోనే ప్రకటించారు. ఏర్పాట్లు పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.
ABOUT THE AUTHOR
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.