Kriti Sanon Boyfriend: కబీర్ బహియా పుట్టినరోజును పురస్కరించుకుని కృతి సనన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక క్యూట్ ఫొటోను షేర్ చేసింది. బీచ్ వెకేషన్‌లో కబీర్ ఎంతో సరదాగా ఉన్న ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ, "హ్యాపీ బర్త్‌డే క్యూటీ" (Happy Birthday cutie) అని రాసుకొచ్చారు. అంతేకాకుండా దానికి ఒక హార్ట్ ఎమోజీతో పాటు, దిష్టి తగలకుండా ఉండే ఈవిల్-ఐ (Evil-eye) ఎమోజీని కూడా జత చేశారు.
కృతి క్లారిటీ ఇచ్చేసిందా?

ఇటీవల దీపావళి వేడుకల్లో కూడా కృతి సనన్, కబీర్ కలిసి సందడి చేసిన విషయం తెలిసిందే. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు కబీర్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. "నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులతో నా ఫేవరెట్ సమయం" అని కృతి క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు బర్త్ డే పోస్టుతో తన రిలేషన్ షిప్ పై కృతి క్లారిటీ ఇచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
పెళ్లి తర్వాతే దానిపై మాట్లాడతా!
గతంలో ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కబీర్ బహియాతో ఉన్న రిలేషన్‌షిప్ గురించి కృతి సనన్‌కు ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె స్పందిస్తూ.. "కనీసం నాకు పెళ్లయ్యే వరకు నా వ్యక్తిగత జీవితం గురించి బయట మాట్లాడాలని అనుకోవడం లేదు. నాకు పెళ్లయిన రోజున కచ్చితంగా దీని గురించి మాట్లాడతాను. కొన్ని విషయాలు నాకు, నా సన్నిహితులకు మాత్రమే పరిమితమై ఉండాలి" అని స్పష్టం చేశారు.
ఎవరీ కబీర్ బహియా?
లండన్‌కు చెందిన కబీర్ బహియా ఒక ప్రముఖ వ్యాపారవేత్త. కబీర్ 2020లో స్థాపించిన 'వరల్డ్‌వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజం లిమిటెడ్' (Worldwide Aviation and Tourism Limited) సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గాlp వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ ఎయిర్‌లైన్ రిప్రజెంటేషన్ సేవలను అందిస్తుంది.
{{/usCountry}}లండన్‌కు చెందిన కబీర్ బహియా ఒక ప్రముఖ వ్యాపారవేత్త. కబీర్ 2020లో స్థాపించిన 'వరల్డ్‌వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజం లిమిటెడ్' (Worldwide Aviation and Tourism Limited) సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గాlp వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ ఎయిర్‌లైన్ రిప్రజెంటేషన్ సేవలను అందిస్తుంది.
{{/usCountry}}యూకేలోని ప్రముఖ ట్రావెల్ కంపెనీ ‘సౌతాల్ ట్రావెల్’ యజమాని కుల్జిందర్ బహియా కుమారుడే ఈ కబీర్.
రెండేళ్లుగా
గత రెండేళ్లుగా కృతి, కబీర్ పలు పార్టీలు, ఫ్యామిలీ ఫంక్షన్లలో కలిసి కనిపిస్తున్నారు. ముఖ్యంగా కృతి చెల్లెలు నుపుర్ సనన్ వివాహ వేడుకల్లో కబీర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, ఇప్పటివరకు వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ధృవీకరించలేదు.
కృతి సనన్ సినిమాలు
కెరీర్ పరంగా కృతి సనన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది జూన్ 5న విడుదలైన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై', ఆ తర్వాత జూన్ 19న థియేటర్లలోకి వచ్చిన రొమాంటిక్ డ్రామా 'కాక్‌టెయిల్ 2' చిత్రాలతో ఆమె ప్రేక్షకులను అలరించారు. 'కాక్‌టెయిల్ 2'లో షాహిద్ కపూర్, రష్మిక మందన్న కీలక పాత్రలు పోషించారు.
ప్రస్తుతం కృతి సనన్ ప్రముఖ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఒక హారర్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఆమె కెరీర్‌లో తొలి పూర్తిస్థాయి హారర్ చిత్రం ఇదే కావడం విశేషం. మాడాక్ ఫిల్మ్స్‌తో కృతికి ఇది తొమ్మిదో సినిమా.