...
...
Next Story

OTT: నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1 సిరీస్‌గా ట్రెండింగ్- వేలాది మంది యోధుల ప్రతిబింబమే రాకా, భార్య నేర్పిన యాస: కునాల్ ఠాకూర్

Kunal Thakur On Netflix OTT Series Glory As Boxer: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మే 1న స్ట్రీమింగ్‌కు వచ్చిన స్పోర్ట్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గ్లోరీ. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో నెంబర్ 1 స్థానంలో ఓటీటీ ట్రెండింగ్ అవుతోన్న ఈ సిరీస్‌లో బాక్సర్‌గా తాను పడిన కష్టం గురించి నటుడు కునాల్ ఠాకూర్ చెప్పాడు.

Published on: May 14, 2026, 11:45:18 IST
Advertisement

Kunal Thakur On Netflix OTT Series Glory: ఇటీవల ఓటీటీలోకి మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న స్పోర్ట్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గ్లోరీ. నెట్‌ఫ్లిక్స్‌లో మే 1 నుంచి గ్లోరీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియాలోనే నెంబర్ వన్ సిరీస్‌గా గ్లోరీ ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. అలాంటి ఈ ఓటీటీ సిరీస్‌లో నటీనటుల యాక్టింగ్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు.

కునాల్ ఠాకూర్ నటన మరో ఎత్తు

నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1 సిరీస్‌గా ట్రెండింగ్- వేలాది మంది యోధుల ప్రతిబింబమే రాకా, భార్య నేర్పిన యాస: కునాల్ ఠాకూర్
నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1 సిరీస్‌గా ట్రెండింగ్- వేలాది మంది యోధుల ప్రతిబింబమే రాకా, భార్య నేర్పిన యాస: కునాల్ ఠాకూర్

ఇందులో దివ్యేందు, సువిందర్ విక్కీ, పుల్కిత్ సామ్రాట్ వంటి హేమాహేమీల నటన ఒక ఎత్తు అయితే.. రాకా పాత్రలో కనిపించిన కునాల్ ఠాకూర్ తనదైన ముద్ర వేశారు. ఈ ఓటీటీ సిరీస్ కోసం ఆయన కేవలం నటించడమే కాదు, ఒక నిజమైన బాక్సర్‌లా మారడానికి చేసిన ప్రయత్నాలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.

8 నెలల కఠిన శ్రమ.. బాక్సర్‌గా రూపాంతరం

రాకా పాత్ర కోసం కునాల్ ఠాకూర్ సుమారు 7 నుంచి 8 నెలల పాటు తీవ్రమైన శారీరక శిక్షణ తీసుకున్నారు. ఈ మార్పు చూసి ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు సైతం అవాక్కయ్యారట.

"రాకా పాత్రలోకి మారకముందు నేను ఎలా ఉండేవాడినో తెలిసిన వారు నా ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి షాక్ అయ్యారు. ఒక బాక్సర్‌లా మారడానికి నాకు 8 నెలల సమయం పట్టింది. ప్రతి నటుడికి ఇలాంటి లగ్జరీ ఉండదు" అని కునాల్ ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశారు.

కేవలం ఫైటర్‌లా కనిపించడం మాత్రమే కాదు, బాక్సర్ బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా ఒంటబట్టించుకోవాలని మేకర్స్ పట్టుబట్టారని, అందుకే అంతలా కష్టపడ్డానని ఆయన వివరించారు. శిక్షణ సమయంలో బాక్సింగ్‌పై ఎంత ప్రేమ పెరిగిందంటే.. షూటింగ్ లేకపోయినా గాలిలో షాడో బాక్సింగ్ చేసేలా అలవాటు పడిపోయానని ఆయన సరదాగా చెప్పుకొచ్చారు.

భార్య నేర్పిన హర్యానా మాండలికం

"నాకు హర్యానా భాష రాదు. నా భార్య ముక్తిది సగం హర్యానా నేపథ్యం కావడంతో, ఆడిషన్స్ సమయంలో ఆమె నాకు ఆ యాసను నేర్పించింది" అని కునాల్ వెల్లడించారు. ముక్తి చేసిన సాయం వల్లే తాను ఆడిషన్‌లో దర్శకుడు కరణ్ అన్షుమన్‌ను మెప్పించి, ఈ పాత్రను దక్కించుకోగలిగినట్లు తెలిపారు కునాల్ ఠాకూర్.

వెలుగు చూడని వేలాది బాక్సర్ల కథ 'రాకా'

మన దేశంలో హర్యానా లాంటి ప్రాంతాల నుంచి ఎంతోమంది యువకులు బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటారు. వారి లక్ష్యం కేవలం పతకాలు గెలవడం మాత్రమే కాదు, ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించి తమ కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడం. రాకా పాత్ర కూడా ఇలాంటి వేలాది మంది పోరాట యోధుల ప్రతిబింబమేనని కునాల్ పేర్కొన్నారు.

"రాకా పాత్ర చాలా మౌనంగా ఉంటుంది, కానీ ఆ కళ్లలో ఒక తపన కనిపిస్తుంది. బాక్సింగ్ రింగ్‌లో కోచ్‌తో ఉండే క్రమశిక్షణను, గౌరవాన్ని చూపించడానికి నేను నా కోచ్ కళ్లలోకి చూడకుండా నటించాను" అని పాత్రలోని లోతును వివరించారు.

క్రీడారంగంలో ఉండే రాజకీయాల వల్ల (Sports Politics) నిజమైన ప్రతిభ ఉన్నవారు వెనుకబడిపోయి, పలుకుబడి ఉన్నవారు ఎలా ముందుకు వెళ్తారో ఈ ఓటీటీ సిరీస్‌లో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ పాత్ర కోసం తాను రోహిత్ టోకాస్, ఆకాష్ సాంగ్వాన్ వంటి నిజమైన బాక్సర్లను కలిసి వారి కష్టాలను, వైఫల్యాలను దగ్గరగా గమనించినట్లు కునాల్ ఠాకూర్ తెలిపారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. నెట్‌ఫ్లిక్స్ 'గ్లోరీ' సిరీస్‌లో కునాల్ ఠాకూర్ పాత్ర ఏమిటి?

కునాల్ ఠాకూర్ ఇందులో 'రాకా' అనే బాక్సర్ పాత్రలో నటించారు. ఈ పాత్ర క్రీడారంగంలో రాజకీయాల బాధితుడిగా, ఒక ప్రతిభావంతుడైన క్రీడాకారుడిగా కనిపిస్తుంది.

2. కునాల్ ఠాకూర్‌కు హర్యానా భాష ఎవరు నేర్పించారు?

కునాల్ భార్య, ప్రముఖ నటి డాన్సర్ ముక్తి మోహన్ ఆయనకు హర్యానా మాండలికం నేర్చుకోవడంలో సహాయపడ్డారు.

3. రాకా పాత్ర కోసం కునాల్ ఎంత కాలం శిక్షణ తీసుకున్నారు?

ఒక నిజమైన బాక్సర్ బాడీ లాంగ్వేజ్, ఫిజిక్ సాధించడం కోసం కునాల్ సుమారు 8 నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నారు.

4. 'గ్లోరీ' సిరీస్ ప్రధాన ఇతివృత్తం ఏమిటి?

ఇది బాక్సింగ్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. క్రీడల్లో ఉండే అంతర్గత రాజకీయాలు, క్రీడాకారుల వ్యక్తిగత పోరాటాలు, విజయం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks