Kuttram Purindhavan OTT Review In Telugu: సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు లేదా సిరీస్‌లు అనగానే "ఈ హత్య ఎవరు చేశారు?" అనే పాయింట్ చుట్టూనే కథ సాగుతుంది. అయితే నేరం ఎవరు చేశారనే దానికంటే.. ఆ నేరం వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఆ తప్పు వల్ల కలిగే నేరభావన (Guilt) మనిషి జీవితాన్ని, ఆలోచనలను ఎలా నరకంగా మారుస్తుందనే కొత్త కోణాన్ని ఆవిష్కరించింది ‘కుట్రం పురిందవన్: ది గిల్టీ వన్’ (Kuttram Purindhavan: The Guilty One).
థ్రిల్లర్ లవర్స్‌ను ఆకట్టుకుంటూ

ప్రస్తుతం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఓటీటీ సిరీస్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దర్శకుడు సెల్వమణి మునియప్పన్ తెరకెక్కించిన ఈ 7 ఎపిసోడ్ల కథనం మొదటి నిమిషం నుంచే వీక్షకులను కథలో మమేకం చేస్తుంది. ఒక హత్య, చిన్నారి కిడ్నాప్ అంశాల చుట్టూ సాగే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఇది. కుట్రం పురిందవన్ ఓటీటీ రివ్యూలోకి వెళితే..
ఒక్కొక్కరి చీకటి రహస్యాలు
ఓ వైపు గ్రామంలో పండుగ ఉత్సాహంగా సాగుతుండగా, మరోవైపు ఒక వ్యక్తి తన ఇంటి ముందే శవమై కనిపిస్తాడు. అదే సమయంలో అతని చిన్నారి కూతురు వింతగా మాయమవుతుంది. అక్కడి నుంచి మొదలైన పోలీస్ విచారణలో గ్రామంలోని ఒక్కొక్కరి రహస్యాలు, అబద్ధాలు, స్వార్థ ప్రయోజనాలు, వారిలోని చీకటి కోణాలు బయటపడతాయి. మనుషులు ఆవేశంలో లేదా మంచి ఉద్దేశంతో చేసే చిన్న తప్పులు వారిని ఎలా ఊబిలోకి నెడతాయో ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు.
పశుపతి నటన.. సిరీస్‌కే ప్రధాన బలం
తెలుగు ప్రేక్షకులకు 'సర్పాట్ట పరంబర', 'మావీరన్' చిత్రాలతో సుపరిచితమైన విలక్షణ నటుడు పశుపతి ఇందులో భాస్కరన్ పాత్రలో జీవించారు. తన కళ్లతో, ముఖంలో ఒలికించిన భావోద్వేగాలతో ఒక తండ్రి పడే తపనను, నేరభావనతో అనుభవించే నరకాన్ని అద్భుతంగా పండించారు.
ఇక పోలీస్ ఆఫీసర్‌గా నటించిన విధార్థ్ తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేశారు. ఒక సాధారణ మనిషి ఎదుర్కొనే గందరగోళాన్ని, వృత్తిధర్మానికి మధ్య నలిగిపోయే తీరును ఆయన సహజంగా ఆవిష్కరించారు.
ఉత్కంఠ రేపే కథనం.. అద్భుతమైన సంగీతం
{{/usCountry}}ఇక పోలీస్ ఆఫీసర్‌గా నటించిన విధార్థ్ తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేశారు. ఒక సాధారణ మనిషి ఎదుర్కొనే గందరగోళాన్ని, వృత్తిధర్మానికి మధ్య నలిగిపోయే తీరును ఆయన సహజంగా ఆవిష్కరించారు.
ఉత్కంఠ రేపే కథనం.. అద్భుతమైన సంగీతం
{{/usCountry}}కేవలం మర్డర్ మిస్టరీగానే కాకుండా మానసిక సంఘర్షణ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఎస్.ఎన్. ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సిరీస్‌లోని డార్క్, సస్పెన్స్ మూడ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. దర్శకుడు సెల్వమణి కథనాన్ని ఎక్కడా అనవసరపు వేగంతో కాకుండా, ప్రతి సన్నివేశానికి తగిన ప్రాధాన్యం ఇస్తూ నెమ్మదిగా ఉత్కంఠ పెంచేలా తీర్చిదిద్దారు.
ఐఎమ్‌డీబీ రేటింగ్
ఇలా ఆకట్టుకునే సీన్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కలగలపిన ఈ కుట్రం పురిందవన్ సిరీస్‌కు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.7 రేటింగ్ వచ్చింది. ఇంతటి క్రేజ్ ఉన్న కుట్రం పురిందవన్ ఓటీటీలో అదరగొడుతోంది.
కుట్రం పురిందవన్ ఓటీటీ స్ట్రీమింగ్
ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ సోనీ లివ్‌లో కుట్రం పురిందవన్ ది గిల్టీ వన్ ఓటీటీ రిలీజ్ అయింది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ వంటి నాలుగు భాషల్లో సోనీ లివ్‌లో కుట్రం పురిందవన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. నిలకడగా సాగుతూ చివరి వరకు ఆసక్తి రేకెత్తించే థ్రిల్లర్లను కోరుకునే వారికి కుట్రం పురిందవన్ ఒక గొప్ప థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుంది.