Lara Dutta About Deepika Padukone: సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో నటీనటులు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు కానీ, ఆ కెమెరా వెనుక వారు పడే శ్రమ, ఆరోగ్య సమస్యలు ప్రేక్షకులకు పెద్దగా తెలియవు. 2010లో వచ్చిన 'హౌస్‌ఫుల్' సినిమా షూటింగ్ సమయంలో దీపికా పదుకొణె ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మరో హీరోయిన్ లారా దత్తా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. లండన్ షెడ్యూల్ సమయంలో దీపికా పదుకొణెకు మలేరియా సోకింది. వణుకు పుట్టించే జ్వరం ఉన్నా దీపికా ఏమాత్రం వెనక్కి తగ్గలేదని లారా కొనియాడారు.
వణుకుతున్నా ఆగని షూటింగ్

దీపికా పదుకొణె అంకితభావం గురించి లారా దత్తా మాట్లాడుతూ.. "షూటింగ్ జరుగుతున్నప్పుడు దీపికాకు మలేరియా సోకింది. ఆమె నీరసించిపోయి నడవలేని స్థితిలో ఉన్నారు. రాత్రంతా జ్వరంతో వణుకుతూ ఉండేవారు. వైద్యులు వచ్చి మందులు ఇస్తున్నా, మరుసటి రోజు ఉదయం కల్లా మేకప్ వేసుకుని సెట్స్‌లో ఉండేవారు" అని చెప్పారు.
"ఎందుకంటే ఆ షెడ్యూల్‌లో చాలా మంది నటీనటులు ఉండటంతో పాటు డేట్స్ కుదరడం కష్టం. ఆ సమయంలో కొన్ని ఎమోషనల్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. తన వల్ల షూటింగ్ ఆగకూడదనే ఉద్దేశంతో ఆమె తన శక్తినంతా కూడగట్టుకుని నటించారు. ఆమె నటనలో ఎక్కడా జబ్బు పడిన ఆనవాళ్లు కనిపించకపోవడం గమనార్హం" అని లారా దత్తా పేర్కొన్నారు.
స్టార్లతో కళకళలాడిన 'హౌస్‌ఫుల్'
ఇదిలా ఉంటే, సాజిద్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన హౌస్‌ఫుల్ సినిమా బాలీవుడ్‌లో ఒక పెద్ద కామెడీ ఫ్రాంచైజీకి పునాది వేసింది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అర్జున్ రాంపాల్, బోమన్ ఇరానీ, లారా దత్తా, దీపికా పదుకొణె వంటి భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కింది.
రూ. 45 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. దురదృష్టవంతుడైన ఓ యువకుడు, తన అదృష్టాన్ని మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు, అందులో వచ్చే కామెడీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
తిరుగులేని ఫ్రాంచైజీగా..
{{/usCountry}}రూ. 45 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. దురదృష్టవంతుడైన ఓ యువకుడు, తన అదృష్టాన్ని మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు, అందులో వచ్చే కామెడీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
తిరుగులేని ఫ్రాంచైజీగా..
{{/usCountry}}2010లో మొదలైన ఈ ప్రయాణం 2012, 2016, 2019, 2025 ఏళ్లలో వరుసగా సీక్వెల్స్‌తో కొనసాగింది. గతేడాది విడుదలైన 'హౌస్‌ఫుల్ 5' కూడా అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రేక్షకులను అలరించింది. 16 ఏళ్లు గడిచినా 'హౌస్‌ఫుల్' మొదటి భాగం నేటికీ బుల్లితెరపై కనిపిస్తే ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతూనే ఉంది. లారా దత్తా చెప్పిన ఈ విషయంతో దీపికా పదుకోణె ప్రొఫెషనలిజం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.