...
...
Next Story

Mad For Each Other: బిగ్‌బాస్ లాంటి గేమ్ షో-సింగిల్ కాదు జోడీలు-ఒకే ఇంట్లో 10 వారాలు-జ‌డ్జీగా బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్టర్

బిగ్ బాస్ లాంటి సూపర్ హిట్ రియాలిటీ షోను ప్రసారం చేసే స్టార్ మా మరో రియాలిటీ షోతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. బిగ్ బాస్ కాన్సెప్ట్ లాంటిదే కానీ సింగిల్ గా కాకుండా జోడీలను ఒకే ఇంట్లో ఉంచి కాంపిటేషన్ పెట్టబోతున్నారు. ఈ షోకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ జడ్జీగా వ్యవహరించనున్నాడు.

Published on: Feb 28, 2026, 19:46:49 IST
Advertisement

బిగ్ బాస్ తో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసే స్టార్ మా మరో కొత్త రియాలిటీ షోతో రెడీ అవుతోంది. ప్రేక్షకులకు మరింత ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు రాబోతుంది. బిగ్ బాస్ లాంటి కాన్సెప్ట్ తోనే, కానీ సింగిల్ గా కాకుండా ఈ సారి జోడీలతో అలరించబోతుంది. ఈ షోకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ జడ్జీగా వ్యవహరిస్తున్నాడు.

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్

కొత్త రియాలిటీ షో (x/jiohotstartel)
కొత్త రియాలిటీ షో (x/jiohotstartel)

ఒక ఇంట్లో 10 జంటలను పెట్టి, వీళ్ల మధ్య పోటీ పెట్టి ఎవరు బెస్ట్ అని నిర్ణయించడానికి ఒక కొత్త రియాలిటీ గేమ్ షోతో స్టార్ మా వచ్చేస్తోంది. ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ అనే పేరుతో ఈ షోను గ్రాండ్ గా లాంఛ్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ షో అప్ డేట్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంటున్న స్టార్ మా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.

అనిల్ రావిపూడి

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి ఇప్పటికే టాప్ యాంకర్ శ్రీముఖితో అనౌన్స్ మెంట్ చేసేశారు. ఇప్పుడిక ఈ రియాలిటీ షోకు ఒక జడ్జీగా అనిల్ రావిపూడిని ఇంట్రడ్యూస్ చేశారు.

‘‘ఎఫ్2 చూశారు.. ఎఫ్3 కూడా చూశారు. మరి ఎఫ్10కి రెడీ హా? 10 సెలబ్రిటీ జంటలు. 10 రెట్ల ఫన్. 10 రెట్ల ఫ్రస్టేషన్, ప్రేమకు ఒక అల్టిమేట్ పరీక్ష. మా చీఫ్ రిలేషన్ షిప్ ఆఫీసర్ అనిల్ రావిపూడి నుంచి ఎవరు ఫైనల్ అప్రూవల్ పొందుతారో చూడాలి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కమింగ్ సూన్’’ అని ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

షో ఫార్మాట్ ఇలా

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకు శ్రీముఖి హోస్ట్ అని తెలిసింది. ఈ షోలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు తమ పార్ట్ నర్ లతో పార్టిసిపేట్ చేయబోతున్నారని తెలిసింది. హరిత హరీష్, నటరాజ్ మాస్టర్ తమ భార్యలతో కలిసి షోలో పాల్గొనబోతున్నారని సమాచారం. అలాగే ప్రియాంక జైన్-శివకుమార్, సోనియా సింగ్-పవన్, వాసంతి-పవన్ కల్యాణ్ లాంటి వైరల్ జంటలు కూడా పోటీకి సై అంటున్నాయని టాక్.

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోను ప్రతి రోజు రాత్రి ఒక గంట పాటు స్టార్ మాలో టెలికాస్ట్ చేస్తారని తెలిసింది. జియోహాట్ స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తారని సమాచారం.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks