...
...
Next Story

మహావతార్ నరసింహ మరో చరిత్ర.. ఆస్కార్ బరిలో ఇండియన్ యానిమేటెడ్ మూవీ.. ఈ ఓటీటీలో స్ట్రీమింగ్

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి, బాక్సాఫీస్ ను షేక్ చేసిన మహావతార్ నరసింహ మూవీ మరో చరిత్ర నమోదు చేసింది. ఇండియా నుంచి ఆస్కార్ బరిలో నిలిచిన తొలి యానిమేటెడ్ మూవీగా రికార్డు అందుకుంది. ఈ చిత్రం ఏ ఓటీటీలో ఉందంటే?

Published on: Nov 25, 2025, 13:26:37 IST
Advertisement

2025లో టాక్ ఆఫ్ ది సినిమాగా మారిన చిత్రం మహావతార్ నరసింహా. ఈ యానిమేటెడ్ మూవీ రికార్డులు కొల్లగొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడీ చిత్రం మరో చరిత్ర నమోదు చేసింది. ఆస్కార్ రేసులో నిలిచింది. ఆస్కార్ 2026కు నామినేట్ అయిన యానిమేటెడ్ సినిమాల్లో మహావతార్ నరసింహా కూడా ఉంది.

మహావతార్ నరసింహా రికార్డు

ఆస్కార్ బరిలో మహావతార్ నరసింహా (x)
ఆస్కార్ బరిలో మహావతార్ నరసింహా (x)

యానిమేటెడ్ సినిమా మహావతార్ నరసింహ మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. ఆస్కార్ కు నామినేట్ అయిన ఇండియన్ ఫస్ట్ యానిమేటెడ్ మూవీగా ఇది నిలిచింది. ఆస్కార్ వాళ్లు తాజాగా ప్రకటించిన యానిమేటెడ్ సినిమాల నామినేషన్ల లిస్ట్ లో మహావతార్ నరసింహా కూడా చోటు దక్కించుకుంది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డు కోసం 35 సినిమాలు పోటీపడుతున్నాయి.

బ్లాక్ బస్టర్

మహావతార్ నరసింహ యానిమేటెడ్ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. కేజీఎఫ్, సలార్ లాంటి భారీ సినిమాలను నిర్మించింది హోంబలే ఫిల్మ్స్ అన్న సంగతి తెలిసిందే. అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి యానిమేటెడ్ మూవీగా మహావతార్ నరసింహా జులై 25, 2025న థియేటర్లలో రిలీజైంది. జనాలకు ఇది విపరీతంగా నచ్చేసింది.

రూ.30 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ యానిమేటెడ్ మూవీగా చరిత్ర నమోదు చేసింది.

మహావతార్ నరసింహ ఓటీటీ

ఓటీటీలోనూ మహావతార్ నరసింహ దూకుడు కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లొ ఇది సెప్టెంబర్ 19న రిలీజైంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్ని వారాల పాటు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగింది. ఇప్పటికీ స్ట్రీమింగ్ లో అదరగొడుతోంది.

మహావతార్ నరసింహా కథ

హరినే ఎదురించి ముల్లోకాలకు అధిపతి తానేనంటాడు. అయితే హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు.. విష్ణువుకు మహా భక్తుడిగా మారతాడు. కొడుకును చంపాలని హిరణ్యకశిపుడు ఎంత ప్రయత్నించినా హరి కాపాడుతూనే ఉంటాడు. చివరకు నరసింహావతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు విష్ణువు. ఈ కథను అద్భుతమైన విజువల్స్ తో అదిరిపోయేలా చూపించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks