Anil Ravipudi Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో మరోసారి వీళ్ల కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తాజాగా అనిల్- మహేష్ మూవీ సెట్ అంటూ ప్రచారం చేస్తున్నారు.
మహేష్- అనిల్ కాంబో

సరిలేరు నీకెవ్వరు మూవీ భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా, వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధాన్ని కూడా ఏర్పరిచింది. దీంతో అనిల్ రావిపూడి- మహేష్ బాబు కాంబోలో మళ్లీ ఒక సినిమా వస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ మళ్లీ కుదిరిందంటూ నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
2028 సంక్రాంతి
ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో మహేష్ బాబు హీరోగా భారీ చిత్రం 'వారణాసి' చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది ఈ చిత్రాన్ని సంక్రాంతి 2028 నాటికి థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
అనిల్ రావిపూడి రియాక్షన్
అయితే మహేష్ బాబుతో సినిమా తీస్తున్నాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశారు.
‘‘సూపర్ స్టార్ మహేష్ బాబు నాకెప్పుడూ ఆత్మీయుడే. ఆయన పట్ల అంతులేని ప్రేమ, గౌరవం ఉంది. ఇప్పుడు చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదు. దయచేసి ఇలాంటివి నమ్మకండి. ఈ వార్తలను షేర్ చేయకండి’’ అని అనిల్ రావిపూడి తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్పష్టతనిచ్చారు.
'వారణాసి' తర్వాతే
ప్రస్తుతం మహేష్ బాబు తన దృష్టినంతటినీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ చిత్రం 'వారణాసి' పైనే పెట్టారు. ఈ సినిమా పూర్తి కాకుండా ఆయన మరొక చిత్రానికి కమిట్ అవ్వలేదని సమాచారం.
{{/usCountry}}ప్రస్తుతం మహేష్ బాబు తన దృష్టినంతటినీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ చిత్రం 'వారణాసి' పైనే పెట్టారు. ఈ సినిమా పూర్తి కాకుండా ఆయన మరొక చిత్రానికి కమిట్ అవ్వలేదని సమాచారం.
{{/usCountry}}'వారణాసి' తర్వాత చేయబోయే సినిమా కోసం మహేష్ సరికొత్త కథల అన్వేషణలో ఉన్నారు. వచ్చే ఏడాదిలో తన తదుపరి చిత్రంపై మహేష్ బాబు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా మహేష్ బాబుతో సినిమా చేస్తారనే ప్రచారం ఉంది.
మల్టీస్టారర్
మరోవైపు అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్- కళ్యాణ్ రామ్ తో మల్టీస్టారర్ చేస్తున్నారు. ఈ మూవీకి ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది.