మహేష్ బాబు అభిమానులకు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మరో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి పాత్ర చేస్తున్నారని వెల్లడించారు. అలాగే రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాన్నే సినిమాగా తీస్తున్నామని కూడా రివీల్ చేశారు.
రాముడి వేషం

‘‘మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమా ప్రారంభించినప్పుడు రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని అనుకోలేదు. ఒక్కో సీన్ రాస్తుంటే గాల్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ డే మహేష్ ను రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫొటోషూట్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఆ ఫోటోను వాల్ పేపర్ గా కూడా పెట్టుకున్నా. కానీ ఎవరైనా చూస్తారేమో అని తీసేశా’’ అని రాజమౌళి చెప్పారు.
ఇప్పుడు వీడియో
‘‘నన్ను, మహేష్ ను కలిపినందుకు కేఎల్ నారాయణకు థ్యాంక్స్. కొన్ని సినిమాలకు ముందే కథ చెప్పడం కుదురుతుంది. కొన్నింటికి కుదరదు. ఇలాంటి సినిమా కథను మాటల్లో చెప్పడం కుదరదు. ఒక్క మాట చెప్పకుండా వీడియో చూస్తే సినిమాలోని కథ ఏంటో అర్థమయ్యేలా చేయాలనుకున్నాం. కానీ వీడియో రాలేదు. కానీ వర్షాలు వచ్చాయి. మొత్తానికి నవంబర్ 15కి వీడియోతో వచ్చాం’’ అని రాజమౌళి పేర్కొన్నారు.
కొత్త టెక్నాలజీ
‘‘టైటిల్ చెప్పకుండా దిజ్ ఫిల్మ్ అంటుంటే చాలా కష్టంగా ఉంది. చిన్నప్పుడు ఎన్టీఆర్ సినిమాలే చూసేవాణ్ని. కానీ ఇండస్ట్రీకి వచ్చాక కృష్ణ గొప్పతనం అర్థమైంది. ఎన్నో ప్రయోగాలు చేశారు. కొత్త టెక్నాలజీలు పరిచయం చేశారు. మేం కొత్త టెక్నాలజీ ఫిల్మ్ డ్ ఫర్ ఐమ్యాక్స్ ఇంట్రడూస్ చేస్తున్నాం. ఈ మూవీని ఫుల్ స్క్రీన్ పై చూడొచ్చు’’ అని రాజమౌళి తెలిపారు.
షూటింగ్ కు వస్తే మహేష్ బాబు సెల్ ఫోన్ పట్టుకోడు. ఎన్ని గంటలైనా సరే. షూటింగ్ అయ్యేంతవరకూ కార్లోనే పెట్టేస్తాడు. ఇది అందరూ నేర్చుకోవాలి. నేను కూడా అలాగే చేసేందుకు ట్రై చేస్తా.
టెక్నికల్ ప్రాబ్లెం
ట్రైలర్ రిలీజ్ సమయంలో టెక్నిికల్ ప్రాబ్లెం రావడం పట్ల రాజమౌళి ఎమోషనల్ అయ్యారు. ‘‘దేవుడి మీద పెద్ద నమ్మకం లేదు. నాన్న వచ్చి హనుమ వెనకాల ఉంటాడు, నడిపిస్తాడని చెప్పారు. ఇది అయిన వెంటనే కోపం వచ్చింది. ఇలాగేనా నడిపించేదని. మా ఆవిడకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం. ఆమెపైనా కోపమొచ్చింది’’ అని ఎమోషనల్ అయ్యారు రాజమౌళి.