Mahesh Babu: సూపర్‌స్టార్ కృష్ణ వారసత్వాన్ని, దివంగత రమేష్ బాబు జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్తూ ఘట్టమనేని కుటుంబం నుంచి మరో కొత్త వారసుడు వెండితెరకు పరిచయమవుతున్నాడు. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని కథానాయకుడిగా నటిస్తున్న తొలి చిత్రం 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ మూవీ జూలై 30న రిలీజ్ కానుంది.
మహేష్ బాబు వీడియో

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీనివాస మంగాపురం సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ సీనియర్ భామ రవీనా టండన్ కుమార్తె రాషా తడానీ (Rasha Thadani) హీరోయిన్‌గా పరిచయమవుతోంది. తాజాగా తన అన్న కొడుకు సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా వీడియో మెసేజ్ విడుదల చేస్తూ మేకర్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
వైజయంతీ మూవీస్ సెంటిమెంట్
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ వైజయంతీ మూవీస్ బ్యానర్‌తో తమ కుటుంబానికి ఉన్న ప్రత్యేక బంధాన్ని గుర్తుచేసుకున్నారు. "నాకు, అల్లు అర్జున్‌కు, రామ్ చరణ్‌కు వైజయంతీ మూవీస్ లక్కీ బ్యానర్‌గా మారింది. మేమంతా ఈ బ్యానర్‌లోనే డెబ్యూ చేశాం.
అదే లక్ జయకృష్ణకు, రాషా తడానీకి కూడా దక్కాలని కోరుకుంటున్నాను. మా కుటుంబమంతా ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది" అని మహేష్ బాబు తెలిపాడు.
రాజకుమారుడు రిలీజ్ డేట్
అంతేకాకుండా, తన తొలి చిత్రం 'రాజాకుమారుడు' విడుదలైన జూలై 30వ తేదీనే 'శ్రీనివాస మంగాపురం' కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుందని మహేష్ బాబు తెలిపాడు. ఈ చిత్ర టీజర్లు, ట్రైలర్లు, పాటలు తనకు ఎంతగానో నచ్చాయని, జీవి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన 'అల్లెల్లె' సాంగ్ తన ఫేవరెట్ సాంగ్ అని చెప్పాడు.
జయకృష్ణ కాన్ఫిడెన్స్
{{/usCountry}}అంతేకాకుండా, తన తొలి చిత్రం 'రాజాకుమారుడు' విడుదలైన జూలై 30వ తేదీనే 'శ్రీనివాస మంగాపురం' కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుందని మహేష్ బాబు తెలిపాడు. ఈ చిత్ర టీజర్లు, ట్రైలర్లు, పాటలు తనకు ఎంతగానో నచ్చాయని, జీవి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన 'అల్లెల్లె' సాంగ్ తన ఫేవరెట్ సాంగ్ అని చెప్పాడు.
జయకృష్ణ కాన్ఫిడెన్స్
{{/usCountry}}కెమెరా ముందు జయకృష్ణ చాలా కాన్ఫిడెంట్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడని మహేష్ బాబు ప్రశంసించాడు. కొత్త నటీనటులతో దర్శకుడు అజయ్ భూపతి ఎంతో రియలిస్టిక్, గ్రాండెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తీర్చిదిద్దారని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి డెబ్యూ టీమ్‌ను ఆశీర్వదించాలని కోరాడు. నాన్నగారి అభిమానులు, తన అభిమానులు ఈ సినిమాను ఆదరించాలని రిక్వెస్ట్ చేశాడు.
భారీ ఓపెనింగ్స్ ఖాయం!
టాలీవుడ్ ట్రేడ్ విశ్లేషణ ప్రకారం, పెద్ద బ్యానర్ల నుంచి వస్తున్న స్టార్ కిడ్స్ డెబ్యూ సినిమాలకు సరైన కమర్షియల్ హంగులు తోడైతే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు ఉంటాయి. వైజయంతీ మూవీస్ నిర్మాణ విలువలు, అజయ్ భూపతి టేకింగ్, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కాంబినేషన్ కలసిరావడం 'శ్రీనివాస మంగాపురం' బిజినెస్‌కు మార్కెట్‌లో మంచి హైప్‌ను తెచ్చిపెట్టింది.