...
...
Next Story

Mahesh Babu Nephew Engagement: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి నిశ్చితార్థం- నమ్రతా శిరోద్కర్ హాజరు- ఫొటోలు షేర్!

Mahesh Babu Nephew Siddharth Galla Engagement: సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నాడు. గల్లా జయదేవ్ చిన్న కుమారుడు అయిన సిద్ధార్థ్ తన లాంగ్ టైమ్ సౌత్ కొరియన్ గర్ల్‌ఫ్రెండ్ హయిన్ కిమ్‌తో ఇటలీ వేదికగా గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు.

Published on: Jul 13, 2026, 14:32:39 IST
Advertisement

Mahesh Babu Nephew Siddharth Galla Engagement: గల్లా జయదేవ్ కుటుంబంలో మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు బావ ఇంట్లో సరికొత్త సంబరానికి తెరలేచింది. మహేశ్ బాబు సోదరి పద్మావతి- బావ గల్లా జయదేవ్‌కి ఇద్దరు కుమారులు.

బిజినెస్ వ్యవహారాలు

కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి నిశ్చితార్థం- నమ్రతా శిరోద్కర్ హాజరు- ఫొటోలు షేర్!
కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి నిశ్చితార్థం- నమ్రతా శిరోద్కర్ హాజరు- ఫొటోలు షేర్!

వీరిలో పెద్దావాడైన అశోక్ గల్లా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు హీరోగా సుపరిచితమే. ప్రస్తుతం విసా అనే సినిమా రిలీజ్ పనుల్లో అశోక్ గల్లా ఉన్నాడు. ఇక గల్లా జయదేవ్ చిన్న కుమారుడు సిద్ధార్థ్ గల్లా ప్రస్తుతం కుటుంబానికి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు.

ఇప్పుడు సిద్ధార్థ్ గల్లా వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. తన స్నేహితురాలు, సౌత్ కొరియాకు చెందిన హయిన్ కిమ్ (జిన్నీ)తో సిద్ధార్థ్ నిశ్చితార్థం ఎంతో వైభవంగా జరిగింది. టాలీవుడ్‌లో సెలబ్రిటీల పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు అనగానే విదేశీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ట్రెండ్ నడుస్తోంది.

రింగ్ సెర్మనీ

అదే బాటలో గల్లా కుటుంబం కూడా ఇటలీలోని ఒక అందమైన లొకేషన్‌ను ఎంచుకుంది. అత్యంత ఆప్తమిత్రుల సమక్షంలో సిద్ధార్థ్ గల్లా-హయిన్ కిమ్ రింగ్ సెర్మనీని నిర్వహించారు.

నమ్రత శిరోద్కర్ ఇన్ స్టా పోస్ట్ వైరల్

ఈ వేడుకకు సంబంధించిన అందమైన ఫొటోలను మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఘట్టమనేని అభిమానులకు సరికొత్త జోష్ ఇస్తూ ఈ గుడ్ న్యూస్ చెప్పారు.

ఈ పోస్ట్ చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఆ కొత్త జంటకు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీకి బంధువులైన గల్లా కుటుంబం నుంచి జయదేవ్ పెద్ద కుమారుడు అశోక్ గల్లా హీరోగా రాణిస్తున్నారు. 'హీరో' సినిమాతో అశోక్ గల్లా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే, అశోక్ తమ్ముడు సిద్ధార్థ్ గల్లా మాత్రం మొదటి నుంచి సినిమా గ్లామర్ ప్రపంచానికి, సోషల్ మీడియా హంగామాకు దూరంగా ఉంటున్నారు. కార్పొరేట్ రంగంలో తన కెరీర్‌ను ఎంచుకున్న సిద్ధార్థ్, వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. ఘట్టమనేని కుటుంబంలో జరిగే ముఖ్యమైన పండుగలు, వేడుకలకు మాత్రమే ఆయన హాజరవుతుంటారని సమాచారం.

సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన కొరియన్ అమ్మాయి

ప్రైవేట్ లైఫ్ ఇష్టపడే సిద్ధార్థ్, ఇప్పుడు విదేశీ అమ్మాయిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటలీలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకలో సిద్ధార్థ్, హయిన్ కిమ్ ఇద్దరూ మ్యాచ్ అయ్యేలా సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు.

వధువు హయిన్ కిమ్ కూడా లైమ్‌లైట్‌కు దూరంగా ఉండేందుకే ఇష్టపడతారు. ఈ నిశ్చితార్థం పూర్తయిన నేపథ్యంలో గల్లా కుటుంబం త్వరలోనే వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు చేయనున్నారు. త్వరలోనే పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe