ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న టైమ్ ఎట్టకేలకు వచ్చింది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు ‘వారణాసి’ అనే పేరు పెట్టారు. ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ ను పెడతారని ముందే నుంచే ప్రచారం సాగింది. అనుకున్నట్లుగానే ఈ టైటిల్ నే ఫిక్స్ చేశారు మేకర్స్.
మూవీ టైటిల్ వారణాసి

మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఓ మూవీ రెడీ అవుతోంది. ఈ సినిమా టైటిల్ పై ఇన్ని రోజులూ సస్పెన్స్ నెలకొంది. శనివారం (నవంబర్ 15) గ్లోబ్‌ట్రాటర్ పేరుతో ఈ సినిమా ఈవెంట్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లోనే మూవీ టైటిల్, మహేష్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారనే టాక్ వినిపించింది. అనుకున్నట్లుగానే ఈవెంట్ స్టార్ట్ కాకముందే టైటిల్ గ్లింప్స్ ను అక్కడి స్క్రీన్ లపై ప్లే చేశారు.
అదిరిపోయిన మహేష్ లుక్
వారణాసి సినిమా నుంచి రిలీజైన మహేష్ బాబు లుక్ అదిరిపోయింది. టైటిల్ గ్లింప్స్ వీడియోలో ముందుగా మహేష్ లుక్ ను రివీల్ చేశారు. చేతిలో త్రిశూలం పట్టుకుని, నందిలా కొలిచే ఎద్దుపై వస్తూ యాక్షన్ అవతార్ లో మహేష్ కనిపించాడు. ఆ తర్వాత వారణాసి అని మూవీ టైటిల్ ప్లే అయింది.
ఇప్పటికే రిలీజ్
రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ అనగానే ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. వీళ్ల కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్ డేట్ల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ వచ్చారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ను కుంభగా, ప్రియాంక చోప్రాను మందాకినిగా పరియం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేశారు మేకర్స్. ఇవి వైరల్ గా మారాయి.
మరో లెవల్
బాహుబలి 1, 2, ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రాల తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు రాజమౌళి. ఇది హాలీవుడ్ రేంజ్ లో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీతో మహేష్ బాబు కెరీర్ మరో రేంజ్ కు వెళ్లడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
{{/usCountry}}బాహుబలి 1, 2, ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రాల తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు రాజమౌళి. ఇది హాలీవుడ్ రేంజ్ లో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీతో మహేష్ బాబు కెరీర్ మరో రేంజ్ కు వెళ్లడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
{{/usCountry}}