Mahesh Babu Review: సూపర్ స్టార్ మహేష్ బాబు వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ నటించిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' (Don't Trouble The Trouble) సినిమా చూసి మైండ్ బ్లాకింగ్ రివ్యూ ఇచ్చేశారు. అక్టోబర్ 2న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూసిన మహేష్.. సినిమా చాలా హ్యాపీగా, ఎమోషనల్‌గా అనిపించిందని సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఫహాద్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్.. స్సారాతో క్రేజీ కెమిస్ట్రీ

ఈ సినిమా చూసిన వెంటనే మహేష్ బాబు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. "డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా చూశాను. ఇదొక బ్యూటిఫుల్ అండ్ కంప్లీట్ మూవీ ఎక్స్‌పీరియన్స్. చాలా చక్కగా తెరకెక్కించిన ఒక హ్యాపీ ఫిలిం. మనసును హత్తుకుంటూనే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది" అని మహేష్ కొనియాడారు.
సినిమా అంతటా ఒక ప్రశాంతమైన అనుభూతి, మంచి ఫీల్ గుడ్ వైబ్ కనిపిస్తుందని చెప్పారు. అలాగే లీడ్ రోల్స్ చేసిన ఫహాద్ ఫాజిల్, చైల్డ్ ఆర్టిస్ట్ సారా పాలేకర్ పర్ఫార్మెన్స్‌ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. "ఫహాద్ సర్.. మీరు అద్భుతమైన నటుడు. మీరు కొత్తగా ప్రయోగాలు చేస్తూ మిమ్మల్ని మీరు మార్చుకునే తీరు అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఫహాద్, క్యూట్ సారాల కాంబినేషన్ స్క్రీన్ పై చాలా బ్రిలియంట్‌గా ఉంది. వాళ్లు నటిస్తున్నట్లు కాకుండా ఆ పాత్రల్లో జీవిస్తున్నట్లు అనిపించింది" అని రాసుకొచ్చారు.
కార్తికేయ డ్రీమ్ ప్రొడక్షన్.. శశాంక్ విజన్ సూపర్
ఈ సినిమాతో ఎస్ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ (Showing Business) ప్రొడ్యూసర్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. డెబ్యూ ప్రొడ్యూసర్‌గా కార్తికేయ సాధించిన విజయంపై మహేష్ స్పందిస్తూ.. "కార్తికేయ.. ఒక ప్రొడ్యూసర్‌గా నీకు ఇంతకంటే స్పెషల్ బిగినింగ్ దొరకదు. సినిమా కోసం పడ్డ కష్టానికి ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు. నువ్వు, శోభు కలిసి చాలా స్పెషల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు" అని విష్ చేశారు.
డైరెక్టర్ శశాంక్ ఏలేటి వర్కింగ్ స్టైల్‌ను కూడా మహేష్ బాబు ప్రశంసించారు. ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారని, కాలభైరవ అందించిన మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పారు. టీమ్ అందరి చేతిలో ఒక అరుదైన జెమ్ ఉందంటూ టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
రాజమౌళి సమర్పణలో.. అక్టోబర్ 2న థియేటర్లలో మ్యాజిక్
{{/usCountry}}డైరెక్టర్ శశాంక్ ఏలేటి వర్కింగ్ స్టైల్‌ను కూడా మహేష్ బాబు ప్రశంసించారు. ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారని, కాలభైరవ అందించిన మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పారు. టీమ్ అందరి చేతిలో ఒక అరుదైన జెమ్ ఉందంటూ టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
రాజమౌళి సమర్పణలో.. అక్టోబర్ 2న థియేటర్లలో మ్యాజిక్
{{/usCountry}}దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్ ఉంది. రీసెంట్‌గా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హాజరై ప్రమోషన్లలో జోష్ నింపగా, ఇప్పుడు మహేష్ బాబు కూడా సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇవ్వడం బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న భారీ పాన్-వరల్డ్ మూవీ వారణాసి ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో పాటు సినిమాలోని కంటెంట్ బాగా నచ్చడంతోనే మహేష్ ఈ రేంజ్‌లో రెస్పాండ్ అయ్యారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని మహేష్ పిలుపునిచ్చారు.